Don't Miss!
- Finance
Boeing: నిరుద్యోగులకు శుభవార్త.. వేలాది మందిని రిక్రూట్ చేసుకోనున్న జెట్ లైనర్
- News
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత..!!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
30 ఏళ్ల అబ్బాయికి 21 అమ్మాయికి పెళ్లి చేసిన యాంకర్ సుమ.. అలాంటి గిఫ్టుతో షాక్!
మొన్నటివరకు సినిమా యాక్టర్స్, టీవీ యాక్టర్స్ కు మాత్రమే ఫాలోయింగ్ ఉండేది. అయితే మారుతున్న కాలంతో కొత్తగా వస్తున్న వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను సరికొత్తగా ఆకట్టుకోవడంతో అందులో నటీనటులకు కూడా ఫాలోయింగ్ పెరుగుతోంది. ఇక అలాంటి వారు సుమ చేతికి చిక్కితే మామూలుగా ఉండదు. ఇటీవల స్టార్ట్ మ్యూజిక్ ప్రోగ్రాంలో బాగా ఫేమస్ అయిన 30 వెడ్స్ 21, సూర్య, రామ్ లీలా వంటి లీడ్ యాక్టర్స్ పాల్గొన్నారు.

వెబ్ సీరీస్ సెలబ్రెటీలకు భారీ ఫాలోయింగ్
వెబ్ కంటెంట్ ఏ మాత్రం క్లిక్కయినా కూడా అందులో నటీనటులకు వెనువెంటనే ఆఫర్స్ కూడా వస్తున్నాయి. 30 వెడ్స్ 21 సిరీస్ చైతన్య, అనన్య ఇప్పటికే భారీ స్థాయిలో ఫాలోయింగ్ ను అందుకున్నారు. ఇక సూర్య జోడి, రామ్ లీలా జోడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుసగా టీవీ ప్రోగ్రామ్స్ తో కూడా వారు క్రేజ్ అందుకుంటున్నారు.

సుమ స్టార్ట్ మ్యూజిక్
స్టార్ మా స్టార్ట్ మ్యూజిక్ షోలో ప్రతి వారం సరికొత్త సెలబ్రెటీలను పిలుస్తున్న సుమ వారితో చేయిస్తున్న అల్లరి అంతా ఇంతా కాదు. ఒక వైపు క్యాష్ ప్రోగ్రాంతోను ఆమె భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకుంటోంది. ఇక ఈ మధ్య వచ్చిన స్టార్ట్ మ్యూజిక్ కూడా మెల్లగా రేటింగ్స్ అందుకోవడంతో మిగతా ప్రోగ్రాంలకు పోటీగా నిలుస్తోంది.

వారి పెళ్లికి సుమ కండిషన్
ఇక ఈ ఆదివారం ప్రసారం కాబోయే స్టార్ట్ మ్యూజిక్ లో 30 వెడ్స్ 21 కపుల్స్ తో సుమ ఒక డిఫరెంట్ టాస్క్ ను చేయించింది. చాలా సరదాగా కొనసాగిన ఆ టాస్క్ లో సుమ నాన్ స్టాప్ పంచ్ లు వేసింది. చైతన్య, అనన్య ఇద్దరికి పెళ్లి చేశారు. అయితే పెళ్లి చేసుకునే ముందు సుమ చైతన్యకు పనస పండు చేత్తో చీల్చాలని కండిషన్ పుట్టింది.
|
మీ సిరీస్ లో జరగని పెళ్లి ఈ సిరీస్ లో జరిగిందని..
ఇక వెబ్ సిరీస్ కంటెంట్ ఆధారంగా సుమ వారిపై పంచ్ లు కూడా వేశారు. మొదటిసారి టచ్ చేయించి పెళ్లి చేసుకోవాల్సిందే అని ఇద్దరికి దండలు అందించారు. ఇక చైతన్య, అనన్య దండలు మార్చుకుంటారు. అంతే కాకుండా ఏడడుగులు వేస్తారు. అయితే మీ సిరీస్ లో జరగని పెళ్లి ఈ సిరీస్ లో జరిగిందని సుమ పంచ్ వేయగా.. అందుకు చైతన్య.. సిరీస్ లో చాలా జరగలేదు అంటూ మరో కౌంటర్ వేస్తాడు.
Recommended Video

కానుక ఇచ్చిన సుమ
అంతే కాకుండా ఈ కొత్త జంటకు ఒక మంచి గిఫ్ట్ అంటు పెద్ద పనస పండును చేతిలో పెట్టారు. ఇక ఆ పండు బరువును చైతన్య మోయలేక పోయాడు. అంతే కాకుండా అనన్య చైతన్య ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రయత్నం చేసింది. షో మొత్తం చాలా అల్లరిగానే సాగినట్లు అర్ధమవుతోంది. ఇక ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు ప్రసారం కాబోయే ఈ ప్రోగ్రాంలో ఇంకా ఎన్ని పంచ్ లు వినిపిస్తాయో చూడాలి.