Don't Miss!
- News
డీఎంకే ప్రభుత్వ పెద్దలతో ఏపీ మంత్రులు- చెన్నైలో కీలక భేటీ..!!
- Finance
Indian IT in US: అమెరికాలో భారతీయుల అగచాట్లు.. 60 రోజులే డెడ్ లైన్ !!
- Sports
పెళ్లితో ఒక్కటయ్యాం.. ఆశీర్వదించండి: కేఎల్ రాహుల్
- Lifestyle
పురుషులు ఎదుర్కొనే శీఘ్ర స్కలన సమస్యలకు కొన్ని సింపుల్ హోం రెమెడీస్!
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Anchor Lasya: యాంకర్ లాస్య ప్రెగ్నెంట్.. సీమంతం వీడియోను వైరల్ చేసిన గీతూ రాయల్
బుల్లితెరపై ఇప్పటివరకు ఎంతోమంది యాంకర్లు సందడి చేశారు.. ఇంకా చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. తమదైన శైలీలో యాంకర్ గా రాణిస్తూ పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో యాంకర్ లాస్య ఒకరు. తన యాంకరింగ్‌తో అనేక మంది అభిమానులను సంపాదించుకుంది. ఒకప్పుడు యాంకర్‌గా అదరగొట్టిన లాస్య.. తర్వాత పలు వ్యక్తిగత కారణాల వల్ల యాంకరింగ్‌కు దూరమైంది. అయితే బిగ్ బాస్ ద్వారా మరోసారి సందడి చేసిన యాంకర్ లాస్య ఇటీవల ప్రెగ్నెంట్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె సీమంతం వీడియో వైరల్ గా మారింది.

బుల్లితెరపై పాపులర్ జోడీగా..
ప్రముఖ యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒకప్పుడు బుల్లితెరపై తన యాంకరింగ్‌తో అదరగొట్టింది. తనదైన స్టైల్ లో చలాకీగా మాట్లాడుతూ వాగుడు కాయిగా పేరు తెచ్చుకుంది. ఇక యాంకర్ రవి, లాస్య జోడికి మాములు రెస్పాన్స్ రాలేదు. యాంకరింగ్‌లో వీరిద్దరి జోడి మోస్ట్ పాపులర్ అయిన విషయం తెలిసిందే. యాంకరింగ్ లో ఎవరు తెచ్చుకోనంత గుర్తింపును యాంకర్ లాస్య-రవి సంపాదించుకున్నారు.

అమాయకత్వంగా..
బుల్లితెరపై స్టార్ యాంకర్స్ గా కొనసాగిన, కొనసాగుతున్న అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి వాళ్లతో సహా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది యాంకర్ లాస్య. ముఖ్యంగా తన అమాయకత్వంతో చీమ ఏనుగు జోక్స్ చెప్పి సమ్‌థింగ్ స్పెషల్ అంటూ క్యూట్‌గా అందరిని నవ్వించేది. చురుకైన యాటిట్యూడ్‌తో, చలాకీ మాటలతో బుల్లితెరపై ఆద్యంతం ఆకట్టుకుని ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.

బిగ్ బాస్ షో ద్వారా రీ ఎంట్రీ..
యాంకరింగ్ తర్వాత పలు వ్యక్తిగత కారణాలతో ఆ కెరీర్ కు దూరమైంది లాస్య. ఆమె యాంకరింగ్ మానేయడానికి అనేక రూమర్స్ వినిపించాయి. వాటన్నింటిని యాంకర్ లాస్య సైతం ఖండించింది. తను యాంకరింగ్ మానేయడానికి గల కారణాలను పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది లాస్య. యాంకరింగ్ తర్వాత లాస్య బిగ్‌బాస్ తెలుగు 4వ సీజన్ తో బుల్లితెరపై మళ్లీ ఎంట్రీ ఇచ్చింది.

అంతగా రాణించలేని లాస్య..
బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ లో ముందుగా అందరి దృష్టిని ఆకర్షించిన లాస్య తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. హౌజ్ లో వంటగదికే పరిమితం అయిన లాస్య అంతగా రాణించలేకపోయింది. అలాగే కొన్నిసార్లు కొంతమేర నెగెటివిటీని కూడా మూటగట్టుకుంది. తర్వాత బిగ్ బాస్ హౌజ్ ను తొందర్లోనే విడిచి పెట్టిపోయింది. ఇలా బిగ్ బాస్ షో ద్వారా యాంకర్ లాస్య అంతగా క్రేజ్ దక్కించుకోలేకపోయిందనే చెప్పవచ్చు.
త్వరలో బేబీ రానుందని..
బిగ్ బాస్ షో తర్వాత ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి రకరకాల వీడియోలతో అలరిస్తూ వచ్చింది యాంకర్ లాస్య. అయితే ఇటీవల తను అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. తను మరోసారి తల్లిని కాబోతున్నట్లు భర్తతతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. ''నేను మరోసారి తల్లిని కాబోతున్నాను. బేబి త్వరలో రానుంది. మరో రెండు చిట్టి పాదాలతో మా కుటుంబం మరింత పెద్దది కానుంది'' అని రాసుకొచ్చింది లాస్య
గీతూ రాయల్ వీడియో వైరల్..
అయితే తాజాగా యాంకర్ లాస్య సీమంతపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బుల్లితెర నటీమణులు శ్రీవాణి, సుష్మతోపాటు బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్ గీతూ రాయల్, హాట్ బ్యూటి అలేఖ్య హారిక వచ్చి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను గీతూ రాయల్ షేర్ చేసింది. దీంతో యాంకర్ లాస్య సీమంతపు ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే యాంకర్ లాస్య జనవరి లేదా ఫిబ్రవరి నెలలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది.