తమన్నా లిప్‌లాక్ రూల్.. మిల్క్ బ్యూటీ ఎందుకు బ్రేక్ చేసిందో తెలుసా?

హీరోయిన్ తమన్నా భాటియా సౌత్, బాలీవుడ్ చిత్రాల్లో నటించి ఇండియాలో స్టార్ హీరోయిన్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. నార్త్ కు చెందిన మిల్క్ బ్యూటీ ముంబైలో పుట్టి పెరిగింది. కానీ తమన్నా భాటియాకు సౌత్ చిత్రాలతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కింది. కానీ హిందీలోనే తొలి చిత్రం నటించింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. 2006లో శ్రీ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తోంది. తొలుత తమన్నా భాటియా హ్యాపీడేస్ చిత్రంతో హిట్ అందుకుంది. దీంతో టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది.

ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఆనంద తాండవం, 100% లవ్, బద్రీనాథ్, ఊసరవెల్లి, రచ్చ, ఎందుకంటే ప్రేమంటే, రెబల్, కెమెరామెన్ గంగాతో రాబాంబు, ఆగడు, బాహుబలి , బెంగాల్ టైగర్ వంటి చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ చెరగని ముద్ర వేసుకుంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అటు బాలీవుడ్ లోనూ వరుస పెట్టి సినిమాలు చేస్తూనే వస్తోంది. ఇలా సౌత్, బాలీవుడ్ లో, కోలీవుడ్ లో గుర్తుండిపోయే సినిమాలు చేసింది. దాంతో ఇండియా మొత్తంగా తమన్నా భాటియా ప్రేక్షకుల హృదయాల్లో చోటు దక్కించుకుంది.

Actress Tamannaah Bhatia gave Clariy on her Kissing Scenes

అయితే తమన్నా భాటియా తను కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి 15 ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉండింది. స్టార్ హీరోల సరన నటించే ఛాన్స్ లు దక్కించుకుంది. కరోనా ముందు ఎఫ్ :2 చిత్రంతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత తమన్నా భాటియాకు టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో క్రేజ్ తగ్గి పోయింది. దీంతో తమన్నా కోలీవుడ్, బాలీవుడ్లో దుమ్ములేపుతూ వచ్చింది. అలాగే తెలుగు, తమిళ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు వచ్చినన్నీ రోజులు తమన్నా భాటియా సరిగా వినియోగించుకుంది. అయితే ఈ సమయంలో మిల్క్ బ్యూటీ బోల్డ్ సీన్లకు ఏమాత్రం ఏకీభవించలేదు. కానీ కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం అయిన తర్వాత అవకాశాల కోసం తను పెట్టుకున్న లిప్ లాక్ రూల్ ను తానే చెరిపేసుకుంది. ఇక హిందీ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా వంటి చిత్రాలతో బోల్డ్ సీన్స్, ముద్దు సీన్లలో రెచ్చిపోయి నటించింది. ఒక్కసారి తమన్నా భాటియా రూటు మార్చడంతో అంతా షాక్ అయ్యారు.

అయితే ఈ విషయంపై తమన్నా భాటియా ఇటీవల బాలీవుడ్ మీడియాలో స్పందించింది. అయితే తన చిత్రాల్లో నో కిస్ రూల్ ను పాటించడం వల్లనే చాలా వరకు పెద్ద ప్రాజెక్ట్స్ మిస్ అయ్యాయని తమన్నా భాటియా చెప్పుకొచ్చింది. దాంతో మరింత బలమైన పాత్రలను చేసే అవకాశం ఉందని తెలిపింది. తన యాక్టింగ్ రేంజ్ కూడా మారిపోతుందని భావించిందంట. అందుకే నో కిస్ రూల్ ను బ్రేక్ చేసినట్టు చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X