Don't Miss!
- News
తారకరత్న వద్ద జూ ఎన్టీఆర్ - శివన్న- బ్రాహ్మణి: ఎమోషనల్ - విషమంగా..!!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Akhil: బుల్లితెరపై అఖిల్ సిగ్గు పడేలా చేసిన యంగ్ హీరోయిన్.. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి షాకింగ్ గా!
టాలీవుడ్ కింగ్, మన్మథుడు అక్కినేని నాగార్జున- అమల ముద్దుల తనయుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు అక్కినేని అఖిల్. మనం సినిమాలో స్పెషల్ గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చిన అఖిల్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. తర్వాత అఖిల్ సినిమాతో హీరోగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోకు సక్సెస్ దక్కలేదు. తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసిన ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఇప్పుడు సాలిడ్ హిట్ కోసం తెగ కష్టపడుతున్నాడు ఈ యంగ్ హీరో. అయితే తాజాగా డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ గ్రాండ్ ఫినాలేకి స్పెషల్ ఛీప్ గెస్ట్ గా వెళ్లిన అఖిల్ పై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది.

వరుసగా ఫ్లాప్ లు..
అక్కినేని నాగార్జున, శరత్ కుమార్, అమల నటించిన సూపర్ హిట్ మూవీ సిసీంద్రిలో బాబుగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు అఖిల్. అయితే ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అంతగా గుర్తింపు పొందలేకపోయాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలు వరుసగా ఫ్లాప్ ల మీద ఫ్లాప్ లు ఇచ్చాయి. కానీ 2021లో చివరిసారిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ మూవీతో ఫస్ట్ టైమ్ హిట్ ట్రాక్‌లో పడ్డాడు.

సాలిడ్ హిట్ కొట్టాలని..
అయితే బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ కొంతమేర హిట్ టాక్ తెచ్చుకున్నా అఖిల్ కు మాత్రం అంతగా ఒరిగింది ఏం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు ఎలాగైనా తన కెరీర్ లో గుర్తుంచుకునే సూపర్ హిట్ చిత్రం కోసం ప్రయత్నిస్తున్నాడు అక్కినేని అఖిల్. ఈసారి ఎలాగైన తిరుగులేని హిట్ కొట్టాలని తెగ కష్టపడిపోతున్నాడు. అందులో భాగంగానే అఖిల్ ప్రస్తుతం ఏజెంట్‌గా రానున్నాడు.

మేకింగ్ వీడియోతో క్యూరియాసిటీ..
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న అఖిల్ ఏజెంట్ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటించడం విశేషం. ఇదివరకు విడుదల చేసిన టీజర్ లో యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టాడు అఖిల్. అలాగే రీసెంట్ గా యాక్షన్ మేకింగ్ వీడియోను విడుదల చేసి మరింత క్యూరియాసిటీ నెలకొల్పారు. అంతేకాకుండా డైరెక్టర్ సురేంద్ర రెడ్డి కాలికి గాయం అయిన కూడా చికిత్స తర్వాత వచ్చి షూటింగ్ లో పాల్గొన్నారు.

గ్రాండ్ ఫినాలేలో అఖిల్..
ఇదిలా ఉంటే అక్కినేని అఖిల్ తాజాగా ఓ డ్యాన్స్ రియాలిటీ షోకి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు. జీ తెలుగు టీవీ ఛానెల్ లో టెలీక్యాస్ట్ అవుతున్న డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ రియాలిటీ షో ఇప్పుడు ఫైనల్ కు చేరుకుంది. అందులో భాగంగానే గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. ఈ గ్రాండ్ ఫినాలేకు అక్కినేని అఖిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ షోలో సీనియర్ హీరోయిన్ సంగీత, బస్ స్టాప్ హీరోయిన్ ఆనందితోపాటు కొరియోగ్రాఫర్ బాబా మాస్టార్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.

త్వరగా పెళ్లి అంటూ..
ఏజెంట్ అఖిల్ కు స్వాగతం అంటూ గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. స్టేజిపైకి వచ్చిన అఖిల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత "నేను మీ ఏజెంట్ ట్రైలర్ చూశాను. అందులో మీ స్వాగ్ అదిరిపోయింది" అని బాబా మాస్టార్ తెలిపారు. అప్పుడు అదే స్వాగ్ తో నడిచాడు అక్కినేని అఖిల్. తర్వాత "అఖిల్ గారిని చూస్తుంటే.. ఎందుకింత త్వరగా పెళ్లి చేసుకున్నాను అని అనిపిస్తుంది" అని యంగ్ హీరోయిన్ ఆనంది చెప్పింది. దీనికి "మీరు నేను సిగ్గుపడేలా చేశారు" అని అఖిల్ సమాధానం ఇచ్చాడు. దీంతో ఆనంది ముసిముసి నవ్వులు నవ్వింది.

ఏజ్ గురించి అడిగారు..
అనంతరం రోహిణి వచ్చి అయ్యాగారే నెంబర్ వన్ అని అరిచింది. నేను ఏజెంట్ ఆడిషన్ కి వచ్చాను.. ఏజ్ ఎంత అని అడిగారు. అంతే వెనక్కి వెళ్లిపోయాను అని రోహిణి కామెడీ చేసింది. మీరు ఏజెంట్ సినిమా చేస్తున్నారు.. నేను మరో మూవీ చేస్తున్నాను అని రోహిణి అంటే.. స్పై సినిమానా అని అఖిల్ అన్నాడు. కాదు సార్.. మీరు ఏజెంట్.. నేను ఎలిఫెంట్ అని రోహిణి అంటే.. అయ్యయ్యో.. అని అఖిల్ అన్నాడు.