For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీక్రెట్ రివీల్: గోవాలో శ్రీముఖికి చేదు అనుభవం.. ఆ పిచ్చితో సర్వం కోల్పోయింది!

  By Manoj
  |

  తెలుగు బుల్లితెరపై కొంత మంది యాంకర్లకు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు, భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి వారిలో హాట్ బ్యూటీ శ్రీముఖి పేరును ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కెరీర్‌ను ప్రారంభించిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును దక్కించుకోవడంతో పాటు ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుని స్టార్ యాంకర్‌గా మారిపోయింది. అదే సమయంలో ఆమె చాలా వివాదాల్లో చిక్కుకుంది కూడా. తాజాగా శ్రీముఖి గురించి ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని ఒక విషయం రివీల్ అయింది. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. ఆ వివరాలు మీకోసం.!

  శ్రీముఖి.. ఆ ఇద్దరు స్టార్ హీరోలకు సోదరి

  శ్రీముఖి.. ఆ ఇద్దరు స్టార్ హీరోలకు సోదరి

  బుల్లితెరపైకి ఎంటర్ అవకముందే సినిమాల్లో అవకాశం దక్కించుకుంది హాట్ యాంకర్ శ్రీముఖి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘జులాయి'లో ఆమె అల్లు అర్జున్‌కు సోదరిగా నటించింది. ఆ తర్వాత రామ్ నటించిన ‘నేను శైలజ'లోనూ అదే తరహా రోల్ చేసింది. ‘ప్రేమ ఇష్క్ కాదల్'తో హీరోయిన్‌గా పరిచయం అయిన ఆమెకు ‘జెంటిల్‌మన్', ‘బాబు బాగా బిజీ' చిత్రాలు గుర్తింపును తెచ్చాయి.

  అదుర్స్ అంటూ వచ్చింది.. అదరగొట్టేస్తోంది

  అదుర్స్ అంటూ వచ్చింది.. అదరగొట్టేస్తోంది

  సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే శ్రీముఖి బుల్లితెరపైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించింది. ఇందులో భాగంగానే ‘అదుర్స్' అనే షోతో టెలివిజన్ రంగానికి యాంకర్‌గా పరిచయం అయింది. దాని తర్వాతి సీజన్‌తో పాటు ‘మనీ మనీ', ‘సూపర్ సింగర్ 9', ‘జూలకటక', ‘సూపర్ మామ్', ‘సరిగమప' సహా ఎన్నో షోలను హోస్ట్ చేసింది.

  ఆ షో వల్లే శ్రీముఖికి ప్రత్యేకమైన గుర్తింపు

  ఆ షో వల్లే శ్రీముఖికి ప్రత్యేకమైన గుర్తింపు

  వరుస షోలు, సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సమయంలో శ్రీముఖి ‘పటాస్' అనే షోకు యాంకర్‌గా వచ్చింది. ఈ షోకు దాదాపు 1200 ఎపిసోడ్స్ పని చేసింది. ఈ క్రమంలోనే మేల్ యాంకర్ రవితో కలిసి ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ షో వల్ల శ్రీముఖికి ప్రత్యేకమైన గుర్తింపు రావడంతో పాటు బుల్లితెర రాములమ్మ అనే బిరుదు కూడా దక్కింది.

  ఆ ఇంట్లో వెళ్లింది.. ఊహించనది జరిగింది

  ఆ ఇంట్లో వెళ్లింది.. ఊహించనది జరిగింది

  కెరీర్‌ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలో శ్రీముఖి... బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్' సీజన్‌ 3లో కంటెస్టెంట్‌గా వెళ్లింది. ఇందుకోసం పని చేస్తున్న షోలు అన్నింటినీ వదులుకుంది. టైటిల్ ఫేవరెట్‌గా హౌస్‌లోకి ప్రవేశించిన రాములమ్మ... ఫైనల్‌ వరకూ చేరినా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఈ సీజన్‌ను ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ గెలుపొందిన విషయం తెలిసిందే.

  హాట్ షో.. డబుల్ మీనింగ్ డైలాగులు.. రచ్చ

  హాట్ షో.. డబుల్ మీనింగ్ డైలాగులు.. రచ్చ

  శ్రీముఖికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అదే సమయంలో ఆమెను వ్యతిరేకించే వాళ్ల లిస్టు కూడా చాలానే ఉంది. దీనికి కారణం కొన్ని షోలలో ఆమె వ్యవహరించిన తీరే. డబుల్ మీనింగ్ డైలాగులు, హగ్గులు, ముద్దులతో రచ్చ చేయడంతో చాలా సార్లు రాములమ్మ విమర్శల పాలైంది. అలాగే, సోషల్ మీడియాలో హాట్ షోతోనూ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది.

  సీక్రెట్ రివీల్.. శ్రీముఖికి చేదు అనుభవం

  సీక్రెట్ రివీల్.. శ్రీముఖికి చేదు అనుభవం

  లాక్ డౌన్ వల్ల ఖాళీగా ఉంటోన్న శ్రీముఖి తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. అలాగే, ఇప్పటి వరకు ఎవరికీ తెలియని కొన్ని విశేషాలను కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే శ్రీముఖికి కసీనో గేమ్ అంటే పిచ్చి అని, దాని వల్ల గోవాలో చేదు అనుభవం ఎదురైందని ఓ విషయం బహీర్గతమైంది.

  Mia Malkova's Climax Teaser Is Out | RGV | GST
  దాని మీద పిచ్చితో సర్వం కోల్పోయింది.!

  దాని మీద పిచ్చితో సర్వం కోల్పోయింది.!

  కసీనో గేమ్ మీద ఉన్న పిచ్చి వల్ల శ్రీముఖి చాలా డబ్బును కోల్పోయానని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. ‘ఫస్ట్ టైమ్ గోవా వెళ్లినప్పుడు కసీనో ఆడితే డబ్బులు వచ్చాయి. రెండోసారి వెళ్లినప్పుడు లాభం లేదు.. నష్టం లేదు. కానీ, మూడోసారి వెళ్లినప్పుడు మాత్రం నా డబ్బులన్నీ పోయాయి. దీంతో అప్పటి నుంచి ఆ గేమ్‌కు దూరంగా ఉండిపోయా' అని ఆమె వివరించింది.

  English summary
  Telugu Biggest Reality Show Bigg Boss 3 Telugu runner up Sreemukhi left for the Maldives along with her brother Sushruth and close friends on a vacation after staying in the Bigg Boss house for 100 days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X