»   » తెర వెనుక విషయాలన్నీ మైండ్‌లో ఉన్నాయి.. పుస్తకం రాస్తా.. సుమ

తెర వెనుక విషయాలన్నీ మైండ్‌లో ఉన్నాయి.. పుస్తకం రాస్తా.. సుమ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బుల్లితెర మీద సుమ సూపర్‌స్టార్. ఒకసారి మాట్లాడటం ప్రారంభిస్తే వసపిట్ట కూడా చిన్నపోతుంది. అలాంటి సుమ తాజాగా గాయని అవతారం ఎత్తింది. విన్నర్ చిత్రం కోసం సూయ, సూయ అంటూ పాడిన పాట సంగీత అభిమానులను విశేషం ఆకట్టుకొంటున్నది. ఆమె పాటకు అనుగుణంగా యాంకర్ అనసూయ ఐటెంగర్ల్‌గా మారి తెరపై చిందేయడంతో మరింత పాపులర్ అయింది. తాజాగా ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను సుమ పాఠకులతో పంచుకొన్నది.

ఆ విషయాలకు త్వరలో అక్షరరూపం

ఆ విషయాలకు త్వరలో అక్షరరూపం

‘సినీ, టెలివిజన్, ఇతర సాంస్క‌తిక కార్యక్రమాల సందర్భంగా జరిగే సంఘటనలకు అక్షర రూపం కల్పించాలని ఉన్నది. ఆ సంఘటనలన్నీ మనసులో ఉన్నాయి. వాటికి పుస్తక రూపం కల్పిస్తాను. ప్రస్తుతం బిజీగా ఉన్నాను. వీలు చిక్కితే దానిపై దృష్టిపెడుతాను' అని సమ తెలిపారు.

అది నా కల కాదు.. అవకాశం వచ్చింది..

అది నా కల కాదు.. అవకాశం వచ్చింది..

‘నటించాలన్నది నా కల కాదు. అవకాశం వచ్చిందని నటించాను. టెలివిజన్ పై యాంకరింగ్ మంచి పేరు తెచ్చింది. సెటిల్ అయిపోయాను. గాయనిగా మారాలన్న ఆలోచనే లేదని.. కానీ పాట పాడాల్సి వచ్చింది అని సుమ తెలిపారు. మళ్లీ ఎదైనా అవకాశం వస్తే మళ్లీ పాడాల్సి రావొచ్చు' యాంకర్ సుమ రాజీవ్ అన్నారు.

రాజీవ్ ఒకే .. కూతురు మెచ్చుకొన్నది

రాజీవ్ ఒకే .. కూతురు మెచ్చుకొన్నది

తాను పాడిన పాట విని తన భర్త రాజీవ్ కనకాల ఓకే అన్నారని సుమ వెల్లడించారు. తన కూతురు చాలా అనుమానంగా చూసి ఆ తర్వాత మెచ్చుకొన్నదని ఆమె తెలిపారు. ఒకప్పుడు ఎక్కడికి వెళ్లినా మాట్లాడమనేవాళ్లు.. ప్రస్తుతం పాట పాడమంటారు అని పేర్కొన్నారు.

అనసూయ అక్కా అని పిలుస్తుంది..

అనసూయ అక్కా అని పిలుస్తుంది..

ఓ యాంకర్ కోసం ఇంకో యాంకర్ పాట పాడడం టాలీవుడ్‌లోనే కొత్త ప్రయోగమని సుమ తెలిపారు. అనసూయ, శ్రీముఖి, రష్మీ అందరూ రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారని ఆమె అన్నారు. అనసూయతో తనకు మంచి రిలేషన్స్ ఉన్నాయని, తనను ఆమె అక్కా అని పిలుస్తుందని సుమ అన్నారు.

English summary
Anchor Suma becomes singer with winner movie. Suma said that she will write book with her experience in industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu