»   » రవికి అప్పటికే పెళ్లైంది.. భార్యకు విడాకులిస్తానన్నాడు.. లాస్య

రవికి అప్పటికే పెళ్లైంది.. భార్యకు విడాకులిస్తానన్నాడు.. లాస్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాప్ యాంకర్లకు దీటుగా దూసుకొచ్చిన యాంకర్ లాస్యకు బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ ఉన్నది. పలు టీవీ షోలలో యాంకర్ రవితో కలిసి ఆమె చేసిన కార్యక్రమాలకు మంచి రేటింగ్ వచ్చింది. బుల్లితెరపై వారిద్దరి కెమిస్ట్రీ చక్కగా ఉండటంతో రవి, లాస్యల మధ్య అఫైర్ ఉందనే రూమర్లు బాగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల మంజునాథ్ అనే వ్యాపారవేత్తతో ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ సందర్భంగా తన జీవితంలోకి కొన్ని ఆసక్తికరమైన విషయాలను యూట్యూబ్ ఛానల్ కు వెల్లడించింది.

ఓ వ్యక్తి భార్యకు విడాకులు ఇస్తానన్నాడు

ఓ వ్యక్తి భార్యకు విడాకులు ఇస్తానన్నాడు

‘టెలివిజన్ రంగంలో నాతో కలిసి ఎన్నో ప్రోగ్రామ్‌లు చేశాడు. అప్పటికే అతడికి మ్యారేజ్ అయిపోయింది. అయినా అతను నన్ను పెళ్ళి చేసుకొంటానని ప్రపోజ్‌ చేశాడు. ‘నువ్వంటే నాకిష్టం. నా భార్యకు విడాలకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను' అని చెప్పాడు. నాకు కూడా ఓ లవర్‌ ఉన్నాడని అతనికి తెలుసు. అయినా నాకు ప్రపోజ్ చేయడం ఎంతో బాధించింది. అతని నిర్ణయం సరికాదని అనిపించింది. అప్పట్నుంచి ఆయనకు దూరంగా ఉంటున్నాను అని లాస్య తెలిపింది. ఈ ఇంటర్వ్యూలో ఆ వ్యక్తి పేరు చెప్పడానికి నిరాకరించింది.

మంజుకు ప్రతీది చెప్పేదానని

మంజుకు ప్రతీది చెప్పేదానని

లైఫ్‌లో ఆనందంగా ఎలా ఉండటం ఎలా అంటే లాస్యను అడిగితే చెప్పతుంది. జీవితంలో చాలా పారదర్శకంగా ఉండాలి. నేను షూటింగ్‌లో ఉంటే ప్రతీ విషయం మంజునాథ్‌కు ఫోన్‌లో చెప్పేదానిని. ఎవరెవరూ ఏం కామెంట్స్ చేస్తున్నారనే విషయాల్ని చెప్పేదానిని. షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లే వరకు ఫోన్‌లో మాట్లాడేదానిని. పక్కవాళ్లు చూస్తే వారికే విసుగొచ్చేది' అని లాస్య తన మనోభావాలను పంచుకొన్నది.

రవికి అంతకుముందే పెళ్లయిపోయింది

రవికి అంతకుముందే పెళ్లయిపోయింది

బుల్లితెర మీద మా కెమిస్ట్రీ చూసి చాలా మంది రవి, నేను లవర్స్ అనుకొనేవారు. రవికి అంతకుముందే పెళ్లిపోయిందనే విషయం చాలామందికి తెలియదు. రవి పర్సనల్ ఫ్రెండ్ కాదు. జస్ట్ ప్రొఫెషనల్ ఫ్రెండ్ మాత్రమే. వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకొనే అంత క్లోజ్ లేదు. రవికి ముందే నాకు బావ ఉన్నాడని చెప్పాను. అని లాస్య తెలిపింది.

ఢీ జోడి సందర్భంగా రవితో విభేదాలు

ఢీ జోడి సందర్భంగా రవితో విభేదాలు

‘ఢీ జోడి ప్రొగ్రాంలో రవికి, నాకు విభేదాలు వచ్చాయి. ఎక్కువగా రవితో కార్యక్రమాలు చెయొద్దని నిర్ణయించుకొన్నాను. రూమర్లు ఎక్కవగా వస్తుండటం ఫ్యామిలీ కూడా బాధపడింది. రూమర్ల నేపథ్యంలో రవితో పనిచేయవద్దని కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పారు' లాస్య వెల్లడించింది. రవి పర్సనల్ ఫ్రెండ్ కాదని, కేవలం ప్రొఫెషనల్ మాత్రమేనని యాంకర్ లాస్య చెప్పారు. టెలివిజన్ రంగంలో తనతో కలిసి పనిచేసిన ఓ వ్యక్తి తన కోసం భార్యకు విడాకులిస్తానని చెప్పాడని ఆమె తెలిపారు.

English summary
Lasya talks about her life and profession. she said Ravi is only professional friend. one of my collegues ready give divorce for her wife for me.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu