Just In
- 2 min ago
అమ్మ బాబోయ్ ఇది మామూలు ప్లానింగ్ కాదు.. ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’తో మల్లెమాల భారీ స్కెచ్
- 24 min ago
మొత్తానికి ఒక కొత్త అమ్మాయిని సెట్ చేసుకున్న అఖిల్..!
- 44 min ago
వరుణ్ అలా.. నిహారిక ఇలా.. పెళ్లి తరువాత మాటలు తగ్గాయి: నాగబాబు షాకింగ్ కామెంట్స్
- 1 hr ago
సెట్లోకి వెళ్లేముందు అలా ఎంజాయ్.. విజయ్ దేవరకొండ వీడియో వైరల్
Don't Miss!
- News
పవన్ కల్యాణ్‌కు ఎమ్మెల్యే అన్నా రాంబాబు బంపర్ ఆఫర్: అసెంబ్లీకి వెళ్లే ఛాన్స్: జగన్ బొమ్మ చాలు
- Sports
గబ్బా రమ్మన్నాడు.. వెళ్లాక చేతులెత్తేశాడు.. ఆసీస్ కెప్టెన్‌పై అశ్విన్ సెటైర్లు
- Finance
4 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.15 లక్షల కోట్లు జంప్: అదరగొట్టిన రిలయన్స్
- Lifestyle
ముఖాన్ని అందంగా మార్చడానికి ఐస్ క్యూబ్ ఫేషియల్ మసాజ్
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన మోనాల్ గజ్జర్: బిగ్ బాస్‌కు రాకముందే అఖిల్ కోసం ఆ పని చేసిందట!
తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా.. మంచి పేరును సంపాదించుకుంది గుజరాతీ భామ మోనాల్ గజ్జర్. నటిగా వచ్చిన పేరు కంటే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన తర్వాత మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా హౌస్‌లో ఇద్దరు కంటెస్టెంట్లతో లవ్ ట్రాకులు నడిపి బాగా హైలైట్ అయింది. బిగ్ బాస్ దత్త పుత్రికగా పేరు తెచ్చుకున్న ఆమె.. బిగ్ బాస్ షోకు రాకముందే అఖిల్ సార్థక్ కోసం ఓ పని చేశానని తాజా ఎపిసోడ్‌లో తన పర్సనల్ సీక్రెట్‌ను ఒకటి లీక్ చేసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

నర్మదా నది.. వాటర్ ఇచ్చి క్లోజ్ అయింది
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో మొదటి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది ప్రముఖ హీరోయిన్ మోనాల్ గజ్జర్. తొలిరోజు మిగిలిన కంటెస్టెంట్లు అందరికీ స్వాగతం పలుకుతూ వాటర్ ఇచ్చి మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత తరచూ ఏడుస్తూ నర్మదా నది అనే బిరుదును అందుకుంది. అంతేకాదు, ఈ సీజన్‌లో ఎక్కువ సార్లు ఏడ్చిన కంటెస్టెంట్‌గా ఆమె పేరు మారుమ్రోగిపోతోంది.

ముందు అభితో.. ఆ తర్వాత అఖిల్ సార్థక్
బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన సమయంలో యంగ్ హీరో అభిజీత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది మోనాల్ గజ్జర్. దీంతో అతడితో ప్రేమాయణం సాగిస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. ఇలాంటి సమయంలో అతడికి ఊహించని విధంగా గుడ్‌బై చెప్పేసిన ఈ బ్యూటీ.. మరో కంటెస్టెంట్ అఖిల్ సార్థక్‌కు క్లోజ్ అవడంతో పాటు అతడితో ప్రేమలో పడిపోయిందీ గుజరాతీ అమ్మాయి.

పుల్లలు పెట్టి... ఆ గొడవలకు కారణమైంది
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో జరిగిన గొడవల్లో ఎక్కువ భాగం మోనాల్ గజ్జర్ వల్లే మొదలయ్యాయి. అభిజీత్ - అఖిల్ సార్థక్ మధ్య వార్‌కు ప్రధాన కారణం అయిన ఆమె.. ఆ తర్వాత ఎంతో మంది మధ్య పుల్లలు పెట్టింది. మరీ ముఖ్యంగా సోహెల్ - అఖిల్ మధ్య పలుమార్లు గొడవలు పెట్టాలని చూసింది. ఓ సారి ఈ విషయం వాళ్లకు వీడియో ద్వారా వివరించాడు హోస్ట్ అక్కినేని నాగార్జున.

అఖిల్‌తో దూరంగా.. ఇప్పుడు తట్టుకోలేక
ఫినాలేకు చేరువ కావడంతో ఇకపై అంతా ఎవరి గేమ్ వాళ్లు ఆడాలని బిగ్ బాస్ పదే పదే చెప్పాడు. హోస్ట్ నాగార్జున కూడా ప్రతి ఒక్కరినీ ఈ విషయంపై అలెర్ట్ చేశాడు. దీంతో మోనాల్ గజ్జర్ తన ఆట తాను ఆడాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే అఖిల్‌కు వ్యతిరేకంగా టాస్కులు ఆడింది. దీంతో ఇద్దరి మధ్యా దూరం పెరిగింది. ఇక, ఈ మధ్య అఖిల్ ప్రవర్తన చూసి తట్టుకోలేకపోతోంది.

పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన మోనాల్ గజ్జర్
శనివారం జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు అందరితో ఓ ఆట ఆడించాడు నాగార్జున. ఇప్పుడున్న ఐదుగురిలో మీకు నచ్చిన ముగ్గురు కంటెస్టెంట్లు, నచ్చని ఇద్దరు ఎవరో చెప్పమన్నాడు. అంతేకాదు, మొదట్లో ఆయా కంటెస్టెంట్ గురించి ఏమనుకున్నారు? ఇప్పుడేమనుకుంటున్నారు? అనేది చెప్పమన్నాడు. ఈ సమయంలో మోనాల్ తన పర్సనల్ సీక్రెట్ రివీల్ చేసింది.

బిగ్ బాస్‌కు ముందే అఖిల్ కోసం ఆ పని
ఈ గేమ్‌లో భాగంగా అఖిల్ సార్థక్‌ను మంచి వ్యక్తిగా చెప్పిన మోనాల్.. ‘అఖిల్ ఇంట్లోకి రాగానే చాలా యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి అని అనుకున్నా. మొదట్లో అంతగా కలిసేవాడు కాదు. నిజానికి నేను బిగ్ బాస్‌లోకి రాకముందే అతడి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ చెక్ చేశా. అప్పుడే బాగా ఇంప్రెస్ అయ్యాను. ఎంతైనా మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ కదా' అంటూ వివరించిందీ బ్యూటీ.