For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కొత్త వ్యాపారం మొదలు పెట్టిన అరియానా.. మీ సపోర్ట్ కావాలట!

  |

  ఎవరు కష్టపడినా పిడికెడు అన్నం కోసమే. కానీ ఒక స్టేజ్ దాటాక సంపాదన పెరుగుతూ ఉంటే ఆ సంపాదనను వివిధ రకాల వ్యాపారాల్లో పెట్టడానికి చూస్తూ ఉంటారు, ఇది మానవ సహజం. మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్లు సైతం తమకు వచ్చిన ఆదాయాన్ని వివిధ వ్యాపారాల్లో పెట్టి డబ్బు సంపాదించే ప్లాన్లో ఉంటారు. తాజాగా యాంకర్, బిగ్బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ కూడా ఒక కొత్త బిజినెస్ మొదలు పెడుతుంది. ఆ వివరాల్లోకి వెళితే

  యాంకర్ గా స్టార్ట్ అయి

  యాంకర్ గా స్టార్ట్ అయి

  తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జన్మించిన అర్చన గ్లోరీ నటన మీద ఉన్న ఆసక్తితో హైదరాబాద్ చేరింది. అయితే యాంకరింగ్ మీద కూడా ఆమెకు ఇష్టం ఉండడంతో ముందుగా యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. అరియానాగా మారిన ఆమె స్టూడియో వన్ అనే ఛానల్ నుంచి యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె సన్ నెట్వర్క్ కి సంబంధించిన జెమినీ కామెడీ, జెమినీ మ్యూజిక్ లాంటి చానల్స్ కి కూడా యాంకర్ గా వ్యవహరించడం మొదలుపెట్టింది.

  ఈటీవీలో కూడా

  ఈటీవీలో కూడా

  అలాగే కొద్ది రోజులకే ఆమెకు ఈ టీవీ ఛానల్ నుంచి అభిరుచి ప్రోగ్రాంకి హోస్ట్ చేయాల్సిందిగా అవకాశం దక్కడంతో మారు చూసుకోకుండా ఆ ఛానల్ లో చేరిపోయింది. అలాగే వంట చెయ్యతరమా అనే షో ద్వారా కూడా ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఆమె జెమిని టివి కిరాక్ కామెడీ షో ద్వారా జనాల్లోకి బాగా వెళ్ళింది అని చెప్పొచ్చు.

  ఓవర్ నైట్ స్టార్

  ఓవర్ నైట్ స్టార్

  అయితే తర్వాతి కాలంలో యూట్యూబ్ ఛానల్స్ విరివిగా పెరిగిపోయిన నేపథ్యంలో ఆమె ఒక ఫేమస్ యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా చేరింది. ఆ యూట్యూబ్ ఛానల్ వేదికగా రామ్ గోపాల్ వర్మని ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలకు బదులు, రామ్ గోపాల్ వర్మ నీ తొడలు బాగున్నాయ్ అంటూ కామెంట్ చేసి కలకలం రేపారు. ఈ దెబ్బకు ఆమెకు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. నిజానికి అంతకు ముందే ఆమె నా బాయ్ ఫ్రెండ్ చాలా మంచోడు అనే ఒక షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించింది.

  బిగ్ బాస్ క్రేజ్

  బిగ్ బాస్ క్రేజ్

  అయితే రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ తో వచ్చిన క్రేజ్ ఆమెకు ఏకంగా బిగ్ బాస్ లో ఎంటర్ అయ్యే అవకాశం తెచ్చిపెట్టింది. లాక్ డౌన్ ముగుస్తున్న సమయంలో బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయిన అరియానా గ్లోరీ మంచి కంటెస్టెంట్ గా నిలబడి టాప్-5లో చివరి వరకు పోటీ ఇచ్చింది. చివరికి అభిజిత్ టైటిల్ గెలిచాడు కానీ అరియానా మాత్రం బోల్డ్ బ్యూటీ గా అందరి దృష్టిలో పడిపోయింది. ఈ మధ్య కాలంలో ఒక బోల్డ్ ఇంటర్వ్యూతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ఇప్పుడు కొత్త బిజినెస్ మొదలు పెట్టింది.

  Ram Charan Biography: Ram Charan is one of the highest paid actors of Tollywood
  ఈవెంట్ ప్లానింగ్ సంస్థ

  ఈవెంట్ ప్లానింగ్ సంస్థ

  తాను తాజాగా ఆర్య ఈవెంట్ ప్లానర్స్ అనే సంస్థను ప్రారంభించానని, దానికి మీ అందరి సహకారం కావాలని అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా కోరింది. నిజానికి ఒకప్పుడు ఇంట్లో ఫంక్షన్ లు మొదలు ఏదైనా ఈవెంట్ చేయాలి అంటే అన్నీ దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ లకు ఈవెంట్లు అప్పగిస్తే వాళ్లు మన చేయి కూడా కదలకుండానే పని చేసి పెడుతున్నారు. మంచి లాభాలు తెచ్చి పెట్టే ఈ బిజినెస్ లోకి అరియానా దిగటం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

  English summary
  anchor ariyana glory of bigg boss 4 telugu fame launches arya event planners a new business venture of her own.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X