Don't Miss!
- News
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!!
- Finance
Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా..
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బిగ్ బాస్ 4 కోసం అనసూయకు భారీ ఆఫర్.. ఒక రోజులోనే సెటిల్ చేసిందట?
టాలీవుడ్ హాట్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అనసూయ భరద్వాజ్. యాంకర్ గానే కాకుండా నటిగా తన టాలెంట్ ని బయటపెడుతున్న ఈ బ్యూటీ నేడు 35వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఇక అనసూయకు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా రానుందనే వార్తలు మొదటి సీజన్ నుంచి వస్తూనే ఉన్నాయి. ఇక త్వరలో సీజన్ 4కోసం కూడా నిర్వాహకులు ఆమెను సంప్రదించే ప్రయత్నం చేసినట్లు రూమర్స్ వస్తున్నాయి.
Recommended Video

సినిమాలతో బిజీబిజీ..
జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ఆ తరువాత పలు సినిమాలతో కూడా తన క్రేజ్ ని పెంచుకుంది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి క్రేజ్ దక్కింది. ఆ తరువాత గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. అప్పుడప్పుడు లేడి ఓరియెంటెడ్ కథలతో కూడా మెప్పించే ప్రయత్నం చేస్తోంది.

బిగ్ బాస్ 4 కోసం..
తెలుగు బుల్లితెరపై క్లిక్కయిన బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 4 కోసం గత కొన్ని నెలలుగా బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. లాక్ డౌన్ కారణంగా షోకి సంబంధించిన పనులకు బ్రేక్ పడింది. లేకుంటే కంటెస్టెంట్స్ పై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేది. అయినప్పటికీ కొంతమంది సెలబ్రెటీల పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే లిస్ట్ లో ప్రస్తుతం అనసూయ పేరు కూడా ఉన్నట్లు టాక్ వస్తోంది.

భారీ ఆఫర్..
బిగ్ బాస్ సీజన్ 3లోనే శ్రీముఖిని సెట్ చేయడానికి షో నిర్వాహకులకు చాలా ఖర్చయ్యింది. ఆమెకు ఒక ఎపిసోడ్ కి లక్షకి పైగా ఆఫర్ చేశారని టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు అనసూయ భరద్వాజ్ ని కూడా హౌజ్ లోకి రప్పించాలని చాలా ప్రయత్నాలు చేశారట. అయితే ఫలితం దక్కలేదని తెలుస్తోంది.

సెటిల్ చేసిన అనసూయ..
చాలా రోజులుగా షో నిర్వాహకులు బిగ్ బాస్ ఆఫర్ గురించి అనసూయ వద్దకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారట. చాలా వరకు ఈ యాంకర్ ఆ ఆఫర్ పై ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక ఫైనల్ గా ఒక రోజులోనే డీల్ కి ఎండ్ కార్డ్ పెట్టినట్లు తెలుస్తోంది. తనకు ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదని ఫ్యామిలీకి తాను అన్ని రోజులు దూరంగా ఉండలేనని క్లారిటీగా వివరణ ఇచ్చిందట. కొన్నిరోజుల ఆలోచించుకొని చెప్పండి అంటూ స్టార్ మా నిర్వాహకులు చెప్పినప్పటికీ ఒక్కరోజులోనే వారి సందేహాలను క్లియర్ చేసిందట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అనసూయనే క్లారిటీ ఇవ్వాలి.