For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  జగపతి బాబు ‘గ్యాంగ్‌స్టార్స్’ వెబ్ సిరీస్‌ ఆడియన్స్ రివ్యూ....

  By Bojja Kumar
  |
  Amazon Prime GangStars Review

  అమేజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంలో వచ్చిన తొలి తెలుగు వెబ్ సిరీస్ 'గ్యాంగ్‌స్టార్స్'. దీనికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. జగపతి బాబు రౌడీ పాత్రలో నటించిన ఈ సిరీస్‌లో నవదీప్, శ్వేతా బసు, సిద్ధు జొన్నలగడ్డ, అపూర్వ అరోరా, శివాజీ, పోసాని కృష్ణ మురళి, హరితేజ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. నందీని రెడ్డి కథ అందించగా అజయ్ భుయాన్ దర్శకత్వం వహించారు. సిల్లీమంక్స్ ఎంటర్టెన్మెంట్స్, ఎర్లీ‌మాన్‌సూన్ టేల్స్ (వైజయంతి మూవీస్ వారి వెబ్ డివిజన్) సంయుక్తంగా నిర్మించారు. మొత్తం 12 భాగాలుగా ఈ వెబ్ సిరీస్ విడుదల చేశారు.

  కథ ఏమిటి?

  కథ ఏమిటి?

  కుమార్ దాస్ అలియాస్ కెడి (జగపతి బాబు) రౌడీయిజం, దందాలు, సెటిల్మెంట్లు, వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఇతడు చేసే దందాలకు పోలీస్ ఆఫీసర్ (శివాజీ) సహకారం అందిస్తూ ఉంటాడు. ఓసారి కెడి స్పృహ తప్పి పడిపోవడంతో అనుచరులు ఆసుపత్రిలో చేరుస్తారు. అతడికి ఎలాంటి జబ్బు లేక పోయినా... ల్యాబ్‌ రిపోర్ట్స్ తారుమారు కావడంతో అది చూసిన డాక్టర్ క్యాన్సర్ చివరి దశలో ఉందని, ఆరు నెలల కంటే ఎక్కువ బ్రతకడం కష్టం అని చెప్పడంతో ఆందోళనలో పడ్డ కెడి చనిపోయేలోపు తన వద్ద ఉన్న బ్లాక్ మనీ వైట్‌గా మార్చి భార్య పిల్లల పేరు మీద డిపాజిట్ చేయాలనుకుంటాడు.

  సినీ ఫైనాన్షియర్‌గా అవతారం

  సినీ ఫైనాన్షియర్‌గా అవతారం

  బ్లాక్ మనీ త్వరగా వైట్ చేయాలంటే సినిమా తీయడం ఒకటే మార్గమని భావించిన కుమార్ దాస్..... ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ నిర్మాతగా పేరున్న పోసాని కృష్ణ మురళిని బినామీగా పెట్టి సినిమా ప్రారంభిస్తాడు. ఈ సినిమాలో నవదీప్, శ్వేతా బసు హీరోయిన్లు. వారి మేనేజర్లుగా సిద్ధు జొన్నల గడ్డ, అపూర్వ అరోరా నటించారు.

  అనుకోని హత్యతో ట్విస్ట్

  అనుకోని హత్యతో ట్విస్ట్

  హీరో హీరోయిన్ మధ్య గొడవలతో సినిమా షూటింగ్ ఇబ్బందుల్లో పడుతుంది. అంతా సర్దుకుని షూటింగ్ జరుగుతుంది అనుకునే సమయానికి అనుకోకుండా హీరో హీరోయిన్ చేతిలో కుమార్ దాస్ బావమరిది రెడ్ (రాహుల్ రామకృష్ణ) హత్యకు గురవుతాడు. దీంతో కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఈ విషయం తెలిసి కుమార్ దాస్ ఎలా రియాక్ట్ అయ్యారు? ఈ కేసు చివరకు ఎలాంటి మలుపులు తిరిగింది అనేది తర్వాతి కథ.

  ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన

  ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన

  ఈ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఈ వెబ్ సిరీస్ వినోదాత్మకంగా ఉంది అంటే... మరికొందరు చాలా సాగదీశారు అంటూ విమర్శించారు. కొందరు డైరెక్టర్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగపతి బాబు పెర్ఫార్మెన్స్‌కు మాత్రమే చాలా మంది నుండి మంచి మార్కులు పడ్డాయి.

   చివరి మూడు ఎపిసోడ్లు మాత్రమే కాస్త బెటర్

  చివరి మూడు ఎపిసోడ్లు మాత్రమే కాస్త బెటర్

  ఈ వెబ్ సిరీస్‌లో చివరి మూడు ఎపిసోడ్లు మాత్రమే ఆసక్తికరంగా ఉన్నాయని, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకునే విధంగా ఉందని కొందరు కామెంట్ చేశారు. తొలి 8 ఎపిసోడ్లు చాలా బోరింగ్‌గా ఉన్నాయనే టాక్ వినిపించింది.

  చాలా బావుంది

  గ్యాంగ్‌స్టార్స్ చాలా బావుంది, ఎంతో నచ్చింది అంటూ ఓ అభిమాని ట్వీట్.

  హ్యాపీగా ఎంజాయ్ చేశా

  గ్యాంగ్‌స్టార్స్ చూసి చాలా ఎంజాయ్ చేశాను. ఎపిసోడ్ 9లో ట్విస్ట్ చాలా బావుంది... అంటూ కొందరు ఇలా కామెంట్స్ చేశారు.

  కొత్తగా ఏమీ లేదు

  కొత్తగా ఏమీ లేదు. చాలా చెత్తగా అనిపించింది అంటూ కొందరి నుండి విమర్శలు కూడా వచ్చాయి.

  లాస్ట్ 3 ఎపిసోడ్లు మాత్రమే...

  12 ఎపిసోడ్లుగా విడుదలైన ‘గ్యాంగ్‌స్టార్స్'లో చివరి 3 ఎపిసోడ్లు మాత్రమే బావున్నాయి. చాలా సాగదీశారు. స్క్రిప్టు వర్క్ కూడా పూర్‌గా ఉంది. టెక్నికల్ అంశాలుకూడా యావరేజ్ గా ఉన్నాయి. ఇందులో ఒకే ఒక ప్లస్ పాయింట్ జగపతి బాబు మాత్రమే అని మరికొందరు అభిప్రాయ పడ్డారు.

  అమేజాన్ ప్రైమ్ నుండి ఇలాంటివి ఊహించలేదు

  అమేజాన్ ప్రైమ్ నుండి ఇలాంటివి అస్సలు ఊహించలేదు అంటూ కొందరు విమర్శల వర్షం కురిపించారు.

  English summary
  Amazon Prime's first Telugu web series GangStars starring Jagapathi Babu, Navdeep and Shweta Basu Prasad has garnered rave reviews from the audience.GangStars has been written by Nandini Reddy, directed by Ajay Bhuyan and jointly produced by Sillymonks Entertainment and Early Monsoon Tales, a web division of Vyjayanthi Movies.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more