కొత్త ప్రియుడి చేతిలో సమంత చేయేసి.. రెండో పెళ్లికి సిద్ధమవుతున్న స్టార్ హీరోయిన్

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సింగిల్ గానే లైఫ్ ను లీడ్ చేస్తోంది. అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత టాలీవుడ్ లో ఎక్కువగా కనిపించడం లేదు. సినిమాల పరంగా జోరు కూడా పెంచడం లేదు. గతంలో తను సైన్ చేసిన సినిమాలకు మాత్రమే పనిచేస్తోంది. ఇక రీసెంట్ గా సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారిన శుభం అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చింది. ఆ సినిమా సమంతకు మంచి ఫలితాన్ని అందించింది. ఇక నెక్ట్స్ సమంత నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

కాగా, సమంత రూత్ ప్రభు గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే సమంత రూత్ ప్రభు గురించి డేటింగ్ రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కొన్నాళ్లుగా సమంత రూత్ ప్రభు బాలీవుడ్ లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఎక్కువ సమయంలో అక్కడి సర్కిల్స్ తోనే తిరుగుతూ కనిపిస్తుండటం గమనార్హం. దీంతో సమంత రూత్ ప్రభు డేటింగ్ వార్తలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఆమె బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డీప్ లవ్ లో ఉందని పుకార్లు ఊపందుకున్నాయి.

Amid of Dating Rumours Samantha Ruth Prabhu Hand in hand with Director Raj Nidimoru

ఈ క్రమంలో పలు సందర్భాల్లో సమంత రూత్ ప్రభు, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు కలిసి కనిపించడం, సమంత తరుచుగా రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన ఫొటోలను తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేయడం రూమర్లకు మరింత బలాన్ని ఇచ్చాయి. అయితే ఆగస్టు నెలలోనే వీరిద్దరి పెళ్లి జరుగుతుందని అందరూ అభిప్రాయపడుతూ వస్తున్నారు. దీంతో తాజాగా మరోసారి తన డేటింగ్ వార్తలను బలపరుస్తూ ఆయన చేతిలో చేయిని వేస్తూ కనిపించడం నెట్టింట వైరల్ గా మారింది.

రీసెంట్ గా సమంత రూత్ ప్రభు దుబాయ్ ట్రిప్ కు వెళ్లింది. అయితే ఆమె ఒక్కతే కాకుండా దర్శకుడు రాజ్ నిడుమోరుతో కలిసి వెళ్లడం విశేషం. ఈ సందర్భంగా సమంత రూత్ ప్రభు దర్శకుడితో కలిసి మాల్స్ లో చిల్ అవుతూ కనిపించింది. చేతిలో చేయి వేసుకొని మరీ తిరుగుతూ ఉండటం అందరినీ షాక్ కు గురి చేసింది. ఇప్పటి వరకు కాస్తా రూమర్లే వచ్చాయి. కానీ ప్రస్తుతం సమంత వారిద్దరి మధ్య ఉన్న క్లోజ్ నెస్ ను తెలియజేసేలా ఒక వీడియోను ఇన్ స్టా వేదికన పంచుకుంది. దాంతో సమంత ఇక ఆయనతో డేటింగ్ లో ఉన్నట్టుగా చెబుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

త్వరలోనే పెళ్లికి ఏర్పాటు జరుగుతున్నాయని ఇప్పటికే వార్తలు అందుతున్నాయి. ఈ క్రమంలో సమంత ఇలాంటి వీడియోను పంచుకోవడం ఆమె రెండో పెళ్లిపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక దర్శకుడు రాజ్ నిడిమోరు సమంత రూత్ ప్రభు కలిసి ఫ్యామిలీ మెన్, సిటాడెల్ సిరీస్ లకు పనిచేశారు. అలాగే ఫర్జీ అనే క్రైమ్ థ్రిల్లర్ కు కూడా రాజ్ నిడిమోరు దర్శకత్వం వహించడం విశేషం. సమంత ప్రస్తుతం తెలుగులో మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు హిందీలో రక్త్ భ్రమాండ్ అనే సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X