»   » బాస్ రమ్మన్నాడు....అనసూయ రానంది, ఎందుకు?

బాస్ రమ్మన్నాడు....అనసూయ రానంది, ఎందుకు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎవరీ బాస్ అనుకుంటున్నారా?.... త్వరలో తెలుగు బుల్లితెరపై సందడి చేయబోతున్న 'బిగ్ బాస్'. ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రారంభం కాబోతున్న ఈ రియాల్టీ షో కోసం 12 మంది ప్రముఖ సెలబ్రిటీల ఎంపిక కార్యక్రమం మొదలైంది.

ఫస్ట్ సీజన్ కాబట్టి బాగా పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలను ఇందులో పోటీదారులుగా నియమించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మైండ్ బ్లోయింగ్ ఆఫర్లతో ముంచెత్తుతున్నారు. ఇప్పటికే పోసాని కృష్ణ మురళికి రూ. 2.5 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఇంకా ఏ విషయం తేల్చలేదట. యాంకర్ సుమకు కూడా ఫ్యాన్సీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా బిజీ షెడ్యూల్ కారణంగా తాను రాలేనని తేల్చి చెప్పిందట.

నో చెప్పిన అనసూయ

నో చెప్పిన అనసూయ

తాజాగా యాంకర్ అనసూయను కూడా బిగ్ బాస్ షో నిర్వాహకులు సంప్రదించినట్లు సమాచారం. అయితే తనకు ఇప్పటికే చాలా కమిట్మెంట్లు ఉన్నాయనే కారణం చూపుతూ అనసూయ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

పోసాని, మధు శాలిని, తేజస్వి

పోసాని, మధు శాలిని, తేజస్వి

బిగ్ బాస్ షో కోసం ఇప్పటికే పోసాని కృష్ణ మురళికి రూ. 2.5 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మధు శాలిని, తేజస్వి మదివాడ లాంటి వారికి కూడా రూ. 20 లక్షలతో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. త్వరలో ‘బిగ్ బాస్'లో ఎవరెవరు ఫైనల్ అయ్యారనే విషయాలు బయటకు రానున్నాయి.

ఎన్టీఆర్ ‘బిగ్ బాస్' ...ఎలా సాగుతుంది? సామాన్యులకు చోటు లేదా?

ఎన్టీఆర్ ‘బిగ్ బాస్' ...ఎలా సాగుతుంది? సామాన్యులకు చోటు లేదా?

ఎన్టీఆర్ ‘బిగ్ బాస్' ...ఎలా సాగుతుంది? సామాన్యులకు చోటు లేదా?.... ఇలాంటి సందేహాలు మీకూ ఉండే ఉంటాయి. ఈ షోకు సంబంధించిన

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అదరగొట్టిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ త్వరలో 'బిగ్ బాస్' అనే రియాల్టీ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. స్టార్ మాటీవీలో ఈ షో త్వరలో ప్రసారం కాబోతోంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన టీజర్ రిలీజైంది. జేమ్స్ బాండ్ సినిమా టీజర్ గుర్తొచ్చేలా అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్స్‌తో ఈ టీజర్ డిజైన్ చేశారు. దీన్ని చూస్తుంటే జేమ్స్ బాండ్ గొర్తొస్తున్నాడని, ఎన్టీఆర్ అలాంటి పాత్రలకు బాగా సూటవుతాడని అనిపిస్తోందని అంటున్నారు అభిమానులు.

English summary
Search of participants for the First Edition of celebrity reality show 'Bigg Boss' is going on at the moment. Star Maa Management has been trying to make the show as entertaining as possible by roping some of the busiest celebrities. As per latest update, Anasuya was approached with a fancy price by the representatives of Bigg Boss.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu