For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్‌బాస్‌లోకి సుమ ఎంట్రీ ఖాయం.. స్వయంగా వెల్లడించిన యాంకర్.. ఎప్పుడు వస్తున్నారంటే..

  |

  అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్‌ 4 తొమ్మిదో వారాంతంలో హోస్ట్ నాగార్జునతో కలిసి యాంకర్ సుమ హంగామా చేశారు. ఇంటిలోకి వెళ్లానంటూ వేదికపైన హంగామా చేసింది. నాగార్జునతో కలిసి ఇంటి సభ్యులు ప్రవర్తన తీరును, మాట్లాడే తీరును అనుకరించి అందరికీ ఝలక్ ఇచ్చారు. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ ఇంటి సభ్యులను, ప్రేక్షకులను ఊరించి లోనికి వెళ్లే ప్రయత్నం చేసింది. అయితే ఇంట్లోకి వెళ్లకుండా సుమ తిరిగి వచ్చి చెప్పిన కారణం ఏమిటంటే..

  సూట్‌కేసులో ఇంటి సభ్యుల జాతకం

  సూట్‌కేసులో ఇంటి సభ్యుల జాతకం

  ఇంటి సభ్యుల గురించి మాట్లాడుతూ.. అవినాష్ గురించి చెబుతూ సూట్ కేసులో నుంచి బిస్కెట్లు తీసింది. అందరికి బిస్కెట్లు వేయడంలో దిట్ట అంటూ కామెంట్ చేసింది. ఇంత పొట్టేసుకొని వచ్చావు అని సుమ అంటే బంగారంలా పెంచుకొన్న పొట్టను లాగేసుకొన్నారని అవినాష్ కామెంట్ చేశారు. అయితే గట్టిగా లోపటికి లాగకు.. వెనక నుంచి బయటకు వస్తుంది అంటూ సుమ పంచ్ విసిరింది.

  అవినాష్‌తో బిస్కెట్ల కథ..

  అవినాష్‌తో బిస్కెట్ల కథ..

  ఇక ఇంట్లో అందరికి బిస్కెట్లు వేస్తున్నాడంటూ నాగార్జునకు సుమ ఫిర్యాదు చేస్తే.. ఎవరికి అంటూ నాగార్జున అంటే ఓ అందమైన అమ్మాయికి బిస్కెట్లు వేస్తున్నాడు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న అమ్మాయిలు సరిపోలేదంటూ బయట నుంచి పెళ్లికాని అమ్మాయిని వైల్డ్ కార్డును పంపిస్తారేమో అని ఎదురుచూస్తున్నాడని అవినాష్‌ను ఆటాడుకొన్నారు.

  అవినాష్‌పై పంచులు

  అవినాష్‌పై పంచులు

  అవినాష్ ముక్కుపై సుమ జబర్దస్త్ పంచ్ వేసింది. నీవు లోపల ఉండటం వల్ల అందరూ చాలా స్వేచ్ఛగా వాయువును పీలుస్తున్నారు. లేకపోతే నీ పెద్ద ముక్కుతోని ఉన్న గాలి అంతా నీవే పీల్చేసే వాడిని సైగ చేసి సుమ ఏడిపించింది. దాంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

  ఒక జోల పాటకు.. రెండుసార్లు అలా

  ఒక జోల పాటకు.. రెండుసార్లు అలా

  ఇక మోనాల్ విషయంలో అఖిల్‌ను సుమ ఆటపట్టించింది. అంతేకాకుండా ఆయనతో పాట పాడించింది. అఖిల్ పాట పడిన తర్వాత సుమను ఉద్దేశించి నాగార్జున మాట్లాడుతూ.. నీకు ఇలా జోలపాట పాడారా అని అడిగితే.. అవును పాడారు.. ఆ తర్వాతే రెండు జోల పాటలు పాడాల్సి వచ్చింది. పెళ్లికి ముందు జోల పాట విన్న తర్వాత పెళ్లి తర్వాత జోలపాటలు పాడాల్సి వచ్చింది అంటూ సుమ ఫన్నీగా కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ఇంటిలోనికి వెళ్ల మంటూ ఆమెను పంపించారు.

  బిగ్‌బాస్‌లోకి అందుకే వెళ్లడం లేదు అంటూ

  బిగ్‌బాస్‌లోకి అందుకే వెళ్లడం లేదు అంటూ

  అయితే ఇంటిలోని వెళ్లకుండా తిరిగి రావడంతో నాగ్ ఆశ్చర్యపోయారు. అదేంటీ ఇంట్లోకి వెళ్లకుండా బయటకు ఎందుకు వచ్చారు అంటే.. చిన్న ప్రాబ్లెం వచ్చింది. ఇంట్లోకి వెళ్లేటప్పుడు వైల్డ్ డాగ్స్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, RRR లాంటి సినిమాల ప్రెస్ మీట్స్, ఈవెంట్స్ నిర్వహించాలనే మెసేజ్ వచ్చింది. అందుకే ఎప్పుడు వెళ్లకుండా తిరిగి వచ్చాను అంటూ సుమ బాంబు పేల్చింది.

  బిగ్‌బాస్‌లోకి వస్తాను.. కానీ అప్పుడే...

  బిగ్‌బాస్‌లోకి వస్తాను.. కానీ అప్పుడే...

  ఇక బిగ్‌బాస్‌లోకి ఎప్పుడు వెళ్తావు అని నాగార్జున అడిగితే.. తప్పకుండా వెళ్తాను. కాకపోతే గంగవ్వ అంత వయసు వచ్చిన తర్వాత వెళ్తాను. అప్పటి వరకు ఆగాల్సిందే అంటూ సుమ తనదైన శైలిలో చెప్పింది. అయితే వచ్చే సంవత్సరమే బిగ్‌బాస్ ఇంటిలోకి వస్తున్నావన్న మాట అంటూ నాగార్జున షాక్ ఇచ్చారు. ఇంటి సభ్యులు వస్తావని చెప్పి మోసం చేశావంటే.. మేనేజర్ కాల్ చేయడంతో మనసు మార్చుకొంటున్నాను అంటూ సమ అక్కడి నుంచి జారుకొన్నారు.

  English summary
  Versatile Actor Kamal Haasan appeared in Bigg Boss Telugu 4. Telugu Bigg Boss Host Nagarjuna met Tamil Bigg Boss Host Kamal Haasan via video conferenance. Both are with them self and contestants too. Amma Rajashekhar eliminated from the house. Anchor Suma wish to entry in bigg Boss Telugu 4 goes viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X