»   » 'బాహుబలి'అలీ స్పూఫ్... 'బాహు-అలి'

'బాహుబలి'అలీ స్పూఫ్... 'బాహు-అలి'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్ఫూఫ్ లో చేయటంలో కమిడియన్ అలీ ఎప్పుడూ ముందుంటారు. ఆయన తాజాగా సూపర్ హిట్ అయ్యి దేశాన్ని ఊపేస్తున్న చిత్రం బాహుబలిని టార్గెట్ చేసి, ఓ స్ఫూఫ్ ని రూపొందించారు. ఆ స్ఫూఫ్ పేరు 'బాహు-అలి'. ఈ స్ఫూఫ్ .. మాటీవి వారి ..సిని...మా అవార్డ్ ల పంక్షన్ లో ప్రదర్శించారు. బాహుబలి లో శివుడుగా అలి కనిపించారు.శివలింగానికి బదులు ఓ వాటర్ టిన్ పట్టుకుని వచ్చారు. అలాగే ఆ తర్వాత సుమ, అలీ మీద బాహుబలిసాంగ్ ని సైతం షూట్ చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇక సినీ‘మా' అవార్డ్స్ 2015 కార్యక్రమం హైదరాబాద్‌లో శుక్రవారం అట్టహాసంగా జరిగింది. అపూర్వమైన కలయికకు ఈ అవార్డ్స్ ఫంక్షన్ వేదికైంది. తెలుగు సినీ జగత్తులో నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు.


Ali Spoof on Baahubali Movie

అంతేకాకుండా సూపర్ స్టార్ కృష్ణ చేతులమీదుగా ప్రిన్స్ మహేశ్ బాబు బెస్ట్ యాక్టర్ అవార్డ్‌తో పాటు మనవడు గౌతమ్‌కి బెస్ట్ సెన్సేషనల్ అప్పియరెన్స్ అవార్డుని కూడా అందించడం విశేషం. ‘మనం' చిత్రానికి గాను నాగార్జునకు బెస్ట్ ఎక్సెప్షనల్ పెర్‌ఫార్మెన్స్ అవార్డ్ దక్కింది.


ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (రేసుగుర్రం), ఉత్తమ నటిగా సమంత(మనం) అవార్డులను దక్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా రేసుగుర్రం నిలిచింది. నేనొక్కడినే చిత్రానికి గాను దేవిశ్రీప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డును అందుకున్నారు. బెస్ట్ ఎక్సెప్షనల్ అవార్డును నాగార్జున(మనం) గెలుచుకున్నారు. ఉత్తమ గీతరచయితగా చంద్రబోస్ (కనిపెంచిన...మనం)అవార్డును సొంతం చేసుకున్నారు.


ఈ వేడుకలో విజయనిర్మల, రాఘవేంద్రరావు, కె.విశ్వనాథ్, అల్లు అరవింద్, జగపతిబాబు, జయసుధ, కోటశ్రీనివాసరావు, వెంకటేష్, నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అర్జున్, అఖిల్, అమలతో పాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులంతా పాల్గొన్నారు. ఈ వేడుకలో అంజలి, రాశిఖన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్, సాయిధరమ్‌తేజ్‌ల నృత్యాలు ఆహుతుల్ని అలరించాయి.

English summary
CineMAA awards, this time Ali has targeted super hit movie, 'Baahubali' as he teamed up with anchor Suma again to come up with a spoof.
Please Wait while comments are loading...