»   » ఏం తప్పు చేయలేదు! అంటూ ..యాంకర్ రవి ఫేస్ బుక్ పోస్ట్ కి వీర రెస్పాన్స్

ఏం తప్పు చేయలేదు! అంటూ ..యాంకర్ రవి ఫేస్ బుక్ పోస్ట్ కి వీర రెస్పాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ తరం యాంకర్లలో రవి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు . పటాస్ ,కిరాక్ ,మా టాకీస్ ,డీ జూనియర్స్ , ఫ్యామిలీ సర్కస్ మొదలయిన టీవీషో లతో చాలా బిజీ గా ఉన్న ఈ టాలెంటెడ్ యాంకర్ సోషల్ మీడియాలో కూడా తన కామెంట్స్ తో హల్ చల్ చేస్తున్నాడు

ఆయన పెట్టే పోస్ట్ లకు ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. దాన్ని బట్టే చెప్పవచ్చు ఆయనకు ఎంత క్రేజ్ ఏర్పడిందో. బిజీ యాంకర్‌గా మారిపోయి శ్రీముఖితో 'పటాస్' షో చేస్తున్నా సోషల్‌మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నాడు. తాజాగా రవి పెట్టిన ఓ పోస్ట్‌కి సోషల్ మీడియాలో ఆయన అభిమానులు అర్దం కాక ఆలోచనలో పడుతున్నారు. మీరూ చూడండి ఆ పోస్ట్. మీకేమన్నా అర్దం అవుతుందేమో.

'నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు. కానీ నువ్వు ఇష్టపడే వాళ్లు నీ తప్పే అంటున్నారు. నీ తప్పు కాదు అని ప్రూఫ్ కూడా నీ దగ్గర లేదు. నరకం రా బాబు. సిచుయేషన్ ఈజీగా తీసుకోలేము. వాళ్లకి ఎక్స్‌ప్లయిన్ చేసినా మనల్ని నమ్ముతారు అని అనుకోలేము. ఏమైంది అని అడగొద్దు భయ్యా.. కానీ సొల్యూషన్ ఉంటే ఇవ్వండి' అంటూ రవి పెట్టిన ఈ పోస్ట్‌ కి ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది.

రవి పోస్ట్ కు స్పందించిన కొంత మంది తమకు తోచిన సొల్యూషన్ ఇస్తుంటే, మరి కొంత మంది కామెంట్లతో ఆడుకుంటున్నారు . ఈ నేపథ్యంలో ఓ అభిమాని కామెంట్‌కు రవి రిప్లయ్ ఇచ్చాడు. ఇంతకీ ఆ అభిమాని ఏమన్నాడు అంటే...

'అరెయ్.. నువ్వు రోజూ పటాస్‌లో చేసేది తప్పురా బాబూ.. నువ్వూ .. నీ డబుల్ మీనింగ్ డైలాగులు.. చూడలేక చస్తున్నాంరా బాబూ.. శ్రీముఖితో నీ డాన్స్ ఆపి అప్పుడు నీతులు చెప్పు' అని ఓ నెటిజన్ పెట్టిన కామెంట్‌కు.. ఇలా రిప్లై ఇచ్చాడు.

'చూడలేక చస్తున్నాం అంటూనే చూస్తున్నావ్ చూడు.. ఇది మామా మా సక్సెస్ అంటే' అంటూ రిప్లయ్ ఇచ్చాడు యాంకర్ రవి. 'అయినా ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టే వాళ్లు అలా చేస్తున్నారు.. అందులో వాళ్ల తప్పేముంది. చూసే వాళ్లలో మార్పు వస్తేనే.. షోలు చేసే వాళ్లలో కూడా మార్పు వస్తుంది.' అని మరో నెటిజన్ పోస్ట్ చేశాడు.

పది వేల నుంచి నెలకు పది లక్షల రూపాయలు తీసుకొనే రేంజ్‌కు ఎదిగిన యాంకర్ రవి అని మొన్న ఓ వెబ్‌సైట్‌లో వచ్చిన వార్తను రవి ఖండించాడు. అది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశాడు.

English summary
The latest Facebook post by the Anchor Ravie created waves in the social networking sites, most importantly Facebook.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu