Akhanda డిస్నీ+హాట్‌స్టార్‌లో అఖండ గర్జన.. పరమశివుని అనుగ్రహంతోనే.. బాలకృష్ణ ఎమోషనల్
నటసింహం, బాక్సాఫీస్ బోనాంజా నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల పరంపరను కొనసాగిస్తున్నది. 50 రోజుల తర్వాత ఈ చిత్రం డిస్నీ+హాట్‌స్టార్ ఓటీటీ యాప్‌లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపిస్తున్న మాదిరిగానే ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను స్పందిస్తూ..

పరమశివుని వర ప్రసాదంగా అఘోరా పాత్రలో
అఖండ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఎన్నడూ కనిపించని విధంగా పవర్‌ఫుల్ రోల్ అఘోర పాత్రలో నటించారు. హైందవ ధర్మ పరిరక్షకుడిగా, పరమశివుని వర ప్రసాదంగా, మైనింగ్ మాఫియా ఉచ్చులో పడిన గ్రామ రక్షకునిగా కనిపించారు. అఖండంలో బాలకృష్ణతోపాటు జగపతి బాబు, శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్, షామ్నా ఖాసీం, సుబ్బరాజు ముఖ్య పాత్రలలో కనిపించారు, ఈ చిత్రానికి సంగీతం ఎస్ ఎస్ థమన్. ఈ చిత్రంలోని పాటలతో పాటుగా నేపథ్య సంగీతం కూడా ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.

జనవరి 21వ తేదీన డిస్నీ+హాట్‌స్టార్‌లో
ఇక 50 రోజుల తర్వాత జనవరి 21వ తేదీన డిస్నీ+హాట్‌స్టార్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు అఖండ చిత్రం 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా ఒక రోజు వ్యవధిలోనే 1 మిలియన్ అంటే 10 లక్షల మంది వ్యూవర్లు చూసిన చిత్రంగా ఘనతను సంపాదించుకొన్నది. భారతీయ సినిమా పరిశ్రమలో ఏ హీరో కూడా సాధించని రికార్డును బాలకృష్ణ సొంతం చేసుకొన్నాడు.

రికార్డు సంఖ్యలో ప్రేక్షకుల వీక్షణ
అఖండ సృష్టిస్తున్న ప్రభంజనంపై డిస్నీ+హాట్‌స్టార్ కంటెంట్ హెడ్, డిస్నీ స్టార్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ హెచ్‌ఎస్‌ఎం గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ .. ఓటీటీలో అఖండ చిత్రానికి వస్తున్న స్పందనతో చాలా సంతోషంగా ఉన్నాం. థియేటర్లలోనే కాకుండా డిస్నీ+హాట్‌స్టార్‌లో రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని డిస్నీ+హాట్‌స్టార్‌పై స్ట్రీమింగ్ చేయడం ఆరంభించిన మరుక్షణమే వీక్షించడానికి రికార్డు సంఖ్యలో ప్రేక్షకులు సిద్ధమయ్యారు. ఈ స్ట్రీమింగ్ ప్రీమియర్‌కు వీక్షకుల నిరీక్షణ, ప్రతిస్పందన అపూర్వమైనది' అని అన్నారు

పరమశివుని అనుగ్రహంతో బాక్సాఫీస్ రికార్డులు
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. నాకు ఎల్లప్పుడూ అండగా ఉండే నా ప్రేక్షకులకు ధన్యవాదాల తెలుపుతున్నాను. ప్రతి చిత్రంలోనూ విభిన్నంగా చేయడానికి ప్రయత్నిస్తుంటా. పరమశివుని అనుగ్రహంతో బాక్సాఫీస్ వద్ద అఖండ మూవీ 50 రోజులు ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్ వద్ద రికార్డులను సృష్టిస్తూ ఓపెనింగ్‌లూ వచ్చాయి. ఒటీటీ ద్వారా మరింతగా సినీ అభిమానులకు ఈ చిత్రం చేరువ కావడం ఆనందంగా ఉంది అని అన్నారు.

అఖండతో మూడో బ్లాక్‌బ్లస్టర్
అఖండ చిత్రం సాధిస్తున్న రికార్డులపై దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ నందమూరి నటసింహం బాలకృష్ణతో ఇది నా మూడో బ్లాక్‌బ్లస్టర్ చిత్రం. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నందుకు నా థ్యాంక్స్. 50 రోజుల తర్వాత కూడా డిస్నీ+హాట్‌స్టార్ వద్ద భారీ స్థాయిలో ప్రేక్షకుల చూడటం సంతోషంగా ఉంది. కోవిడ్ కారణంగా చాలా మంది థియేటర్‌లో చూడలేకపోయారు. వారంతా ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్ వద్ద ఈ చిత్రం వీక్షిస్తూ ఆస్వాదిస్తున్నారనేది స్పష్టమైంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











