»   » యాంకర్ ప్రదీప్ అరెస్ట్.. చెక్ బౌన్స్ కేసులో చంచలగూడకు..

యాంకర్ ప్రదీప్ అరెస్ట్.. చెక్ బౌన్స్ కేసులో చంచలగూడకు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్న యువ యాంకర్ ప్రదీప్‌ అరెస్ట్ అయ్యాడనే వార్త సంచలనం రేపుతున్నది. చెక్ బౌన్స్ కేసులో ప్రదీప్‌ను శుక్రవారం ఎర్రమంజిల్ కోర్టు రిమాండ్ తరలిస్తూ తీర్పు చెప్పినట్టు తెలిసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రదీప్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే పరిశ్రమకు చెందిన ప్రముఖ వ్యక్తులు రంగంలోకి దిగి అదే రోజు బెయిల్‌పై బయటకు తీసుకురావడం జరిగిందనే తాజా సమాచారం.

అప్పు వివాదంలో

అప్పు వివాదంలో

ఓ వ్యక్తి దగ్గర యాంకర్ ప్రదీప్ అప్పుగా తీసుకొన్న వ్యవహారం వారి మధ్య వివాదంగా మారిందని, దాంతో సదరు వ్యక్తి ప్రదీప్‌పై కేసు నమోదు చేసినట్టు తెలుస్తున్నది. ఈ కేసులో ప్రదీప్ పలుమార్లు కోర్టుకు హాజరయ్యారని, చెక్ బౌన్స్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు అతనికి రిమాండ్ విధించినట్టు తెలిసిందే.

 గతంలో పలు మార్లు..

గతంలో పలు మార్లు..

గతంలో తప్పతాగి క్లబ్‌లో పార్టీలో ఆ అమ్మాయితో దురుసుగా ప్రవర్తించారనే వార్త కూడా మీడియాలో ప్రచారమైంది. అతిగా మద్యం సేవించిన ప్రదీప్ ఓ అమ్మాయిపై కామెంట్ చేయగా, ఆ అమ్మాయి ఫ్రెండ్స్‌ ప్రదీప్ బృందానికి వార్నింగ్ ఇచ్చినట్టు వార్త ప్రచారమైంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రదీప్ బృందాన్ని బౌన్లర్లు అక్కడి నుంచి వెళ్లగొట్టినట్టు తెలిసింది.

ఈవెంట్ మేనేజర్‌గా ప్రదీప్

ఈవెంట్ మేనేజర్‌గా ప్రదీప్

తాజాగా చెక్ బౌన్స్ వ్యవహారం ప్రదీప్‌ మీడియాలో ప్రధాన అంశంగా మారాడు. ప్రదీప్ పూర్తి పేరు ప్రదీప్ మాచిరాజు. హైదరాబాద్ లో ఈవెంట్ ఆర్గనైజర్ కెరీర్ మొదలు పెట్టాడు. తనకున్న టాకింగ్ స్కిల్స్ రేడియో జాకీగా అవకాశాన్ని తెచ్చిపెట్టింది. రేడియో జాకీగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

రోజుకు భారీగానే రెమ్యునరేషన్

రోజుకు భారీగానే రెమ్యునరేషన్

పలు టెలివిజన్ ఛానెల్లలో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ భారీగానే రెమ్యునరేషన్ తీసుకొంటున్నాడనేది తాజా సమాచారం. తొలి టీవీ షోకు రోజుకు రూ.30 వేలకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకున్నాడని తెలుస్తున్నది. ఇలా మెరుగైన ఆర్థిక పరిస్థితి ఉన్న ప్రదీప్ విషయంలో చెక్ బౌన్స్ వివాదం ఎలా చోటుచేసుకొన్నదనే ప్రస్తుతం చర్చగా మారింది.

English summary
Anchor Pradeep Machiraj arrested in Check Bounce case. As per Erramanzil court of Hyderabad sent him to remand, and police shifted Chanchalguda Jail. Reports reveals that He gets bail same day of the incident.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu