»   » 1.3 లక్షల మందికి భోజనం...బిగ్ బి మెచ్చుకున్నారు

1.3 లక్షల మందికి భోజనం...బిగ్ బి మెచ్చుకున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : ఎవరైనా ప్రజోపకారానికి సంభందించిన మంచి పని చేసినప్పుడు వారిని అభినందించంటం మొదటి నుంచి అమితాబ్ కు అలవాటు. తాజాగా ఆకలిగొన్న వారి కడుపు నింపేందుకు ప్రారంభించిన 'ఫీడ్‌ యువర్‌ నైబర్‌' కార్యక్రమానికి బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నుంచి ప్రశంశలు అందాయి. ఆయన్ను నుంచి అందుకుంటానని వూహించలేదని కార్యక్రమ రూపకర్త మహితా ఫెర్నాండెజ్‌ సంతోషం వ్యక్తం చేశారు. స్టార్ ప్లస్ ఈ పోగ్రామ్ ప్రసారం అయ్యింది.

దసరా పండుగ సమయంలో బెంగళూరులో లక్ష మందికి ఆహారాన్ని అందించాలన్న సంకల్పంతో సామాజిక మాధ్యమాల సహకారంతో సమాన మనస్కులను ఒక్కచోటకు చేర్చి ఆమె భోజన సదుపాయాలను కల్పించారు. పండుగ సమయంలో వరుసగా 11 రోజుల్లో 1.3 లక్షల మందికి భోజనం అందించారు.

Amithab honours Mahita Fernandez's Feed Your Neighbor initiative

మొదట రెండు వేల మంది స్వయం సేవా కార్యకర్తలు ముందుకు రాగా, చివరి రోజు నాటికి అయిదు వేల మంది ఆమెకు సహకారంగా నిలిచారు. గురువారం బెంగళూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఓ ప్రముఖ దృశ్యమాధ్యమ సంస్థ ద్వారా తెలుసుకున్న హిందీ తెరవేల్పు అమితాబ్‌ స్పందించారన్నారు.

తనను ముంబయికి పిలిపించుకుని అభినందించారని తెలిపారు. ఇకపై క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నానని ఆమె ప్రకటించారు.

English summary
Mahita Fernandez has provided food to 1,30,000 people during the 11 days of Dussehra.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu