For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మీ పిచ్చి చేష్టల వల్లే ఇదంతా.. దేవుడంతా చూస్తున్నాడు.. క్లాస్ పీకిన అనసూయ

  |

  సినీ, టెలివిజన్ రంగాల్లో తనదైన శైలిలో రాణిస్తున్న యాంకర్ అనసూయ ప్రస్తుతం లాక్‌డౌన్ స్ట్రిక్ట్‌గా పాటిస్తున్నారు. ఇంటికే పరిమితమై రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. తన సినిమాలు, ఇంటి పనులు, భవిష్యత్ ప్రణాళికల గురించి అనసూయ చెప్పుకొంటూ వచ్చారు. తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చి పలు విషయాల గురించి వెల్లడించారు. అందులోని కొన్ని పాయింట్లు ఇవే..

  సక్సెస్‌ఫుల్‌గా లాక్‌డౌన్

  సక్సెస్‌ఫుల్‌గా లాక్‌డౌన్


  నా లాక్‌డౌన్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నది. ఇంట్లోనే ఉంటూ కరోనాను నిలువరించే ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే కొందరు చేస్తున్న పిచ్చి చేష్టల వల్లే ఇంత తీవ్రతరమైన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు చెప్పినట్టు వింటే లాక్‌డౌన్ ఇంతవరకు వచ్చేది కాదు. పిల్లల స్కూల్ ఏమై పోతుందనే బెంగ వస్తున్నది. దయచేసి అందరూ ఇంట్లోనే ఉంటూ లాక్‌డౌన్ సక్సెస్‌ఫుల్ అయ్యేలా చూడాలి. దేవుడు అంతా చూస్తున్నాడు. చుట్టు పక్కల ఉన్న వారికి, అందరికీ లాక్‌డౌన్‌ను పాటించమని చెప్పండి అని అనసూయ లైవ్‌లో తెలిపారు.

  35 రోజుల్లో ఒకేసారి

  35 రోజుల్లో ఒకేసారి


  గత 35 రోజుల్లో నేను ఒకసారి మాత్రమే బయటకు వెళ్లాను. మా ఇంటికి దగ్గర్లో సూపర్‌ మార్కెట్‌కు నేను, నాభర్తతో కలిసి వెళ్లాను. బయట చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. సూపర్ బజార్‌లో కూడా చాలా స్ట్రిక్ట్‌గా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. అంతకంటే నేను బయటకు వెళ్లిన దాఖలాలు లేవు. ఇంట్లోనే ఉంటున్నాం అని అనసూయ చెప్పారు.

  లాక్‌డౌన్ ఎత్తేయగానే నేను..

  లాక్‌డౌన్ ఎత్తేయగానే నేను..


  లాక్‌డౌన్ ఎత్తేయగానే ముందు ఎక్కడికి వెళ్తావు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఫస్ట్ బ్యూటీ పార్లర్‌కు వెళ్తాను. లాక్‌డౌన్‌కు ముందు నాకు మూడు సినిమాల షూటింగ్ జరిగాయి. వాటికి సంబంధించిన కంటిన్యూటి గురించి ఆలోచించాలి. నా జట్టు బాగా పెరిగిపోయింది. నా రోల్స్‌కు తగినట్టుగా మేకోవర్ కావాలి అని అనసూయ చెప్పారు. కన్నడ రంగం నుంచి రెండు సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాటిని ఒప్పుకోలేదన్నారు.

  పిల్లలతో చాలా ఫన్‌గా

  పిల్లలతో చాలా ఫన్‌గా

  లాక్‌డౌన్‌లో ఫ్యామిలీతో సరదాగా గడిచిపోతున్నది. నా చిన్న కొడుకును పట్టుకొని నా భర్త కటింగ్ చేశాడు. ఇప్పుడు వాడు కోపంగా ఉన్నాడు. మా ఆయన నుంచి పెద్దొడిని కాపాడాను. ఇలా సరదాగా ఇంట్లో కాలం గడిచిపోతున్నది. ఇంట్లో పనులు చేస్తూ.. తెలియని వాటిని తెలుసుకుంటూ ప్రతీ రోజు గడిపేస్తున్నాం అని అనసూయ వెల్లడించారు.

  Recommended Video

  Udaya Bhanu Condolences To Her Adopted Sister
  మూడు సినిమాల షూటింగులు

  మూడు సినిమాల షూటింగులు

  సాధారణంగా నేను నా సినిమాల కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ కాను. రంగస్థలంలో రంగమ్మత్త పాత్రకు కూడా ముందుగా ఎలాంటి ఎక్సర్‌సైజ్ చేయలేదు. డైరెక్టర్ చెప్పినట్టు చేసుకుంటూ పోవడమే నా పని. లుక్ పరంగా ప్రిపేర్ కావడం, తయారు కావడం చేస్తుంటాను. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా నేరుగా షూటింగ్‌కు వెళ్తుంటాను అని అనసూయ తెలిపారు. నా మూడు సినిమాల్లో ఏది ముందు రిలీజ్ అవుతుందో చెప్పలేను అని అనసూయ పేర్కొన్నారు.

  English summary
  Anchor Anasuya Instagram live in lockdown and share her views with netizen. She adviced everyone to take care for not to fall of Coronavirus and follow the lockdown norms.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X