For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పవన్ పై యాంకర్ అనసూయ సెన్సేషనల్ కామెంట్స్

  By Srikanya
  |

  హైదరాబాద్ : హాట్ అండ్ సెక్సీ యాంకర్ అనసూయ మరో సారి వార్తల్లోకి వచ్చింది. అయితే ఈ సారి పవన్ కళ్యాణ్ తాజా చిత్రం చూసి సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ ఆమె అందరి దృష్టినీ ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొంది సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న 'అత్తారింటికి దారేది' చిత్రంలో అనసూయను తీసుకోవాలనుకున్నారు. అయితే ఆమె అప్పట్లో రిజెక్ట్ చేసి వార్తల్లోకి ఎక్కింది. అయితే సినిమా రిలీజయ్యాక తాను ఎందుకు నచించనన్నానో అంటూ ట్వీట్ చేసి తన ఫ్యాన్స్ కు అసలు కారణం వివరించే ప్రయత్నం చేసింది.

  ఆమె ఇచ్చిన వరస ట్వీట్స్ ఇలా ఉన్నాయి :

  "హానెస్ట్ గా చెప్తున్నా..నేను చాలా సంతోంగా ఉన్నా నాకు ఆఫర్ చేసిన ఆ పాటలో నటించనందుకు..వేరే రకంగా కాదు.. కానీ జజంగా...ఆ గుంపులో నేను ఉన్న లేకున్నా ఒకటే......

  Anchor Anasuya made sensational comments on AD


  అంతేకాదు..నన్నడిగితే... పవన్ కళ్యాణ్ ...డెఫినెట్ గా బాగున్నారు...ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ లో ఏడిపించేసారు... అలాగే కొన్ని పాటలు బాగున్నాయి..

  నేను అనసూయను... అఫ్ కోర్స్ నాకు మీలాగే నా ఎక్సప్రెషన్ ని వ్యక్తపరిచే హక్కు ఉంది... ఇప్పుడు పర్టిక్యులర్ గా ఈ ట్వీట్స్ ఎందుకంటే...నన్ను మీరంతా మొదట్లో పవన్ తో సాంగ్ చేయలేదని చంపేసారు కద బాబు... ..!!

  అదేదో నేను మోక్షం పొందే ఛాన్స్ వదులుకున్నట్లు...పెద్ద పాపం చేసినట్లు....ఉఫ్...!! :/

  కానీ నేను ఎగ్జాట్ గా నేను ఏం చెప్పాలని ట్రై చేస్తున్నానంటే నేను, పవన్ కళ్యాణ్ ఇద్దరం ఇద్దరం ఇంతకంటే మంచిగా తెరమీద కనపడాలని నా ఆలోచన...ఇది నా పొగరు కాదు...నాకు తెలుసు... మ్యాటర్ అదన్నమాట... .. :)"

  గతంలోనూ అనసూయ ఓ ప్రతికతో మాట్లాడుతూ...ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. 'పవన్ కళ్యాణ్ సినిమాలో ఐటం సాంగు చేయమని నన్ను అప్రోచ్ అయిన మాట నిజమే. కానీ ఆ సాంగులో నటించడానికి నేను తగను అని నా భావన. నా సినిమా కెరీర్ ఐటం సాంగుతో ప్రారంభం అవడం కూడా ఇష్టం లేదు. ముందుగా నా యాక్టింగ్ స్కిల్స్‌ను మెరుగు పరుచుకున్న తర్వాత ఇతర అంశాలపై దృష్టి పెడతాను అని వెల్లడించింది.

  'ప్రస్తుతం నేను టీవీ షోలతో బిజీగా గడుపుతున్నాను. దర్శకుడు గుణశేఖర్ కూడా 'రుద్రమదేవి' చిత్రంలో కీలకమైన పాత్ర చేయమని అడిగారు. కానీ 10 కేజీల వెయిట్ తగ్గమని చెప్పారు. దీనికి కూడా నేను ఒప్పుకోలేదు. ఈ అవకాశాలు మిస్సయినందుకు తనకు ఎలాంటి విచారం లేదు' అని అంటోంది అనసూయ.

  న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయకు పెళ్లయి, ఓ బాబు కూడా ఉన్నాడు. చూడ చక్కని రూపం, చలాకీతనం ఉండటంతో న్యూస్ రీడర్ నుంచి యాంకర్‌గా మారి....తన సెక్సీ యాటిట్యూడ్‌తో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. అయితే పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోల సినిమాల్లో చాన్స్ వచ్చినా వదులు కోవడం....సరైన నిర్ణయం కాదని అప్పట్లో అందరూ విమర్శించారు.

  English summary
  Anasuya Tweeted:- “Honestly..I’m glad i wasn’t a part of that song I was offered..no harsh feelings..but nijanga..aa gumpulo nenu unna lekunna okate.. N..nannidigite..PK definately was gud..esp..climax scene lo edpinchesaru..n a couple of songs were gud.. I am Anasuya..n f course i have every rt 2 expression like al f u.. Ippudu particular ga enduku ee tweets ante..nannu most f u initially PK to song cheyaledani champesaru kada babu..!! Adedo nenu moksham ponde chance odulukunnatlu..pedda papam chesnattu..uff..!! :/But what exactly I’m trying to say is me and PK deserve a much much better screen space together..idi na pogaru kadu..I know it.”
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more