Suma Vs sreemukhi: రిటైర్మెంట్ పై సుమ క్లారిటీ.. నేనేమైనా తొక్కేస్తున్నానంటూ శ్రీముఖిపై ఫైర్..

యాంకర్ సుమ తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది యాంకర్ సుమ కనకాల. 16 ఏళ్ల వయసులోనే బుల్లితెరపై అడుగుపెట్టిన సుమ, సుమారు మూడు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ, స్టార్ యాంకర్‌గా స్థిరమైన గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా ETVలో ప్రసారమైన 'స్టార్ మహిళా' గేమ్ షో ద్వారా సుమకు విశేష ఆదరణ ఏర్పడింది. 12 ఏళ్ల విజయవంతమైన రన్‌తో ఈ షో ఇండియాలో అత్యంత కాలం ప్రసారం అయిన టీవీ గేమ్ షోగా రికార్డు సృష్టించింది. అయితే.. తాజాగా యాంకర్ సుమ తన రిటైర్మెంట్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే..?

సుమ కనకాల తన కెరీర్ ప్రారంభంలో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో 'కళ్యాణ ప్రాప్తిరస్తు' సినిమాలో హీరోయిన్‌గా నటించి, నందమూరి వక్కంతం వంశీతో నటన చూపించారు. ఆ తర్వాత మలయాళంలో కొన్ని చిత్రాల్లో నటించారు. కానీ సినిమాలు పెద్ద విజయం సాధించలేదు. తరువాత బాలకృష్ణ పవిత్ర ప్రేమ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. కానీ, అవి కూడా కలసి రాలేదు. దీంతో సుమ బుల్లితెరపై దృష్టి పెట్టారు.

Anchor Suma Fires Back at Srimukhi Over Retirement Question

బుల్లితెరపై ఫోకస్ పెడుతూ యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఈ క్రమంలో సుమ రియాలిటీ షోలు, ప్రీ-రిలీజ్ ఈవెంట్స్, ఆడియో లాంచ్ కార్యక్రమాల్లో యాంకరింగ్ చేసింది. తన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గతేడాది 'జయమ్మ పంచాయతీ' చిత్రంలో లీడ్ రోల్‌లో నటించినప్పటికీ సినిమా పెద్ద విజయాన్ని సాధించలేదు. ఈ నేపథ్యంలో సుమ "యాక్టింగ్ పెద్దగా సరిపడట్లేదు, యాంకరింగ్ మాత్రమే ఇష్టం" అని పేర్కొన్నారు.

తరువాత కొద్ది రోజులకు నిట్ ఇంజనీరింగ్ ఫెస్ట్‌లో సుమ విద్యార్ధులతో మాట్లాడుతూ, " సిల్వర్ స్క్రీన్ యాక్టింగ్ వద్దులే... అది నాకు పెద్దగా కలిసి రావడం లేదు. ఇక యాక్టింగ్ పై ఫోకస్ పెట్టను" అని స్పష్టంగా తెలిపారు. సుమ అభిప్రాయం ప్రకారం ఈ నిర్ణయం రిటైర్మెంట్ అంశం కాదు. కేవలం తన వ్యక్తిగత ప్రాధాన్యత. బుల్లితెరలో ఇప్పటికే స్టార్ యాంకర్‌గా స్థిరపడినందున, సినిమా అవకాశాలపై ఫోకస్ పెట్టకూడదని నిర్ణయించుకున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా యాంకర్ సుమ తన రిటైర్మెంట్ తెరపైకి వచ్చింది. ETVలో ప్రసారం అయిన దీపావళి స్పెషల్ 'రావడం మళ్లీ మళ్లీ రాని రోజు' కార్యక్రమంలో యాంకర్ సుమ తన కొడుకు, యంగ్ హీరో రోషన్ తో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించారు. సాధారణం కంటే భిన్నంగా ఉండాలని, శ్రీముఖి సుమను తన కొడుకు రోషన్‌తో ఇంటర్వ్యూ చేయాలని ఓ స్కిట్ ప్లాన్ చేశారు. అయితే.. రోషన్ కు యాంకర్ కొత్త కాబట్టి.. యాంకరింగ్ ఎలా చేయాలో చూపిస్తాను అంటూ శ్రీముఖి ఓ డెమో ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో శ్రీముఖి సుమను ప్రశ్నిస్తూ "ఎప్పుడు యాంకరింగ్ ఫీల్డ్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నారు?"అని అడిగింది.

ఈ ప్రశ్నకు సుమ ఒక్కసారిగా రియాక్ట్ అయ్యారు."నువ్వు కూడా ఇలా అడుగుతున్నావా శ్రీముఖి? అసలు ఇది అడగాల్సిన ప్రశ్న అయినా? వేరేవాళ్లు అడిగితే ఓకే, కానీ నువ్వు కూడా?" అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సుమ తరువాత "నా అవకాశాలు వస్తున్నాయి. నేను రిటైర్మెంట్ ఎలా ప్రకటిస్తాను?" అని తెలిపింది. ఈ మాటలతో శ్రీముఖి షాక్ అయ్యారు. తాను వేరే ఉద్దేశంతో అడగలేదని వివరణ ఇవ్వడానికి ప్రయత్నించింది.

కానీ, సుమ మాట్లాడనీయకుండా "నీ ఉద్దేశం ఏంటి?" అని ప్రశ్నించి, తన స్థితిని స్పష్టంగా చెప్పేశారు. కాస్త ఆగ్రహం తర్వాత, సుమ నవ్వుతూ "ఇలా ఆన్సర్ చేయకుండా నార్మల్‌గా సమాధానం చెప్పాలి" అని శ్రీముఖికి సూచించారు. ఈ క్రమంలో, ప్రేక్షకులు, టీం సభ్యులు ఒక్కసారిగా నవ్వేశారు. వాస్తవానికి, ఈ కాంట్రవర్స్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇది హైపర్-ఆది స్కిట్ లో భాగమని శ్రీముఖి తప్పుకునే ప్రయత్నం చేసింది.

ఈ స్కిట్ ద్వారా సుమ కనకాల రిటైర్మెంట్ వార్తలపై వచ్చిన రూమర్స్ కు చెక్ పెట్టడమే కాకుండా, ఆమె వ్యక్తిగత ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేసారు. దాదాపు 30 ఏళ్ళ తన యాంకరింగ్ ప్రస్థానంలో సుమ, సోషల్ మీడియా, బుల్లితెర, బ్లాక్‌బస్టర్ ఈవెంట్స్ ద్వారా తన క్రేజ్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. రిటైర్మెంట్ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని అందరికి క్లారిటీ ఇచ్చారు సుమ.

More from Filmibeat

Read more about: roshan anchor suma sreemukhi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X