Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 ఫస్ట్ కంటెస్టెంట్‌గా నటి తనూజ ఎంట్రీ.. కన్నీళ్లు పెట్టించిన యంగ్ బ్యూటీ
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంఛ్ అట్టహాసంగా జరిగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ప్రియులకు సంబరమే వచ్చింది. ఈ ఏడాది 2025 సీజన్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి కావడం విశేషం. కంటెస్టెంట్ల ఎంపిక కూడా ఇప్పటికే రసవతంగా జరిగింది. ఇక హౌజ్ లోకి కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించడమే మిగిలింది. ఇప్పటికే రెండు రకాలుగా కంటెస్టెంట్లను ఎంపిక చేశారు. ఇందులో సెలబ్రిటీ కంటెస్టెంట్లు, కామనర్స్ ఉండటం గమనార్హం. వీరిలో (నెంబర్) మరో కంటెస్టెంట్ గా తనుజ పుట్టస్వామి కూడా ఉండటం విశేషం.
బెంగళూరులో పుట్టి పెరిగిన తనుజ పుట్టస్వామి తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తగ్గించుకుంది. టెలివిజన్ రంగంలో ఆమె టాప్ సీరియల్లో నటించి బుల్లితెర ఆడియన్స్ కు ఎంతగానో దగ్గర అయింది. ఈమె పుట్టి పెరిగింది కర్ణాటక రాష్ట్రంలో అయినా కూడా తెలుగు సీరియల్ తో మరింతగా ఆకట్టుకోగలిగింది. 1992 మార్చి 5న తనుజ పుట్టస్వామి జన్మించారు. ఆమెకు టెలివిజన్ రంగంలో తనుజ గౌడ అనే మరో పేరు కూడా ఉంది. తెలుగు ప్రేక్షకుల్లో ఈ పేరు ఎక్కువగా వాడకంలో ఉంది. ఈమె తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోని టెలివిజన్ సీరియల్లలో నటించి దక్షిణాదిన బాగా పాపులర్ అయ్యింది.

తెలుగులో తనుజ గౌడ ముద్ద మందారం అనే సీరియల్ లో నటించి ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయింది. ఈ సీరియల్ 1500 ఎపిసోడ్స్ వరకు టెలికాస్ట్ కావడం విశేషం. అలాగే తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలోనే అందాల రాక్షసి అనే సీరియల్ లోను లీడ్ రోల్ లో నటించి అలరించింది. ఇక తమిళంలో శివ మనస్సుల శక్తి అనే సీరియల్ ద్వారా తమిళ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కించుకుంది. ఇక హీరోయిన్ గాను వెండితెరపై కన్నడ చిత్రం 6-5=2 అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా తెలుగులో చిత్రం కాదు నిజం అనే టైటిల్ తో విడుదలైంది. ఇక ఇప్పుడు తనుజ గౌడ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంటర్ అవడం విశేషం.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు బిగ్ బాస్ లోకి రావడం సంతోషంగా ఉందని చెప్పింది. ఇక తను 9 విషయాల్లో స్ట్రాంగ్ కమిట్ మెంట్ గా ఉంటానని తన అభిరుచులను చెప్పుకొచ్చింది. ఆమె ఒక్కసారి డిజైన్ అయితే మాత్రం అస్సలు వెనక్కి తగ్గను అని చెప్పుకొచ్చింది. ఏదైనా చేయాలని అనుకుంటే మాత్రం చేసే వరకు ఊరుకోనని తన పట్టుదలను చెప్పింది. అయితే తన తండ్రికి బిగ్ బాస్ హౌజ్ లోకి వస్తున్నట్టుగా మాత్రం చెప్పలేదని నాగార్జునతో చెప్పింది. అందుకు కారణం తమ ఇంట్లో వాళ్లకు ఇండస్ట్రీ అంటే పెద్దగా నమ్మకం లేదని చెప్పుకొచ్చింది.
హౌజ్ నుంచి బయటికి వెళ్లిన తర్వాత మా నాన్న నాకు పనిష్ మెంట్ ఇస్తారని అనింది. అస్సలు ఆయన నాతో మాట్లాడరని వివరించింది. ఇక కొన్ని రోజులు ఆయన మాట్లాడరని చెప్పింది. బిగ్ బాస్ హౌజ్ లో తన సత్తా చూపిస్తానని హామీనిచ్చింది. ఈ సందర్భంగా నాగార్జున స్పందిస్తూ తమ తల్లిదండ్రులకు బిగ్ బాస్ హౌజ్ వేదిక ద్వారా హామీనిచ్చారు. అమ్మాయిలకు మా ఇంట్లో రక్షణ ఉంటుందని, ఇది నా మాట అని నాగార్జున తనూజ గౌడ తండ్రికి, కుటుంబ సభ్యులకు హామీనిచ్చారు.
The first contestant of Bigg Boss 9 is here! 👑 Thanuja is ready to set the house on fire with her energy, charm & fierce moves ❤️🔥
— JioHotstar Telugu (@JioHotstarTel_) September 7, 2025
The doors are open 🏠 Catch the Grand Launch of #BiggBossSeason9 , playing NOW only on #StarMaa#BiggBossTelugu9 #BiggBossTelugu9GrandLaunch pic.twitter.com/QevVB6k5xu


Click it and Unblock the Notifications











