Just In
- 5 min ago
ప్రభాస్ 'సలార్' హీరోయిన్ ఫిక్స్.. పుట్టినరోజు కానుకగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన టీమ్
- 25 min ago
2021 మొత్తం మెగా హీరోలదే హవా.. నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ పై దండయాత్ర
- 51 min ago
‘పుష్ప’ నుంచి ఊహించని సర్ప్రైజ్: ఈ రెండింటిలో ఒకటి గ్యారెంటీ.. ముందే బయటకొచ్చిందిగా!
- 1 hr ago
అలా చేయడం వల్ల ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు.. కోహ్లీ, తమన్నాలకు హైకోర్టు నోటీసులు
Don't Miss!
- News
పిక్చర్ అభీ బాకీ హై... అది భగవంతుడికే తెలియాలి... దీప్ సిధు వివాదాస్పద వ్యాఖ్యల ఆంతర్యం..?
- Automobiles
భారత్ బెంజ్ ప్రవేశపెట్టిన 8 కొత్త వాహనాలు, ఇవే.. చూసారా..!
- Finance
దటీజ్ టీసీఎస్, ప్రపంచ బ్రాండ్లలో 3వ స్థానం, కాగ్నిజెంట్‌ను వెనక్కి నెట్టిన ఇన్ఫోసిస్
- Sports
BWF World Tour Finals 2021: శుభారంభం దక్కలేదు.. ఫస్ట్ మ్యాచ్‌లోనే సింధు, శ్రీకాంత్ ఓటమి!
- Lifestyle
శరీర బరువును వేగంగా తగ్గించే ఈ పుదీనా టీని ఎలా తయారు చేయాలి??
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
50పైసల కోసం అలా చేశా, ప్రేమ విషయం లీక్ అవ్వగానే బయటకు పోవే అన్నారు: అనసూయ
యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంది అనసూయ. కేవలం గ్లామరస్ యాంకర్ గానే కాకుండా నటిగా కూడా రంగమ్మత్త ఒక బ్రాండ్ సెట్ చేసుకుంది. రంగస్థలం సినిమా అనంతరం అనసూయ ఓ వైవు నటిగా కూడా చాలా బిజీ అయ్యింది. ప్రస్తుతం టీవీ షోలతో మంచి ఆదాయం అందుకుంటున్న అనసూయ ఒకనొక సందర్భంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఇటీవల అలీ సరదాగా ప్రోగ్రామ్ లో ఆ విషయాల గురించి తెలిపింది. అలాగే తన ప్రేమ విషయాన్ని కూడా ఈ బ్యూటీ బయటపెట్టేసింది.

ప్రేమ విషయం ఇంట్లో లీక్ అవ్వడంతో..
అనసూయ నార్త్ ఇండియన్ కి చెందిన సుశాంక్ భరద్వాజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. చాలా ఏళ్ల నుంచి అతను హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. అర్థం చేసుకునే మనిషి దొరకడంతో అనసూయ ఆలస్యం చేయకుండా అతనిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అయితే ఆ విషయం ఇంట్లో తెలియగానే ఆమె బట్టలు సర్దేసి సూట్ కేస్ చేతికి ఇచ్చి బయటకు పోవే అన్నారట. ఈ విషయం నిజమేనని అనసూయ ఆలీకి వివరణ ఇచ్చారు.

బావిలో కప్పల్లాగా పెంచారు
అనసూయ మాట్లాడుతూ.. ఇంట్లో మేము ముగ్గురం అడపిల్లలం. నాన్న చాలా పద్దతిగా నిజాయితీ పెంచారు. ఒక విధంగా మమ్మల్ని బావిలో కప్పల్లాగా పెంచారు తెలిపింది. అనంతరం అలీ కలుగజేసుకొని బావిలో బకెట్ వేయగానే నువ్వు దుకేసి అలా అలా వెళ్లిపోయావా అని పంచ్ వేయడంతో నిజమే అన్నట్లుగా అనసూయ స్మైల్ ఇచ్చింది.

ఆర్య 2 సినిమా కోసం..
ఇక విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో HRగా జాబ్ చేస్తున్నప్పుడు సినిమా అవకాశాలు చాలానే వచ్చాయి. అక్కడికి పెద్ద పెద్ద దర్శకులు వచ్చేవారు. నన్ను చూసి సినిమాల్లో నటిస్తావా అని అడిగేవారు. ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్ సర్ గారు నాకు ఒక ఆఫర్ కూడా చేశారు ఆర్య 2 సినిమా కోసం. అందులో ఏ క్యారెక్టర్ అనేది నేను చెప్పను. కానీ ఆఫర్స్ చాలానే వచ్చాయి.

డబ్బుల కోసం అలా చేయలేదు
రంగస్థలం సినిమాలో డబ్బుల కోసమో పెద్ద స్టార్ సినిమా అనుకోని చేయలేదు. డబ్బులు కావాలంటే మా ఆయన ఇస్తాడు టీవీ షోల ద్వారా సంపాదిస్తున్నాను. ఈ సందర్భంగా క్షణం సినిమాలో ఒక మంచి పాత్ర ఇచ్చిన అడివి శేష్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇక వార్నింగ్ ఎవరికైనా ఇవ్వాలి అంటే ఇప్పుడు యూ ట్యూబ్ లో నెగిటివ్ కామెంట్స్ పెట్టె వాళ్లకు.

ఆయన ఫోన్ చెక్ చేస్తా
టీవీ తల్లి లాంటిది, సినిమా నాన్న లాంటిది. ఇక రామ్ చరణ్ ఎప్పుడు కూడా నా చిట్టి బాబే. ప్రతిరోజూ మా ఆయన ఫోన్ చెక్ చేస్తా. ఏం చేస్తున్నాడో అంతెలియాలి కదా నాకు. తెలుసుకోవడం మా జన్మ హక్కు. నా ఫోన్ కూడా ఆయన చెక్ చేస్తారు. కానీ అందులో చందమామ కథలు మాత్రమే ఉంటాయి.

అప్పుడే నేను ఆరు నెలల ప్రెగ్నెంట్
అత్తారింటికి దారేదిలో ఒక క్యారెక్టర్ చేయడానికి ఆఫర్ వచ్చింది. అప్పుడు గుంపులో గోవిందా అనేలా ఫ్యామిలీ సబ్యులతో డ్యాన్స్ చేయాలి. అలాంటి ఆఫర్ మిస్ అవ్వడమే మంచిది అయ్యింది అని ట్విట్టర్ లో పెట్టా. ఒక్కసారిగా నెగిటావ్ కామెంట్స్ వచ్చాయి. నేను ఒక్కదాన్ని అయితే చేసేదాన్ని కానీ అప్పుడే నేను ఆరు నెలల ప్రెగ్నెంట్. అందుకే రిజెక్ట్ చేశాను.

స్కూల్ ఫీజులు కట్టడానికి..
ఇక మా అమ్మ గురించి చెప్పాలి అంటే ఆమె నా జీవితంలో చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. ఆమె ఎంత కష్టపడిందో నాకు తెలుసు. మేము ముగ్గురం అడపిల్లలం. మమ్మల్ని పోషించి స్కూల్ ఫీజులు కట్టడానికి చాలా కష్టపడింది. ఇంటి పక్కన వాళ్ళ చీరలు పాల్స్ కుట్టి నాకు సిస్టర్స్ కి బట్టలు కొనేది.

కొన్నిసార్లు ఇంటి రెంట్స్ కట్టలేక
ఆర్డినరి బాస్, మెట్రో బస్సులకు 50పైసలు తేడా ఉండేవి. అప్పుడు ఆ 50పైసలు సేవ్ చేయడానికి నేను రెండు బస్ స్టాప్ లు నడిచేదాన్ని. ఇక కొన్నిసార్లు ఇంటి రెంట్స్ కట్టలేని సందర్భంలో సడన్ గా ఇల్లు మార్చాల్సిన పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. అప్పట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని అనసూయ వివరణ ఇచ్చింది.