»   » పాలిటిక్స్‌పై సుమ జబర్దస్త్ పంచ్.. నేతలను అలా టార్గెట్ చేసిందేమిటీ..

పాలిటిక్స్‌పై సుమ జబర్దస్త్ పంచ్.. నేతలను అలా టార్గెట్ చేసిందేమిటీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ సుమ సూపర్‌స్టార్ అంటే అతిశయోక్తి కాదేమో. గేమ్ షో కానీ, ఎంటర్‌టైన్‌మెంట్ షో గానీ, ఆడియో రిలీజ్ కానీ, ఏ వేదిక ఎక్కిన దుమ్ము రేపడం సుమ ప్రత్యేకత. ఒక్కో చానెల్‌లో 1000కి పైగా ఎపిసోడ్స్‌ను ధారళంగా కొనసాగిస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు సుమ. ప్రతీ కార్యక్రమంలోను సుమ వేసే పంచులకు మంచి రెస్పాన్స్ వస్తుంది. స్పాంటేనియస్‌గా చమక్కులు విసరడం సుమకే చెల్లుతున్నది. ఎంతో మంది యువ యాంకర్లు తెరపైకి వచ్చిన సుమ జోరుకు ఏ మాత్రం ఢోకా లేకుండా జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. ఈ మధ్య నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుమ రాజకీయ నేతలపై కామెంట్ విసరడం చర్చనీయాంశమైంది.

పాలిటిక్స్‌పై పంచ్..

పాలిటిక్స్‌పై పంచ్..

కామన్ మ్యాన్ నుంచి సెల‌బ్రెటీలను వదలని సుమ ఈ మధ్య పాలిటిక్స్‌పై, రాజకీయ నేతలపై దిమ్మ తిరిగే పంచ్ వేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. రీసెంట్ గా సుమ టీవీ షోకి రఘు మాస్టర్ తన భార్య సింగర్ ప్రణవితో వచ్చారు. ఈ కార్యక్రమంలో పెళ్లికి ముందు, పెళ్లికి తర్వాత జరిగిన సంగతులను రఘు దంపతులను అడిగి తెలుసుకొన్నది.

ఎవరు వెయిట్ చేస్తారు చెప్పండి..

ఎవరు వెయిట్ చేస్తారు చెప్పండి..

సుమ అడిగిన ప్రశ్నకు గాయని ప్రణవి స్పందిస్తూ రఘు, నేను పెళ్లికి ముందు చాలా కాలం ప్రేమించుకొన్నాం. రఘు నా కోసం 4 సంవత్సరాలు వెయిట్ చేసాడు. ఈ రోజుల్లో ఎవరు నాలుగు ఏళ్లు ఎవరు వెయిట్ చేస్తారు చెప్పండి. రిలేషన్స్ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని సినీ పరిశ్రమలో నాలుగేళ్లు వేచి చూడటం చాలా అరుదు. అందుకే రఘు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది.

అన్ని ఏండ్లు వేచి చూడటం గొప్పే..

అన్ని ఏండ్లు వేచి చూడటం గొప్పే..

గాయని ప్రణవి వ్యాఖ్యలపై సము వెంటనే కౌంటర్ ఇస్తూ రాజకీయాల్లో అధికారం కోసం నేతలు ఎన్ని సంవత్సరాలయినా వెయిట్ చేస్తారు. కానీ ఇలా ఒక అమ్మాయి కోసం ఇన్ని ఏళ్లు వేచి చూడటం చాలా అరుదు అని పంచ్ పేల్చింది. దాంతో ఆ షోలో ఉన్న వారితో పాటు రఘు దంపతులు కూడా నవ్వుకొన్నారు.

పంచ్ వేయ్యాలంటే సుమతోనే..

పంచ్ వేయ్యాలంటే సుమతోనే..

సమయాన్ని బట్టి జోకులు పేల్చడం, సరైన టైమ్‌లోనే పంచులు ఇవ్వడం సుమకు వెన్నతో పెట్టిన విద్య. ఆమె మలయాళీ అయినప్పటీకి తెలుగు వాళ్లు ఎవరూ మాట్లాడని విధంగా భాషను అనర్గళంగా మాట్లాడటం ఆమెకే చెల్లింది. పలువురు తెలుగు యాంకర్లు తెలుగు వచ్చినా రానట్టు బిల్డప్ ఇస్తూ.. సంగం తెలుగు, సంగం ఇంగ్లీష్ మిక్స్ చేసి స్టయిల్ కొట్టే వారు సుమ నుంచి నేర్చుకోవాల్సి చాలా ఉందనిపిస్తుంటుంది.

సుమకు కరణ్ ప్రశంస

సుమకు కరణ్ ప్రశంస

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను సుమ నిర్వహించిన తీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లనే కాకుండా ఇతర భాషల వాళ్లను ఆకట్టుకొన్నది. ఈ కార్యక్రమంలో సుమ యాంకరింగ్‌పై ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ ప్రశంసల వర్షం కురిపించారు. సుమ మీ యాంకరింగ్ బ్రహ్మండంగా ఉంది అని కరణ్ వేదిక మీద కితాబు ఇవ్వడం తెలిసిందే.

పలు భాషలపై పట్టు..

పలు భాషలపై పట్టు..

పలు భాషలపై పట్టు ఉండటం సుమకు అదనపు ఆకర్షణ. వేదిక ఏదైనా గానీ, ఏ భాషైనా అనర్గళంగా మాట్లాడటం సుమ ప్రత్యేకత. కేవలం తెలుగులోనే కాకుండా ఏ భాషలోనైనా కార్యక్రమాన్ని నిర్వహించే సత్తా సుమకు ఉందనే సినీ ప్రముఖులు బాహాటంగానే వెల్లడిస్తుండటం ఆమె ప్రతిభకు తార్కాణంగా నిలిచిందని చెప్పవచ్చు.

English summary
Anchor Suma cracks punch on Politics and Politicians is now talk of Industry. Recently Suma invited Raghu Master, Singer Pranavi couple. In that show She said that Politician will wait for power many years. but lovers can not wait for marriage in this film Industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu