»   » బిగ్ బాస్: ఇడియట్ అంటూ శివాలెత్తిన శివబాలాజీ.... తాప్సీ ఎంట్రీ!

బిగ్ బాస్: ఇడియట్ అంటూ శివాలెత్తిన శివబాలాజీ.... తాప్సీ ఎంట్రీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో ఎవరూ ఊహించని టాస్క్‌లతో ఆసక్తికరంగా సాగుతోంది. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా సాగిన ఫైవ్ స్టార్ హోటల్ గేమ్‌లో గెస్టులుగా చేసిన నవదీప్, దీక్షా పంత్.... హోటల్ సిబ్బందిగా చేసిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు మంచి ప్రదర్శన కనబర్చారు.

బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లను ఇరు వర్గాలు విజయవంతంగా పూర్తి చేశారు. అయితే బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఎక్కువ పాయింట్లు సాధించడంతో ఈ టాస్క్‌లో విజేతలుగా నిలిచారు. సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేసిన నవదీప్, దీక్షలు వచ్చే వారం ఎలిమినేషన్ నుండి సురక్షితులు అయ్యారు.

శివాలెత్తిన శివ బాలాజీ

శివాలెత్తిన శివ బాలాజీ

అయితే బిగ్ బాస్ ఇంట్లో ట్యాప్ వాటర్ మురికి రావడంతో శివ బాలాజీ బిగ్ బాస్ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. రియాల్టీ షో కోసం అని పిలిచి సరైన నీటి సౌకర్యం కల్పించక పోవడంపై మండి పడ్డారు. ఇడియట్ అంటూ బిగ్ బాస్‌ను తిట్టేశాడు.

ఆదర్శ్‌తో ఆ పని చేయించుకున్న దీక్ష

ఆదర్శ్‌తో ఆ పని చేయించుకున్న దీక్ష

ఫైవ్ స్టార్ హోటల్ గెస్టుగా చేసిన దీక్ష..... హోటల్ సిబ్బందిగా చేసిన ఆదర్శ్ చేత అండర్ ఆర్మ్(చంక)లో వెంట్రుకలు క్లీన్ చేయించుకోవడం హాట్ టాపిక్ అయింది. దీక్ష ఇలాంటి పని చేయించుకోవడం చూసి ఇతర ఇంటి సభ్యులు నివ్వెర పోయారు.

ఆనందంతో గెంతులు

ఆనందంతో గెంతులు

ఫైవ్ స్టార్ హోటల్ టాస్క్‌లో భాగంగా గెస్టులకు రుచికరమైన వంటకాలు చేసేందుకు భారీగా తిండి సామాగ్రి బిగ్ బాస్ పంపించిన సంగతి తెలిసిందే. టాస్క్ విజయవంతంగా పూర్తి చేయడం మిగిలిన ఆహార పదార్థాలు బిగ్ బాస్ ఇంటి సభ్యులు వాడుకోవచ్చని సూచించడంతో..... ఇన్నాళ్లు రుచికరమైన తిండి లేక అల్లాడిపోయిన ఇంటి సభ్యులు ఆనందంతో గెంతులేశారు.

తాప్సీ

కాగా..... బిగ్ బాస్ ఇంట్లోకి హీరోయిన్ తాప్సీ ఎంట్రీ ఇవ్వబోతోంది. గురువారం ప్రసారం అయ్యే షోలో తాప్సీ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతోంది. తాప్సీ నటించిన ‘ఆనందో బ్రహ్మ' సినిమా ప్రమోషన్లో భాగంగా ఒకరోజు పాటు బిగ్ బాస్ ఇంట్లో తాప్సీ గడపబోతోంది.

English summary
Tapsee Pannu is the latest celeb to use Bigg Boss for the sake of promotions. She will enter the House for generating buzz about 'Anando Brahma' releasing on August 18th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X