Just In
- 19 min ago
ఇది నిజమైతే మెగా అభిమానులకు పండగే.. శంకర్ దర్శకత్వంలో బిగెస్ట్ మల్టీస్టారర్?
- 25 min ago
ఆ సీఎం విషయంలో చిరంజీవి సంచలన నిర్ణయం: ముగ్గురు స్టార్ హీరోలు ఒప్పుకోకపోవడం వల్లే ఇలా!
- 59 min ago
విజయ్ తర్వాత సీనియర్ హీరోతో పూరీ జగన్నాథ్: ఫాంటసీ కథతో హిట్ కాంబో రిపీట్
- 1 hr ago
ఆదిపురుష్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. సీత పాత్రలో బ్యూటీఫుల్ హీరోయిన్
Don't Miss!
- News
గోమాతకు సీమంతం చేసి మురిసిపోయిన దంపతులు .. రీజన్ ఇదే !!
- Finance
అదే డొనాల్డ్ ట్రంప్ టార్గెట్, చైనా హువావేకు అమెరికా భారీ షాక్
- Automobiles
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?
- Sports
భారత్ X పాక్ గొడవ.. సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు సమస్య!
- Lifestyle
Mercury Transit in Aquarius : బుధుడు కుంభరాశిలోకి ఎంట్రీ.. ఈ రాశుల వారు జర భద్రం...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నా బరువు మోయడానికి రెడీగా ఉంది: మోనాల్ ఎదుటే ఆ కంటెస్టెంట్‌పై అఖిల్ షాకింగ్ కామెంట్స్
తెలుగు బిగ్ బాస్ షో ఎప్పుడు ప్రసారం అయినా మంచి స్పందననే అందుకుంటోది. ఫలితంగా ఇది ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్ సైతం విజయవంతంగా నడిపిస్తున్నారు నిర్వహకులు. ఈ సీజన్ మొత్తానికి మోస్ట్ ఎఫెక్టెడ్ లవర్‌గా పేరు తెచ్చుకున్నాడు అఖిల్ సార్థక్. సహచర సభ్యురాలు మోనాల్ గజ్జర్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్న కారణంగానే అతడికీ పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో హౌస్‌లోని మరో కంటెస్టెంట్‌పై అఖిల్ హాట్ కామెంట్స్ చేశాడు. దీంతో ఆమె నాలుగు పీకింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

ఫైనల్‌కు చేరువ.. పెరుగుతోన్న ఆసక్తి
బిగ్ బాస్ నాలుగో సీజన్ రికార్డు స్థాయి రేటింగ్‌తో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ సీజన్ ఇప్పటికే 80 రోజులు పూర్తి చేసుకుంది. అదే సమయంలో ఫైనల్‌కు కూడా చేరువైంది. దీంతో నిర్వహకులు షోను మరింత రంజుగా మార్చేందుకు కొత్త కొత్త టాస్కులు, సర్‌ప్రైజింగ్ అంశాలు తీసుకొస్తున్నారు. ఫలితంగా రోజురోజుకూ నాలుగో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది.

ఉన్నది ఏడుగురే.. మూడు గ్రూపులు
బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. వారిలో అఖిల్ సార్థక్, సోహెల్ రియాన్, మోనాల్ గజ్జర్ ఒక గ్రూపుగా.. ఆరియానా గ్లోరీ, అవినాష్ మరో గ్రూపుగా ఉంటున్నారు. మిగిలిన ఇద్దరు అభిజీత్, దేత్తడి హారిక ఎప్పటి నుంచో కలిసి ఉంటున్నారు. దీంతో టాస్కుల విషయంలో ఈ మూడు గ్రూపుల మధ్య విపరీతమైన పోటీ కనిపిస్తోంది.

మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అంటూ ప్రకటన
నాలుగో సీజన్ ఆరంభం నుంచీ మోనాల్ గజ్జర్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడు అఖిల్ సార్థక్. తరచూ రొమాంటిక్‌గా మాట్లాడుకోవడం, హగ్గులు, ముద్దులిచ్చుకోవడం, టాస్కుల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడం వంటి వాటితో హాట్ టాపిక్‌గా నిలిచారీ ఇద్దరు. అఖిల్ అయితే ఒకనొక సందర్భంలో ఆమె విషయంలో తానే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అని కూడా ప్రకటించుకున్నాడు.

అఖిల్ ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు
బిగ్ బాస్ షోలో ఎప్పుడూ మోనాల్ గజ్జర్‌తోనే ఉంటూ హైలైట్ అవుతూ వచ్చేవాడు అఖిల్ సార్థక్. కానీ, కొద్ది రోజులుగా అతడి ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కావాలనే ఆమెను దూరం పెట్టడంతో పాటు నామినేట్ చేసేందుకు సైతం వెనుకాడలేదు. అంతేకాదు నీ మీద నాకు ట్రస్ట్ ఇష్యూయ్ (నమ్మకం కోల్పోయాను) ఉన్నాయి అంటూ మొహం మీదే చెప్పేస్తున్నాడు.

ఆ కంటెస్టెంట్‌పై అఖిల్ హాట్ కామెంట్స్
మోనాల్ గజ్జర్‌తో దూరం అయిన తర్వాత అఖిల్ సార్థక్.. మిగిలిన హౌస్‌మేట్స్ అందరితోనూ సరదాగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తరచూ ఎవరో ఒకరిని ఆట పట్టిస్తూ కనిపిస్తున్నాడు. గత ఎపిసోడ్‌లో సోహెల్‌తో కలిసి అవినాష్‌ను ఓ ఆట ఆడుకున్నాడు కూడా. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఆరియానా గ్లోరీపై హాట్ కామెంట్స్ చేసి మరోసారి హైలైట్ అవుతున్నాడు.

నా బరువు మోయడానికి రెడీగా ఉంది
తాజా ఎపిసోడ్‌లో అవినాష్‌ను మరోసారి ఆట పట్టించాడు అఖిల్. స్విమ్మింగ్ ఫూల్ దగ్గర కూర్చున్న ఆరియానాపై చేయి వేసి మాట్లాడుతూ అతడికి కోపం తెప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే మోనాల్ ఎదుటే మాట్లాడుతూ ‘తను నా బరువు మోయడానికి రెడీగా ఉంది. చూడు.. మేమిద్దరం వాటర్ కూడా పోనంతగా అతుక్కుపోయి కూర్చున్నాం' అంటూ తెగ ఉడికెంచేశాడు.