Don't Miss!
- Technology
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- News
YS Jagan, Chandrababu : జగన్, చంద్రబాబుకూ సంక్షేమ సవాల్ ! లబ్దిదారుల డిమాండ్లు ఇవే..!
- Finance
Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ఇక ఒక్కరోజే టైమ్.. జాగ్రత్త ట్రేడర్స్
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Automobiles
కుర్రకారుని ఉర్రూతలూగించే 'అల్ట్రావయోలెట్ F77 రీకాన్' రివ్యూ.. ఫుల్ డీటైల్స్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఒరేయ్ మరీ అంత కామంతో చూడకు.. ఆ ఆర్టిస్ట్ పరువుదీసిన యాంకర్ రష్మీ
జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోల్లో ఈ మధ్య పంచ్‌ల వరద ఎక్కువైంది. మరీ ముఖ్యంగా స్కిట్స్ పర్ఫామ్ చేసే ఆర్టిస్ట్‌లకంటే జడ్జ్‌లగా ఉన్న రోజా, మనోలు ఎక్కువగా సెటైర్లు వేస్తుంటారు. మధ్య మధ్యలోరష్మీ, అనసూయలు కూడా కౌంటర్లు వేస్తుంటారు. హైపర్ ఆది స్కిట్‌లో అనసూయ, సుధీర్ టీంలో రష్మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య మాత్రం అందరి స్కిట్స్‌లో ఇలా టీం లీడర్స్, కంటెస్టెంట్లపై కౌంటర్లు పడుతూనే ఉన్నాయి.

ఇమ్మాన్యుయేల్ ఫేమస్..
ఈ మధ్య కాలంలో జబర్దస్త్ వేదికపై నుంచి ఇమ్మాన్యుయేల్ బాగానే ఫేమస్ అయ్యాడు. అతని రంగే బాగా కలిసి వచ్చింది. అందరూ బలహీనత అనుకునే దాన్ని బలంగా మార్చుకున్నాడు. నల్లగా ఉన్నారని సెటైర్లు వేసినా వాటి ద్వారానే బాగా ఫేమస్ అయ్యాడు. రోజాతో కావాలని తిట్టించుకుంటూ సెటైర్లు వేయించుకుంటూ బాగానే ఫేమస్ అయ్యాడు.

అవినాష్ వెళ్లడంతో..
అవినాష్ బిగ్ బాస్ హౌస్‌కు వెళ్లడంతో కెవ్వు కార్తీక్ సింగిల్‌గానే బండి లాక్కొస్తున్నాడు. కానీ కార్తీక్ స్కిట్స్ అంతకు మించి అన్నట్టు బాగానే పేలుతున్నాయి. కొత్త కొత్త కాన్సెప్ట్‌తో బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. తాజాగా మళ్లీ ఓ స్కిట్‌ను చేశాడు. అందులో రష్మీ రెచ్చిపోయింది. ఆమె వేసిన కౌంటర్‌కు అందరూ షాక్ అయ్యారు.

ఇమ్మాన్యుయేల్ అలా..
తాజాగా వేసిన స్కిట్‌లో ఇమ్మాన్యుయేల్ కార్తీక్ అదరగొట్టినట్టు తెలుస్తోంది. ఇమ్మాన్యయేల్ పెళ్లికి తొందరపడటం, అప్పుడే ఓ అమ్మాయి అక్కడ కనిపించడంతో అదో మాదిరిగా చూశాడు. ఇమ్మాన్యుయేల్ చూసిన చూపులకు రష్మీ కౌంటర్ వేసింది. ఆ దెబ్బకు అందరూ షాక్ అయ్యారు.

కామంతో కాదురా..
ఇమ్మాన్యుయేల్ చూసిన చూపుకు రష్మీ సెటైర్ వేస్తూ.. ఒరేయ్ కామంతో కాదురా ప్రేమతో చూడురా ఆ చూపు ఏంటి అంటూ ఓ రేంజ్‌లో సెటైర్ వేసింది. దీంతో జడ్జ్ మనో, రోజాలతో సహా అందరూ పగలబడి నవ్వేశారు. ఆ మాటతో ఇమ్మాన్యుయేల్ కూడా తల అటు తిప్పుకున్నాడు.