ఆ నటుడితో శ్రీముఖి రొమాన్స్.. బాయ్‌ఫ్రెండ్ వయసు చూసి షాక్‌లో రాములమ్మ!

తెలుగులో టాప్ యాంకర్‌ల లిస్ట్ తీస్తే అందులో ఖచ్చితంగా వినిపించే పేరు శ్రీముఖి. సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలలో సుమ కనకాల దూసుకెళ్తుంటే బుల్లితెరపై మాత్రం శ్రీముఖి హవానే కనిపిస్తోంది. అనసూయ, శ్యామల తదితర టాప్ యాంకర్లు ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉండటంతో శ్రీముఖికి పోటీ లేకుండా పోయింది. తెలుగులోని టాప్ ఛానెల్స్‌‌లో ఏ షో తీసుకున్నా శ్రీముఖియే కనిపిస్తున్నారు. అందం, చలాకీతనంతో తను ఉన్న చోట ఫుల్ జోష్ తీసుకొస్తారు శ్రీముఖి.

అదుర్స్‌తో శ్రీముఖి ఎంట్రీ
అదుర్స్ అనే షోతో యాంకరింగ్ ప్రారంభించిన శ్రీముఖీ.. తన లుక్స్, టాలెంట్‌తో అనతికాలంలోనే స్టార్ యాంకర్‌గా ఎదిగింది. యాంకరింగ్‌తో పాటు వెండితెర నుంచి కూడా శ్రీముఖికి పిలుపొచ్చింది. జులాయి సినిమాలో అల్లు అర్జున్‌కు చెల్లెలిగా నటించి ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఆమెకు మరింత పేరు తీసుకొచ్చింది. నేను శైలజ, సావిత్రి, జెంటిల్‌మెన్, మనలో ఒకడు, బాబు బాగా బిజీ, క్రేజీ అంకుల్స్, మ్యాస్ట్రో, భోళా శంకర్ సినిమాలలో రాములమ్మ నటించారు. మెగాస్టార్ చిరంజీవితో నటించిన భోళా శంకర్ తర్వాత కొత్తగా ఏ ప్రాజెక్ట్‌కు రాములమ్మ కమిట్ కాలేదు.

Anchor Sreemukhi getting shock after knowing Mukesh Gowda real age in Aadivaram With Star Maa Parivaaram

బిగ్‌బాస్‌లో రన్నరప్‌గా
బుల్లితెరపై పటాస్, సూపర్ మామ్, సూపర్ సింగర్ 9, జీ సరిగమప, జూలకటక, కామెడీ నైట్స్, గోల్డ్ రష్, కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ వంటి కార్యక్రమాలకు హోస్ట్‌గా చేశారు. ఈ పాపులారిటీతో బిగ్‌బాస్ నుంచి శ్రీముఖికి కబురొచ్చింది. అద్భుతంగా ఆడి ఫైనల్ వరకు వచ్చినప్పటికీ రన్నరప్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లేదంటే ఖచ్చితంగా బిగ్‌బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌గా నిలిచిన తొలి లేడీ కంటస్టెంట్‌గా నిలిచేవారు శ్రీముఖి. బిగ్‌బాస్ తర్వాత ఆమె పాపులారిటీ మరింత పెరిగింది.

ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో సందడి
ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతోన్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం అనే కార్యక్రమానికి గత కొన్నిరోజులుగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు శ్రీముఖి. స్టార్ మాలో వచ్చే టాప్ సీరియల్స్‌లోని నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రేక్షకులకు అలరిస్తున్నారు. అలాగే వారికి ఫాలోయింగ్ కూడా బాగా పెరుగుతోంది. తాజాగా ఈ ఆదివారానికి సంబంధించిన ప్రోమోను స్టార్ విడుదల చేసింది. దీనిలో భాగంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారి ఫోటోలను ఆర్డర్‌లో పెట్టి, దాని మీద మార్కర్‌తో వాళ్ల అసలు వయసుని రాయాలని శ్రీముఖి టాస్క్ ఇచ్చింది.

నువ్వు నా కంటే చిన్నోడివా
కార్యక్రమం మొదలవ్వగానే ఆ ఏజ్ చెప్పడానికి నేను ఒప్పుకోనని రోహిణి అనగా.. బోర్డ్ సరిపోవడం లేదా? అని ఓ నటుడు పంచ్ వేస్తాడు. ఎప్పుడూ నన్నే మారుస్తున్నారు కానీ భాను ఫోటో మాత్రం మార్చడం లేదని ఆ వ్యక్తి అంటాడు. ఇంతలో గుప్పెడంత మనసు ఫేమ్ ముఖేష్ గౌడ వయసు చూసి శ్రీముఖి షాక్ అయ్యింది. ముఖేష్.. నేను నీతో ఓ రొమాన్స్ చేసేస్తున్నాను కానీ నువ్వు నా కంటే చిన్నోడివా? అని నిలదీసింది. ఆ వెంటనే ముఖేష్ పక్కనే ఉన్న రౌడీ రోహిణి.. ప్రేమకు ఏజ్‌తో సంబంధం లేదురా, మనం లవ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చంటూ పంచ్ విసిరింది. దాంతో అందరూ నవ్వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. బుల్లితెర నటీనటుల అసలు వయసు తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: sreemukhi mukesh gowda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X