Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మోనాల్ గురించి నోరు జారిన అఖిల్: దాన్ని పట్టుకుని ఇంటికొచ్చేసిందంటూ బాంబ్ పేల్చాడు
దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతూ ఏ సీజన్‌కు ఆ సీజన్ ప్రత్యేకతను చాటుకుంటోంది బిగ్ బాస్. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా తెలుగులో పరిచయం అయిన వెంటనే ప్రేక్షకాదరణను అందుకుని సత్తా చాటింది. ఈ కారణంగానే మన దగ్గర నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక, ఈ మధ్య ముగిసిన నాలుగో సీజన్‌లో హాట్ టాపిక్ అయిన విషయాల్లో అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ ట్రాక్ ఒకటి. చాలా రోజుల పాటు మజాను పంచిన ఈ ఇద్దరూ ఫుల్ ఫేమస్ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా అఖిల్.. మోనాల్ గురించి నోరు జారాడు. వివరాల్లోకి వెళ్తే..

సాదాసీదాగా ఎంట్రీ.. ఎనలేని క్రేజ్ సొంతం
సాదాసీదా కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి అడుగు పెట్టాడు యాంగ్రీ యంగ్ మ్యాన్ అఖిల్ సార్థక్. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచే తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. ప్రతి విషయంలోనూ పక్కాగా ఉంటూ తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించాడు. గంగవ్వతో మనవడి రిలేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. దీంతో అతడికి ఎనలేని క్రేజ్ సొంతం అయింది.

లవ్ ట్రాకుతో మరింత పాపులర్ అయ్యాడు
మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన అఖిల్ సార్థక్.. లవ్ ట్రాకు వల్ల బాగా ఫేమస్ అయ్యాడు. ప్రముఖ హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో అతడు చనువుగా ఉండడంతో పాటు ఆమెకు ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకునే వాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం మొదలైంది. అందుకు అనుగుణంగానే హౌస్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు వీళ్లిద్దరూ.

ముద్దులు.. హగ్గులతో రొమాన్స్ పండించి
ఓ వీకెండ్ ఎపిసోడ్‌లో తన మనసులో A ఉన్నాడని పరోక్షంగా అఖిల్ సార్థక్‌పై ఉన్నా ప్రేమను బయట పెట్టింది మోనాల్ గజ్జర్. అప్పటి నుంచి వీళ్లిద్దరూ హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయారు. మరీ ముఖ్యంగా అతడి పుట్టినరోజును పురస్కరించుకుని గార్డెన్ ఏరియాలో ముద్దుల వర్షం కురిపించిందామె. దీంతో ప్రతిరోజూ నా బర్త్‌డే అయితే బాగుండు అని అఖిల్ చేసిన కామెంట్ వైరల్ అయింది.

నెంబర్ వన్ అంటూ రన్నరప్‌గా నిలిచాడు
బిగ్ బాస్ నాలుగో సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇందులో అభిజీత్ గెలుస్తాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ, అఖిల్ సార్థక్ మాత్రం తానే నెంబర్ వన్ అంటూ కామెంట్లు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్కంఠభరితంగా సాగిన గ్రాండ్ ఫినాలేలో ప్రేక్షకుల మద్దతుతో అభిజీత్ విజయం సాధించగా.. అఖిల్ సార్థక్ టాప్-2లోకి వచ్చి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.

మోనాల్ గురించి నోరు జారిన అఖిల్ సార్థక్
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అఖిల్ సార్థక్ వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌తో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా తనకు మోనాల్ గజ్జర్ అంటే లవ్ అని ఒప్పుకున్నాడు. అంతేకాదు, ఆమె తన ఇంటికి వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చిందని కూడా చెప్పాడు. దీంతో ఈ జంట మరోసారి హైలైట్ అవుతోంది.

దాన్ని పట్టుకుని ఇంటికొచ్చేసిందని బాంబ్
ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ప్రేమ ఉండబట్టే నేను ఆమెపై ప్రతిసారీ కోప్పడే వాడిని' అని నోరు జారాడు అఖిల్. అంతేకాదు, ‘ఆమెకు నేనంటే ఇష్టం. నాకు ఆమె మీద క్రష్ ఉంది. అది షోలో ఎప్పుడూ చెప్పలేదని.. దాన్ని పట్టుకుని నిన్న మా ఇంటికి వచ్చింది' అని చెప్పాడు. అయితే, అఖిల్ సార్థక్ మాత్రం ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేశాడా లేదా అన్నది వెల్లడించలేదు.