Just In
Don't Miss!
- News
Republic day:72వ గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటున్న భారత్
- Finance
కేంద్ర బడ్జెట్ యాప్, ఆ తర్వాతే అందుబాటులో డాక్యుమెంట్స్
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మోనాల్ షాకిచ్చింది.. నన్ను వదిలేసి అతడితో వెళ్లిపోయింది: లవ్ స్టోరీపై అఖిల్ కామెంట్స్ వైరల్
బిగ్ బాస్ అంటేనే రియల్ ఎమోషన్స్‌తో సాగే షో అన్న టాక్ ఉంది. ఇందులో కంటెస్టెంట్లుగా పాల్గొనే ప్రతి ఒక్కరు తమలోని అసలైన రూపాన్ని కచ్చితంగా బయట పెట్టాల్సి వస్తుంది. ఎన్ని రోజులు నటించాలని ప్రయత్నించినా సాధ్యం కాదన్నది తెలిసింది. అందుకే హౌస్‌లో ఎన్నో రకాల ఎమోషన్స్ బయటకు వస్తుంటాయి. ఇలా ప్రతి సీజన్‌లోనూ ప్రేమికులుగా కొందరు పరిచయం అవుతుంటారు. అలా ఈ సీజన్‌లో అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ జంట ఫేమస్ అయింది. హౌస్‌లో వీళ్లిద్దరూ అంతలా రచ్చ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా తన లవ్ స్టోరీ బయటపెట్టాడు అఖిల్. ఆ వివరాలు మీకోసం!

మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌గా షోలోకి ఎంట్రీ
మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించాడు అఖిల్ సార్థక్. ఈ క్రమంలోనే మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఇన్ హైదరాబాద్‌గా ఎంపికయ్యాడు. అదే సమయంలో ‘బావ మరదలు' అనే షార్ట్ ఫిలిం ద్వారా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. అలాగే, ‘కల్యాణీ' అనే సీరియల్‌తో బుల్లితెరపైనా మెరిశాడు. ఇలా ఫేమస్ అవడంతో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

మోనాల్ గజ్జర్‌తో లవ్ ట్రాకుతో పాపులర్
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో బాగా ఫోకస్ అయిన వాటిలో అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ జంట ఒకటి. షో ఆరంభంలో అభిజీత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఆమె.. ఆ తర్వాత అతడికి పూర్తిగా దూరమైపోయింది. అదే సమయంలో అఖిల్‌కు బాగా దగ్గరైంది. అప్పటి నుంచి అతడి కోసమే ఆడుతూ.. అతడితోనే ఉంటూ వార్తల్లో నిలిచింది. దీంతో అఖిల్ కూడా పాపులర్ అయ్యాడు.

ముద్దులు.. హగ్గులు.. గొడవలు.. స్నేహం
బిగ్ బాస్ హౌస్‌లో ఎక్కువ ఎమోషన్స్ చూపించిన కంటెస్టెంట్లలో అఖిల్ సార్థక్ పేరును ముందుగా చెప్పుకోవచ్చు. దీనికి కారణం షో ఆరంభంలో ఒంటరిగా ఉన్న అతడు.. మోనాల్ దగ్గరైన తర్వాత తనలోని లవ్ యాంగిల్‌ను బయట పెట్టాడు. ఈ క్రమంలోనే హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయారు. ఆ తర్వాత సోహెల్‌తో స్నేహం.. చివర్లో తనలోని రొమాంటిక్ యాంగిల్ చూపించాడు.

రన్నరప్‌తో సరిపెట్టుకున్న అఖిల్ సార్థక్
బిగ్ బాస్ నాలుగో సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇందులో అభిజీత్ గెలుస్తాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే, రన్నరప్ విషయంలో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్కంఠభరితంగా సాగిన గ్రాండ్ ఫినాలేలో సయ్యద్ సోహెల్ రియాన్ రూ. 25 లక్షలు తీసుకుని వెళ్లిపోవడంతో.. అఖిల్ సార్థక్ టాప్-2లోకి వచ్చి రన్నర్ అయ్యాడు.

మోనాల్ షాకిచ్చింది అంటూ లీక్ చేశాడు
ఇదే ఇంటర్వ్యూలో మోనాల్ గజ్జర్‌తో ఉన్న బంధం గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. ‘సోహెల్ లాగే ఆమె కూడా నాకు జాన్. చాలా క్లోజ్. హీరోయిన్ కావడం వల్ల అట్రాక్ట్ అయిన మాట నిజమే. అందుకే ఎఫెక్షన్ ఏర్పడింది. షో నుంచి బయటకు వచ్చాక.. నిన్న మా ఇంటికి నేరుగా వచ్చేసి షాకిచ్చింది. మా అమ్మ లొకేషన్ పంపడం వల్లే ఆమె వచ్చిందని తర్వాత తెలిసింది' అని చెప్పాడు.

నన్ను వదిలేసి అతడితో వెళ్లిపోయింది
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మిగిలిన కంటెస్టెంట్ల మాదిరిగానే అఖిల్ సార్థక్ కూడా వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ స్టోరీ బయట పెట్టాడు. గతంలో ఓ అమ్మాయిని ప్రేమించానని, ఆమె వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని చెప్పాడు. ఆ తర్వాత ఎంత ట్రై చేసినా ఆమె పట్టించుకోలేని చెప్పాడు.