twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ సుమ రూటే వేరు.. కష్టకాలంలో ఆదుకునేందుకు ముందుకు.. మీరూ చేయండని సందేశం

    |

    యాంకర్ సుమ కనబడని షో లేదు.. వినబడని రోజు ఉండదు. బుల్లితెర మహారాణిగా వెలుగొందుతున్న సుమ.. కొన్నేళ్లుగా అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉంది. ఎంతో మంది వచ్చి గ్లామర్ ఒలకబోసినా.. ఇంకా అందాలను ఆరబోస్తోన్నా.. సుమకు ఉన్న క్రేజ్ మాత్రం చెక్కు చెదరలేదు. బుల్లితెరపై తన స్టైలే వేరు అని చాటి చెప్పిన సుమ.. సామాజిక సేవలోనూ తన రూట్ వేరేనని తెలియజెప్పింది.

    కరోనాతో ఉక్కిరిబిక్కిరి..

    కరోనాతో ఉక్కిరిబిక్కిరి..


    కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేల మంది ప్రాణాలను కోల్పోతోన్నారు. కరోనాకు విరుగుడు కనిపెట్టలేక పోతోండటంతో మానవాళి ఆందోళనకు గురవుతోంది.

    అండగా నిలుస్తున్న సినీ లోకం..

    అండగా నిలుస్తున్న సినీ లోకం..

    కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. కరోనాతో పోరాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సినీ లోకం అండగా నిలుస్తోంది.

    కార్మికులను ఆదుకునేందుకు..

    కార్మికులను ఆదుకునేందుకు..


    సినిమా షూటింగ్‌లు నిలిపివేయడంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు దిక్కుతోచని స్థితిలోకి పడ్డారు. వీరిని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి.. కరోనా క్రైసిస్ ఛారిటీని స్థాపించాడు. చిరు పిలుపు మేరకు విరాళాలు వెల్లువలా వచ్చాయి.

    కొత్త మార్తాన్ని ఎంచుకున్న సుమ..

    కొత్త మార్తాన్ని ఎంచుకున్న సుమ..

    సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరు ఛారిటీని ప్రారంభిస్తే.. సుమ మాత్రం వినూత్నంగా ఆలోచించింది. బుల్లితెర శ్రామికులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా తన వద్ద పని చేస్తున్న వారి గురించి ఆలోచించి వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేసింది.

    నా వంతుగా ఆర్థిక సాయం..

    నా వంతుగా ఆర్థిక సాయం..


    వీడియో సారాంశం ప్రకారం.. ‘కోవిడ్-19 డొనేషన్స్ నేపథ్యంలో నేను ఓల్డేజ్ హోమ్ లతో పాటు డొనేట్ కార్డ్ అనే స్వచ్ఛంద సంస్థకు సాయం చేశాను. ఇక తెలుగు టెలివిజన్ ప్రొడ్యుసర్స్ కౌన్సిల్ లో నా వంతుగా డొనేట్ చేశా. నా దగ్గర డైరెక్టుగా - ఇన్ డైరెక్ట్గా పని చేస్తున్న ప్రొడక్షన్ బాయ్స్ - మేకప్ - లైటింగ్ ఇలా వివిధ క్రాఫ్ట్స్ లో పనిచేస్తున్న వాళ్ల లిస్ట్ తీసుకున్నా. వీళ్లందరికీ కొంత ఆర్థిక సాయం అందించాలని అనుకుంటున్నా'ని చెప్పుకొచ్చింది.

    ఓ లిస్ట్ తయారు చేసుకోండి..

    ఓ లిస్ట్ తయారు చేసుకోండి..

    ‘నేను లిస్ట్ తయారు చేస్తున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ఇలాగే ఎవరికి వాళ్లు.. ఓ లిస్ట్ తయారు చేసుకుని వాళ్ల దగ్గర డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా పనిచేస్తున్న వాళ్లకు సాయం చేస్తే చాలా వరకూ ఇండస్ట్రీలోని అందరికీ సాయం అందుతుంది. నేను ఇలా చేయాలని అనుకుంటున్నా.. మీరు కూడా చేయండి' అంటూ తన ఆలోచనను పంచుకుంది. ఎంతైనా సుమ రూటే వేరు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    English summary
    Anchor Suma Came Forward To Help Television Workers. She Wants To do Help the Workers Who Are Associated directly And Indirectly To Her Staff.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X