Just In
- 3 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 3 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 4 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 5 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- News
కరోనా వ్యాక్సిన్ డ్రైవ్: 12.7 మందికి టీకా, ఏడో రోజు 2 లక్షలకుపైగా హెల్త్‌కేర్ సిబ్బందికి వ్యాక్సిన్
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సోహెల్‌కు ఊహించని కష్టాలు: హౌస్‌లో అతడితో.. బయట ఆమెతో.. ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం!
సయ్యద్ సోహెల్ రియాన్.. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరిది. దీనికి కారణం ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఆడుతుండడమే. ఎన్నో సినిమాలు, సీరియళ్లలో నటించిన ఈ సింగరేణి ముద్దుబిడ్డ.. అంతకు ముందే మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. బిగ్ బాస్‌లో అద్భుతమైన ఆటతీరుతో ఔరా అనిపిస్తున్నాడు. ఇక, ఫినాలేకు ముందు హౌస్‌లో అతడి వల్ల.. బయట ఆమె వల్ల సోహెల్‌కు ఊహించని కష్టాలు మొదలయ్యాయి. ఇది ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. వివరాల్లోకి వెళితే...

నాలుగో సీజన్‌లో బెస్ట్ ఫైటర్‌గా పేరు
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఫేమ్ ఉన్న కంటెస్టెంట్లు చాలా తక్కువ మందే ఉన్నారు. సయ్యద్ సోహెల్ రియాన్ కూడా అందులో ఒకడు. సీరియళ్లలో యాక్టింగ్ చేయడం ద్వారా అతడికి గుర్తింపు ఉంది. ఇక, ఆరియానాతో కలిసి సీక్రెట్ రూమ్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన అతడు.. తక్కువ సమయంలోనే తన మార్క్ చూపించి బెస్ట్ ఫైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అదే సోహెల్‌కు చెడ్డ పేరును తెచ్చింది
ప్రతి టాస్కులోనూ వందకు వంద శాతం శ్రమిస్తూ మంచి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సోహెల్. అందుకే అందరి కంటే తక్కువ సార్లు నామినేషన్స్‌లో ఉన్నాడు. మరోవైపు, అతడికి ఇట్టే కోపం వచ్చేస్తుంది. దీని వల్ల హౌస్‌లోకి దాదాపు అందరు కంటెస్టెంట్లతో గొడవలు జరిగాయి. ఆడవారిపైనా అతడు రెచ్చిపోతుంటాడు. ఇదే తీరుతో సోహెల్‌కు చెడ్డ పేరు కూడా వచ్చింది.

ఫ్రెండ్‌షిప్ కోసం చాలా త్యాగం చేశాడు
బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభం నుంచీ సోహెల్.. అఖిల్ సార్థక్, మెహబూబ్ దిల్‌సేతో బాగా స్నేహంగా ఉండేవాడు. ఏది చేసినా ముగ్గురూ కలిసే చేసేవారు. అందుకే తరచూ గొడవలు కూడా జరిగేవి. ఇదిలాఉండగా, ఫ్రెండ్‌షిప్ కోసం అతడు తరచూ ఏదో ఒకటి త్యాగం చేస్తూనే ఉన్నాడు. కెప్టెన్సీ టాస్కుల దగ్గర నుంచి మొన్నటి రేస్ టు ఫినాలే మెడల్ వరకు అలాగే చేశాడు.

ఫినాలేలో ఉంటాడని అంతా అన్నారు
ఆ మధ్య కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మరికొందరు నాగార్జునతో కలిసి స్టేజ్ మీద కనిపించారు. ఆ సమయంలో ప్రతి కంటెస్టెంట్‌కు చెందిన ఫ్యామిలీ మెంబర్లు వాళ్ల ఉద్దేశంలో టాప్-5 కంటెస్టెంట్ల పేర్లు చెప్పారు. ఇందులో ఎక్కువ సార్లు కనిపించింది సోహెల్ ఫొటోనే. వాళ్లే కాదు.. బయట జనాలు కూడా అతడు ఫినాలేలో ఉంటాడని అంటున్నారు.

సోహెల్‌కు ఊహించని కష్టాలు మొదలు
నేరుగా నామినేషన్ పెడితే ఇబ్బందులు తప్పవని భావించాడో ఏమో.. ఈ సారి బిగ్ బాస్ అఖిల్ మినహా అందరినీ నేరుగా నామినేట్ చేశాడు. వారం మొత్తం టాస్కులు ఇచ్చి ప్రేక్షకుల మనసులు దోచుకోమని చెబుతున్నాడు. దీంతో ఈ వారం ఓటింగ్‌లో ఎప్పటి లాగే అభిజీత్ టాప్‌లో ఉన్నాడు. ఇక, సోహెల్ విషయానికి వస్తే.. అతడికి ఊహించని కష్టాలు మొదలయ్యాయి.

హౌస్‌లో అతడితో... బయట ఆమెతో
బిగ్ బాస్ హౌస్‌లో అఖిల్ సార్థక్ వల్ల చాలా కోల్పోయిన సోహెల్.. ఇప్పుడు అతడి ఫ్యాన్స్ వల్ల ఓట్లు కోల్పోతున్నాడు. దీనికి కారణం.. మోనాల్ గజ్జర్ కూడా నామినేషన్స్‌లో ఉండడమే. అఖిల్ నామినేషన్స్‌లో లేకపోతే ఆమెకు సపోర్ట్ చేసిన ఫ్యాన్స్.. ఇప్పుడు సోహెల్ ఉన్నా మోనాల్‌కే ఓటింగ్ చేస్తున్నారు. ఇది అతడి ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందన్న టాక్ వినిపిస్తోంది.