Just In
- 11 min ago
భర్త చేసిన పనికి అప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక.. ఏకంగా వీడియో రిలీజ్ చేసి..
- 42 min ago
మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
- 1 hr ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 3 hrs ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
Don't Miss!
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- News
ఏపీలో టెన్షన్, టెన్షన్- మొదలుకాని నామినేషన్లు- ఎస్ఈసీ ఆఫీసులోనే నిమ్మగడ్డ
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Finance
భారీ లాభాల నుండి, భారీ నష్టాల్లోకి: రిలయన్స్ మహా పతనం
- Automobiles
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అఖిల్ సార్థక్‌కు పద్మ అవార్డు: బిగ్ బాస్ నుంచి గతంలో ఆమెకు.. కారణం వాళ్లేనంటూ పోస్ట్!
తెలుగులో బిగ్ బాస్ షో చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. దీని వల్ల ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు స్టార్లుగా మారిపోయారు. ఇప్పటి వరకు నాలుగు సీజన్లు జరగగా పదుల సంఖ్యలో కంటెస్టెంట్లు సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో నాలుగో సీజన్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ ఒకడు. మొదటి నుంచీ ఒకే రకమైన ఆటను ఆడిన అతడు.. రన్నరప్‌గా నిలిచాడు. బయటకు వచ్చిన తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటుతోన్న అఖిల్.. తాజాగా ఓ అరుదైన 'పద్మ' అవార్డుకు ఎంపికయ్యాడు. తద్వారా బిగ్ బాస్ నుంచి ఏకైక కంటెస్టెంట్‌గా రికార్డులకెక్కాడు. ఆ వివరాలు మీకోసం!

షార్ట్ ఫిల్మ్‌ల నుంచి బిగ్ బాస్ షో వరకు
‘బావ మరదలు' అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా వెలుగులోకి వచ్చాడు అఖిల్ సార్థక్. ఆ తర్వాత మోడల్‌గా మారి ఎన్నో పోటీల్లో పాల్గొన్నాడు. ఈ సమయంలోనే మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత ‘కల్యాణీ' అనే సీరియల్‌లో నటించాడు. దీనితో పాటు ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. ఇలా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశం అందుకున్నాడు.

మోనాల్‌తో లవ్ ట్రాకుతో మరింత హైలైట్
బిగ్ బాస్ షోలోకి సాదాసీదా కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. అయితే, అసాధారణమైన ఆటతో ఎంతగానో ఫేమస్ అయ్యాడు. అంతేకాదు, ప్రముఖ హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో లవ్ ట్రాకు వల్ల బాగా పాపులర్ అయ్యాడు. చనువుగా ఉండడంతో పాటు ఆమెకు ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకునే వాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం మొదలైంది.

అందరి కంటే ముందే.. రన్నరప్‌తో ఫిక్స్
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో బెస్ట్ కంటెస్టెంట్ అనిపించుకున్నాడు అఖిల్ సార్థక్. కానీ, అభిజీత్ ఫ్యాన్స్ తాకిడికి తట్టుకోలేకపోయాడు. దీంతో రన్నరప్‌తో సరిపెట్టుకోగా.. అతడు టైటిల్‌ను ఎగరేసుకుని పోయాడు. వాస్తవానికి సయ్యద్ సోహెల్ రియాన్ బిగ్ బాస్ ఇచ్చిన రూ. 25 లక్షల ఆఫర్‌కు అంగీకరించడం వల్లే అఖిల్ టాప్-2కి చేరుకున్నాడు. లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో.

షోలో అఖిల్‌కు ముట్టినది ఎంతో తెలుసా?
అఖిల్ సార్థక్ బిగ్ బాస్ హౌస్‌లో 105 రోజుల పాటు కొనసాగాడు. అతడు రోజుకు రూ. 25 వేలు చార్జ్ చేసినట్లు తెలిసింది. దీంతో మొత్తంగా షోలో ఉన్నందుకు రూ. 26 లక్షల 25 వేలు రెమ్యూనరేషన్‌గా అందుకున్నాడని సమాచారం. మిగిలిన కంటెస్టెంట్లు సినిమా ఆఫర్లనో.. షోలనో మొదలు పెడుతుంటే.. అఖిల్ మాత్రం ఇంకా ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

అఖిల్‌కు వరుస ఆఫర్లు.. సంక్రాంతి తర్వాతే
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అఖిల్ సార్థక్ వరుస ఆఫర్లను దక్కించుకుంటున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో గోపీచంద్ నటిస్తోన్న ‘సిటీమార్' సినిమాలో అతడు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, అఖిల్ సార్థక్ మాత్రం ఏదైనా సంక్రాంతి తర్వాతనే బయట పెడతానని చెబుతున్నాడు.

అఖిల్‌కు పద్మ అవార్డు.. గతంలో ఆమెకు
బిగ్ బాస్ షో ద్వారా భారీ స్థాయిలో పాపులర్ అయిన అఖిల్ సార్థక్‌కు ‘పద్మ ఎక్స్‌లెన్స్ అవార్డ్' దక్కింది. 2020వ సంవత్సరానికి గానూ పద్మ మోహన్ ఆర్ట్స్ అవార్డులను ప్రకటించింది. ఇందులో టీవీ విభాగంలో అఖిల్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని చెబుతూ.. ‘మీ వల్లే ఇది వచ్చింది' అంటూ పోస్ట్ పెట్టాడతను. నాలుగో సీజన్ కంటెస్టెంట్ గంగవ్వ 2019లో ఇదే అవార్డును తీసుకున్నారు.