బాధపడ్డా. ..మానసికంగా కుంగిపోయా: యాంకర్ సుమ

By Srikanya

Suma
హైదరాబాద్ : రాజీవ్‌తో ప్రేమ వ్యవహారం అమ్మకు చెబితే ఒప్పుకోలేదు. నాన్న ఏకంగా మాట్లాడటమే మానేశారు. నన్ను వారం పాటు ఎక్కడికీ పంపలేదు. అమ్మమ్మకి ఫోన్‌ చేసి సలహా అడిగారు. తను ఒప్పుకోవడంతో నాన్న మా పెళ్లి చేశారు. నేను అత్తారింటికి వెళుతుంటే మొదటిసారి నాన్న కళ్లలో నీళ్లు చూసి తట్టుకోలేకపోయా. ఈ మధ్యే ఆయన చనిపోయారు. ఇక, మా బాబు పుట్టిన మూణ్నెళ్లకు విజయవాడలోని ఓ లోకల్‌ ఛానల్‌లో యాంకరింగ్‌కు పిలిచారు. అప్పటి ఆర్థిక పరిస్థితిని బట్టి అది చేయడం తప్పనిసరి అయింది. బాలింతనైనా ఎండలో నెల రోజులు చేశా. కానీ నిర్మాత రూపాయి కూడా ఇవ్వలేదు. చాలా బాధపడ్డా. మానసికంగా కుంగిపోయా. అప్పట్నుంచి జాగ్రత్తగా ఉంటున్నా అంటూ చెప్పుకొచ్చింది యాంకర్ సుమ.

ఇరవై రెండేళ్ల కెరీర్‌... వేల కార్యక్రమాలూ, ధారావాహికలూ... ఇలా యాంకర్‌ సుమ గురించి చెప్పడం మొదలు పెడితే చిట్టా చాలా పెద్దదే! ఆ ప్రస్థానంలో హాస్యాన్నీ, నటననూ కలగలిపిన యాంకరింగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. అవార్డుల కంటే ఎంతో విలువైన ప్రముఖుల ప్రశంసలతో పాటూ, ప్రేక్షకుల అభిమానాన్నీ సంపాదించుకున్న సుమ తన అనుభవాలని మీడియాతో పంచుకుంది.

అలాగే నేను చేసిన 'అవాక్కయ్యారా' కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. 'పట్టుకుంటే పట్టు చీర' పెద్ద హిట్టయ్యింది. అది ఎనిమిదిన్నరేళ్లు చేశా. తరవాత 'మహిళలూ మహారాణులూ' గేమ్‌ షో చేశా. అది నాలుగొందల భాగాలు పూర్తయ్యాక 'స్టార్‌ మహిళ'గా మారింది. ప్రస్తుతం పదహారొందల ఎపిసోడ్లకు దగ్గరపడింది. మహిళల కోసం ఉద్దేశించిన డైలీ షో.. ఇన్ని ఎపిసోడ్‌లు పూర్తి చేసుకోవడం నాకు తెలిసి ఇదే ప్రథమం. నేను గడగడా మాట్లాడతానని మీకు తెలుసుగా! అదే దూకుడులో ఆరొందల ఆడియో విడుదల కార్యక్రమాలకు పని చేశా. నా కెరీర్‌లో మూడేళ్ల పాటు నోటికి విశ్రాంతే ఇవ్వలేదు. దాంతో గొంతుకి ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది.

వైద్యుల సలహా ఏంటంటే... మూణ్నెళ్లు గప్‌చుప్‌గా ఉండటం. పదిరోజులు మాట్లాడకుండా విశ్రాంతి తీసుకున్నా. కానీ నేను సైగలు చేస్తుంటే, ఇంట్లో వాళ్లూ సైగలు చేసేవారు. విసుగొచ్చి 'మీ నోరు బాగానే ఉందిగా' అని కోప్పడేదాన్ని. ప్రస్తుతం గొంతుకు సంబంధించి వ్యాయామాలు చేస్తూ, జాగ్రత్తలు తీసుకుంటూ... కార్యక్రమాలు చేస్తున్నా. ఇవన్నీ ఒకెత్తయితే కమల్‌హాసన్‌గారు 'ఈనాడు' ఆడియో విడుదలకు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి అభినందించడం మరొక ఎత్తు అంటూ ఆనందంగా చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X