అందుకే తెలుగు అమ్మాయిలు సీరియల్స్‌కు దూరమవుతున్నారు.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్
తెలుగు బుల్లితెరపై కన్నడ నటీనటుల ప్రభావం కొత్తగా కాదు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతోంది. సినిమాల తర్వాత ఇప్పుడు తెలుగు సీరియల్స్‌లో కూడా స్థానికులను పక్కన పెట్టి కన్నడ నటీనటులు లీడ్ రోల్స్ ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. కేవలం సీరియల్స్ లోనే కాదు. జబర్దస్త్, బిగ్‌బాస్ వంటి షోల్లో కూడా కన్నడ వారికి అవకాశమిస్తున్నారనే వాదనలున్నాయి. గత కొన్నాళ్లుగా తెలుగువారి బుల్లితెరపై కన్నడ భామల హవా కొనసాగుతోందనే కామెంట్స్ తరుచూ వినబడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ ఆంశంపై నటి విష్ణుప్రియ ((Vishnu Priya) కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?
తెలుగు సిరీయల్ నటి విష్ణుప్రియ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో కెరీర్‌ను ఆరంభించి, హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించారు ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. చాలా మంది నటులు సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వెళ్లే.. విష్ణుప్రియ మాత్రం సినిమాల నుంచి సీరియల్స్‌లోకి వచ్చి తన ప్రతిభతో బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె సీరియల్స్, టీవీ షోలతో బిజీగా ఉంది.

తాజాగా జబరస్థ్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న కిసిక్ టాక్ షో విష్ణుప్రియ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్వూలో తన ఇండస్ట్రీ అనుభవాలను పంచుకుంటూ ఎమోషనల్ అయింది. 'సీరియల్స్‌లో మెయిన్ లీడ్‌గా నటిస్తే నెలలో 15-16 రోజులు కంటిన్యూగా వర్క్ ఉంటుంది. టాప్ 5 ప్రధాన పాత్రల్లో నటిస్తే 10-12 రోజులు పని ఉంటుంది. అప్పుడు 'హాసిని' అనే పాత్ర చేయాల్సి వచ్చింది. ఆ పాత్ర చేశాక కొందరు ఎందుకు ఇలాంటి క్యారెక్టర్ చేశావు, ఇప్పటివరకు మెయిన్ లీడ్‌గా చేసి ఇప్పుడు సైడ్ రోల్ చేస్తే తెలుగువారికి ఛాన్స్ ఎవరిస్తారు?' అంటూ విమర్శించారు. కానీ ఆ పాత్ర చేసిన తర్వాత ప్రేక్షకుల స్పందన అద్భుతంగా వచ్చింది," అని చెప్పింది.
తరువాత సీరియల్ ముగిసిన తర్వాత ప్రధాన పాత్రల కోసం ప్రయత్నిస్తే, తనకు సైడ్ క్యారెక్టర్లు మాత్రమే రావడం మొదలైందని తెలిపింది. "ఎంత ఆలోచించినా ఎందుకు అలాగైందో అర్థం కాలేదు. అందుకే కొంత కాలం బ్రేక్ తీసుకున్నా," అంటూ విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. "సైడ్ క్యారెక్టర్లు చేసిన తర్వాత మళ్లీ మెయిన్ లీడ్‌గా నటించాలని ప్రయత్నించాను, కానీ గతంలో అలాంటి పాత్ర చేసిన అనే కారణంగా పక్కన పెట్టారు. అయినా నేను నిరాశ చెందలేదు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా చేసుకుంటూ వెళ్లాలి. రానీ అవకాశాల కోసం ఎక్కువ ఆశ పడకూడదు," అని ఆమె భావోద్వేగంగా వెల్లడించింది.
అదే ఇంటర్వ్యూలో తెలుగు సీరియల్స్‌లో కన్నడ నటీనటుల ఆధిపత్యంపై కూడా స్పందించింది. "నిర్మాతలు ముందుగా తెలుగువారినే తీసుకోవాలని చూస్తారు. కానీ తెలుగు అమ్మాయిలే సీరియల్స్ మీద ఆసక్తి చూపడం లేదు. వాళ్లకు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, సోషల్ మీడియా వీడియోలపై ఎక్కువ ఆసక్తి. చాలామందికి సీరియల్ ఆఫర్స్ వచ్చినా రిజెక్ట్ చేస్తున్నారు. కొందరిని ఇంట్లో వాళ్లు ఆపేస్తున్నారు. అలా స్థానాలు ఖాళీగా ఉండిపోతే నిర్మాతలు వేరే భాష నటీనటులను తీసుకోవాల్సి వస్తుంది" అని క్లారిటీ ఇచ్చింది.
అలాగే "ప్రతి కొత్త సీరియల్‌కి కొత్త ఫేస్ కావాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే వేరే భాష నటీనటులు ఎక్కువగా వస్తున్నారు. వాళ్లు మొదట భాషతో ఇబ్బంది పడినా బాగా కష్టపడి నేర్చుకుంటున్నారు," అని అన్నారు. విష్ణుప్రియ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తెలుగువారు సీరియల్స్ మీద ఆసక్తి చూపకపోవడం వల్లే వేరే భాష నటీనటులు ముందుకు వస్తున్నారని ఆమె చెప్పిన ఈ మాటలు ఇప్పుడు బుల్లితెరలో పెద్ద చర్చకు దారితీశాయి.


Click it and Unblock the Notifications











