»   » ఇద్దరు భార్యల మెగాస్టార్, మరొకరు ఆహీరోయిన్ తల్లే?

ఇద్దరు భార్యల మెగాస్టార్, మరొకరు ఆహీరోయిన్ తల్లే?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Amitabh is producing and acting a TV serial
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ త్వరలో బుల్లితెర సీరియల్‌లో నటించబోతున్నారు. హిందీలో తెరకెక్కబోయే ఈ సీరియల్‌ను అమితాబ్ బచ్చన్ స్వయంగా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీరియల్‌లో అమితాబ్ బచ్చన్‌కు ఇద్దరు భార్యలు ఉంటారని, హీరోయిన్ శృతి హాసన్ తల్లి, నటి సారిక మొదటి భార్యగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

అమితాబ్‌కు జోడీగా రెండో భార్యగా నటించే పాత్ర చేసే నటి కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఆ పాత్రకు సూటయ్యే పర్‌ఫెక్ట్ నటి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పాత్ర కోసం ఇప్పటికే హిందీ టీవీ సీరియల్స్‌లో నటిస్తూ పాపులారిటీ సాధించిన పలువురిని పరిశీలిస్తున్నారు.

సిరియల్ కాన్సెప్టు విషయానికొస్తే.....ఇందులో అమితాబ్ బచ్చన్, సారిక భార్య భర్తలు. కూతురు పుట్టిన తర్వాత వీరు విడిపోతారు. ఆ తర్వాత వీరి కూతురు ఇద్దరి కలిపేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో చోటు చేసుకునే సన్నివేశాలను బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తి రేపే విధంగా ఉండబోతోందని తెలుస్తోంది.

కాగా...ఈ సీరియల్ కాన్సెప్టు నటి సారిక నిజ జీవితానికి దగ్గరగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ కమల్ హాసన్ మాజీ భార్య అయిన సారిక...శృతి హాసన్ పుట్టిన తర్వాత భర్తతో విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కమల్ హాసన్, సారిక వారి వారి ప్రొఫెషన్లో బిజీగా గడుపుతున్నారు. వారి కూతుర్లు శృతి హాసన్, అక్షర హాసన్ కూడా సినిమా రంగంలోనే పని చేస్తున్నారు.

English summary

 Buzz is Amitabh Bachchan is producing and acting a soon-to-be unveiled TV serial. This serial will have Amitabh playing a husband for two wives. While Sarika is said to be finalized to play his first wife, hunt is going on for Big B's second wife.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu