Hyderabad Times Most Desirable Man on TV Akhil Sarthak: ముఖ్యంగా ఆ అమ్మాయిలకు థాంక్స్!

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు బాగా నచ్చిన రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ అని చెప్పక తప్పదు. ఇప్పటికే తెలుగులో ఈ రియాల్టీ షో నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. అయితే మొదటి సీజన్ కు తారక్ హోస్ట్ గా వ్యవహరించగా రెండో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్న ఈ షో నాలుగో సీజన్ లో అఖిల్ అలాగే అభిజిత్ ఇద్దరు ఫైనల్స్ వరకు వెళ్లారు. ఇద్దరి మధ్య పోటీ గట్టిగా ఉండడంతో చివరికి అఖిల్ రన్నరప్ గా నిలవగా అభిజిత్ విన్నర్ గా నిలిచాడు.

అయితే ఈ సీజన్లో విన్నర్ గా నిలిచిన అభిజిత్ కి పెద్దగా అవకాశాలు దక్కలేదు రన్నరప్ గా నిలిచిన అఖిల్ కి కూడా పెద్దగా అవకాశాలు తగ్గలేదు..అదేం విచిత్రమో మిగతా కంటెస్టెంట్స్ కి మంచి అవకాశాలు దక్కాయి అనే చెప్పాలి. అయితే తాజాగా అఖిల్ కు అనుకోకుండా అరుదైన గౌరవం దక్కింది. ప్రతి ఏడాది హైదరాబాద్ టైమ్స్ వాళ్లు నిర్వహించే మోస్ట్ డిజైరబుల్ టీవీ పర్సనాలిటీ 2020 మేల్ కేటగిరీలో అఖిల్ సార్థక్ కి మొదటి స్థానం దక్కింది. ఈ విషయాన్ని హిందుస్థాన్ టైమ్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

 Akhil Sarthak becomes Hyderabad Times Most Desirable Man Telugu on TV 2020

బిగ్ బాస్ సీజన్ 4వ సీజన్ 2020లో టెలికాస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఏడాదికి గాను అఖిల్ కి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఇన్ టీవీ అవార్డు దక్కినట్లు అయింది. ఇక ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా పంచుకున్న అఖిల్ ఇది కేవలం మీ వల్లే సాధ్యమైందని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తనకు సపోర్ట్ చేసిన అమ్మాయిలందరికీ ఆయన థాంక్స్ చెప్పాడు. అలాగే ఇప్పుడు గర్వంగా అఖిలే నెంబర్ వన్ అని చెబుతున్నాను అని అన్నాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఇది జరిగితే బాగుంటుందని అనుకున్నాను అని, ఇప్పుడు అలాగే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X