»   » హద్దుమీరిన సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి వార్నింగ్!

హద్దుమీరిన సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి వార్నింగ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జబర్దస్త్ కామెడీ షోలో స్కిట్లు చేసే క్రమంలో హాట్ యాంకర్ రష్మి మీద కొందరు టీం లీడర్లు సెటైర్లు వేయడం, ఆమె వేసిన చిట్టి పొట్టి డ్రెస్సులను ఉద్దేశించి ఎటకారంగా మాట్లాడటం తెలిసిందే. ఇక సుడిగాలి సుధీర్ అయితే రష్మిని చాలా సందర్భాల్లో ఇబ్బంది పెట్టాడు. అతడి వాలకం చూసి ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే రూమర్స్ కూడా అప్పట్లో స్ప్రెడ్ అయ్యాయి.

తాజాగా మరోసారి సుడిగాలి సుధీర్ రష్మిని ఇబ్బంది పెట్టేవిధంగా ప్రవర్తించి వార్తల్లోకి ఎక్కాడు. ఢీ జోడి ప్రోగామ్‌లో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ...ఎప్పటికైనా ఢీ జోడి అయ్యేలోపు ఒక్కసారైనా డాన్స్ చేయాని తన మనసులోని కోరికటను బయట పెట్టాడు. అంతటితో ఆగకుండా రష్మి వద్దకు వెళ్లి ఎక్స్ ట్రాలు చేసాడు.

రష్మి భుజంపై చెయ్యేసి...

రష్మి భుజంపై చెయ్యేసి...

రష్మి భుజంపై చేయ్యేసి వేసి నీ కోరిక ఏమిటో కూడా నాకు తెలుసు అంటూ ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసాడు. దీంతో చిర్రెత్తిపోయిన రష్మి ఒక్కసారిగా సుడిగాలి సుధీర్‌ని పక్కకి నెట్టేసింది.

వార్నింగ్

వార్నింగ్

తనతో హద్దు మీరి ప్రవర్తించిన సుడిగాలి సుధీర్ కు రష్మి ....గ్యాప్ మైంటైన్ చేయ్ అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఛాన్స్ దొరికితే చెయ్యి పెడతావ్ అంటూ తన భుజంపై చెయ్యేసిన అతన్ని ఇక్క ఉదుటన పక్కకి తోసేసింది.

అంతా షాక్

అంతా షాక్

సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి మధ్య జరిగిన ఈ ఘటన చూసి యాంకర్ ప్రదీప్ తో పాటు అంతా షాకయ్యారు. ఇంతలో జడ్జిలు దీన్ని లైట్ తీసుకోవాలనే విధంగా పెద్దగా నవ్వారు. దీంతో దీన్ని ఇష్యూ చేయకుండా కామ్ అయిపోయారు.

తప్పు మాదే: యాంకర్ రేష్మి-సుధీర్ ఎఫైర్, నిజం బయట పెట్టిన గెటప్ శ్రీను!

తప్పు మాదే: యాంకర్ రేష్మి-సుధీర్ ఎఫైర్, నిజం బయట పెట్టిన గెటప్ శ్రీను!

రేష్మి, సుధీర్ లవర్స్ అని, ఎఫైర్ ఉందని అంటున్నారు... నిజమేనా? అంటూ ఓ అభిమాని ప్రశ్నించగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Anchor Rashmi warns Sudigali Sudheer in Dhee Jodi program.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu