Don't Miss!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Sports
INDvsNZ : రెండో టీ20 పిచ్ రిపోర్ట్.. డేంజర్లో టీమిండియా రికార్డు!
- News
మా నాన్న జోలికి వస్తే సహించం - తమ్ముడంటే ప్రాణం: రాం చరణ్ వార్నింగ్..!!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
నాటి స్కాం వీడియో.. ఆ సైగలను ఉద్దేశిస్తూ మెహబూబ్‌పై సుమ కౌంటర్ అదుర్స్
బిగ్ బాస్ షో నాల్గో సీజన్ అంతా ఒకెత్తు అయితే ఫినాలె ఎపిసోడ్ జరిగిన రోజు, ఆ ముందు రోజు జరిగన ఘటనలన్నీ ఒకెత్తు. ఫినాలే వీక్‌లో మాజీ ఇంటి సభ్యులందరూ టాప్ 5 కంటెస్టెంట్లను కలిసేందుకు వెళ్లారు. కోవిడ్ కాబట్టి వారిని గాజు రూంలోంచే కలిసేలా ఏర్పాట్లు చేశారు. అలా వచ్చిన మెహబూబ్ అసలు గుట్టంతా విప్పేశాడు. సోహెల్‌కు అసలు సంగతులన్నీ చెప్పేసినట్టుగా ఓ వీడియో చక్కర్లు కొట్టింది.

ఏవేవో సైగలు..
మెహబూబ్ సోహెల్ మధ్య జరిగిన సైగల సంభాషణలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. సోహెల్ 25 లక్షలు తీసుకుని బయటకు వచ్చేశాడని లీకులు మొదలైన వెంటనే మెహబూబ్ సోహెల్ సైగల వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. మెహబూబ్ చెప్పిన హింట్ ఆధారంగానే సోహెల్ అలా చేశాడని ట్రోల్ చేశారు.

వివరణలు ఇచ్చినా..
అయితే ఆ సైగలు నంబర్ గురించే.. కానీ అది ఇన్ స్టా ఫాలోవర్ల గురించి అంటూ కవర్ చేసుకున్నారు. వాటిని ఎవ్వరూ కూడా నమ్మలేదు. ఈవిషయంలో సోహెల్ మెహబూబ్ అఖిల్ మాటలు పొంతన లేకుండా ఉండటంతో అందరికీ అనుమానాలు బలపడ్డాయి. కానీ సోహెల్ మాత్రం పలు మార్లు వివరణ ఇచ్చుకున్నాడు. తాము ఎలాంటి తప్పులు చేయలేదని, ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.

మళ్లీ ఇలా..
అయితే నాటి స్కాం వీడియో మళ్లీ ఇలా వార్తల్లోకి రావడానికి ఓ కారణం ఉంది. సుమ నిర్వహిస్తోన్న స్టార్ట్ మ్యూజిక్ షోలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు రచ్చ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోహెల్ అఖిల్ మెహబూబ్‌లను సుమ ఓ ఆట ఆడుకుంది.

సోహెల్‌ను అలా..
ఇక సోహెల్‌కు కోపం ఎలా వస్తుంది.. నరాలు ఎలా బయటకు వస్తాయో అందరికీ తెలిసిందే. సోహెల్ మ్యానరిజాన్ని సుమ సైతం భలేగా ఇమిటేట్ చేస్తుంటుంది. అలా ఈ షోలో వచ్చిన సోహెల్ బీపీని సుమ చెక్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేసింది. చివరకు బీపీ మిషన్ పేలిపోయేలా రీడిండ్ వచ్చిందని సుమ కౌంటర్ వేసింది.
Recommended Video

మెహబూబ్ బాబా సైగల్..
మెహబూబ్ గురించి సుమ చెబుతూ.. పాపం ఇతనేదో సైగలు చేశాడని అన్నారు.. అసలు చేశాడో లేదో గానీ మొత్తానికి బాబా సైగల్ అయపోయాడంటూ కౌంటర్ వేసింది. అంటే సుమకు నాడు జరిగిన ట్రోలింగ్ ఆ స్కాం వీడియో గురించి బాగానే తెలుసన్న మాట.