Don't Miss!
- News
మోదీ సర్కార్‌పై బీఆర్ఎస్ ప్రత్యక్ష యుద్ధం..!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
దేవీ నాగవల్లికి షాక్.. బిగ్‌బాస్‌లోకి ఎలిమినేటేడ్ సెలబ్రిటీ రీఎంట్రీ.. హెస్ట్‌గా సమంత
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 షోలో వచ్చే రెండు వారాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. కొద్దివారాలుగా నత్తనడక నడుస్తున్న రియాలిటీ షోకు కొత్త జోష్‌ను కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వారాంతంలో ప్రేక్షకులకు ఓ ఝలక్ ఇచ్చి.. ఆ తర్వాత షోను మరింత క్రేజీగా మలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే రెండు వారాల్లో జరుగబోయే పరిణామాలు ఏమిటంటే..
Recommended Video

ఆ ముగ్గురి ఎలిమినేషన్‌పై సందేహాలు
గత కొద్దివారాలుగా కంటెస్టెంట్ల ఎలిమినేషన్‌పై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఎలిమినేషన్ ప్రక్రియపై ట్రోలింగ్ గురించి ఇక చెప్పనక్కర్లేదు. దేవీ నాగవల్లి, జోర్దార్ సుజాత, కుమార్ సాయి లాంటి సెలబ్రిటీల ఎలిమినేషన్‌పై సోషల్ మీడియాలో వివాదాలు తలెత్తాయి. పలువురు సెలబ్రిటీలు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు.

జోర్దార్ సుజాత రీ ఎంట్రీ
అయితే ప్రేక్షకులకు మనోభావాలకు విరుద్దంగా దేవీ నాగవల్లి, జోర్దార్ సుజాత, కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారనే వాదన మధ్య ఓ సెలబ్రిటీకి బిగ్‌బాస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారనే వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో రీ ఎంట్రీ విషయంలో దేవి నాగవల్లి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే దేవీ నాగవల్లి పేరును పరిశీలనలోకి తీసుకోకుండా సుజాతను మళ్లీ ఇంటిలోకి పంపించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ఏ క్షణంలోనైనా ఎంట్రీకి రెడీగా
తాజా సమాచారం ప్రకారం.. జోర్దార్ సుజాతతో ఎండెమాల్ షైన్ ఇండియా నిర్వాహకులు సంప్రదింపులు జరుపుతున్నారు. కోవిడ్ 19 పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏ సమయంలోనైనా ఇంటిలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలనే సంకేతాలు ఇచ్చారు. అన్ని సవ్యంగా సాగితే వచ్చేవారం అంటే అక్టోబర్ 26వ గానీ, లేదా నవంబర్ 1వ తేదీన గానీ ఇంటిలోకి వెళ్లే అవకాశం ఉంది అనే విషయం బయటకు పొక్కింది.

ఈ వారం నో ఎలిమినేషన్
ఇక దసరా పండుగ నేపథ్యంలో కొనసాగే వారాంతంలో కీలకమైన పరిణామం చోటుచేసుకోబోతున్నదనే సంకేతాలు బయటకు వచ్చాయి. ఈ వారంలో ఎలిమినేషన్ ఉండదనే విషయం దాదాపుగా ఖరారైంది. అయితే చివరి నిమిషంలో నిర్వాహకులు ట్విస్ట్ ఇవ్వాలనుకొంటే ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగించవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

సమంత అక్కినేని హోస్ట్‌గా
ఇదిలా ఉండగా, నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగులో బిజీ ఉన్న కారణంగా ఆయన స్థానంలో హోస్ట్‌గా సమంత అక్కినేని వ్యవహరించనున్నారు. వారాంతం అంటే అక్టోబర్ 24, 25 తేదీల్లో సమంత అక్కినేని వేదికపైకి రానున్నారు. ఈ రెండు ఎపిసోడ్స్‌కు సంబంధించిన షూట్ శుక్రవారం, శనివారాల్లో జరుగనున్నది. గతంలో నాగార్జున తన బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీలో విదేశాలకు వెళ్లిన సమయంలో ఆయన స్థానంలో రమ్యకృష్ణ వేదికపైకి వచ్చి హెస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.