‘ఇండస్ట్రీలో నాపై అలాంటి ప్రచారం.. పూటగడుస్తుందంటే వారే కారణం’

ఉదయభాను.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగునాట అసలు యాంకర్ అనే పదానికి స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన వ్యక్తి. అందం, వాక్చాతుర్యంతో యాంకర్ అంటే ఇలా ఉండాలని చూపించిన వ్యక్తి. అప్పట్లో హీరోయిన్లను మించిన క్రేజ్‌తో దూసుకెళ్లారు ఉదయభాను. మధ్యలో ఇండస్ట్రీకి దూరమైనా ఇప్పటికీ ఉదయభాను హవా ఏమాత్రం తగ్గలేదు. పొలిటికల్, సినిమా ఏ ఈవెంట్ అయినా సరే సక్సెస్‌ఫుల్ నడిపించడంలో ఉదయభాను ఎక్స్‌పర్ట్. తాజాగా యాంకరింగ్‌‌లో ఉండగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

90లలో స్టార్ యాంకర్‌గా క్రేజ్
తొలుత సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన ఉదయభాను.. ఆ తర్వాత 90వ దశకంలో టీవీలు ప్రజలకు చేరువ అవుతున్న సమయంలో యాంకరింగ్‌లో అడుగుపెట్టారు. తెలుగులోని టాప్ ఛానెల్స్‌లో యాంకర్‌గా పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వన్స్ మోర్ ప్లీజ్ తదితర సినిమాలు ఉదయభానుకు బాగా పేరు తీసుకొచ్చాయి. యాంకరింగ్ చేస్తూనే పలు సినిమాలలోనూ నటించి బిజీ అయ్యారు. కానీ ఊహించని విధంగా ఆమె వెండితెరకు, బుల్లితెరకు దూరమయ్యారు. గతేడాది నుంచి చిన్నా చితకా ఈవెంట్స్‌లో మెరుస్తున్నారు ఉదయభాను.

Anchor Udaya Bhanu shared her experience during beginning days

త్రిబాణధారి బార్బరిక్‌లో కీలకపాత్ర
తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించిన త్రిబాణధారి బార్బరిక్ అనే సినిమాలో ఉదయభాను కీలకపాత్ర పోషిస్తున్నారు. డైరెక్టర్ మారుతి సమర్పణలో వాన సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఉదయభాను చేసిన ఇస్కితడి ఉస్కితడి అనే ఐటెం సాంగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, క్రాంతి కిరణ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుండగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఉదయభాను చేస్తున్న వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశం అవుతున్నాయి.

యాంకరింగ్‌లో సిండికేట్
ఇండస్ట్రీలో సిండికేట్ తయారైందని మరో ఈవెంట్ చేస్తానో లేదోనని ఉదయభాను సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎక్కడికి వెళ్లినా ఆమెకు ఇదే ప్రశ్న ఎదురవుతుంది. కొద్దిరోజుల క్రితం జరిగిన త్రిబాణధారి బార్బరిక్ మూవీ టీమ్ నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌లోనూ ఉదయభానును విలేకరులు ఇదే ప్రశ్న వేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. తానెప్పుడూ నిజాలే మాట్లాడతానని, దీని గురించి ఏ యాంకర్‌ను అడిగినా చెబుతారని ఉదయభాను తెలిపారు. అయితే ఈ ఇష్యూ గురించి మాట్లాడటానికి ఇది వేదిక, సందర్భం కాదని ఆమె పేర్కొన్నారు.

Take a Poll

ఆ చెక్కులతో తోరణాలే
తాజాగా త్రిబాణధారి బార్బరిక్ మూవీ టీమ్ నిర్వహించిన చిట్‌చాట్‌లో తాను యాంకరింగ్‌ చేస్తున్న సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'యాంకర్లలో నన్ను హయ్యెస్ట్ పెయిడ్ అని అంటున్నారు. మా ఇంటికి వస్తే బౌన్స్ అయిన చెక్కులు, నాకు పే చేయని చెక్కులున్నాయి. వాటితో తోరణాలు కట్టొచ్చు. ఒక 10 ఎపిసోడ్ల వరకు డబ్బులు ఇవ్వకపోయినా చేస్తానని, నన్ను ఈజీగా కన్విన్స్ చేసుకోవచ్చు. పిల్లల మీద ఒట్టు నెక్ట్స్ మంత్ ఇస్తానంటే చేసేస్తా. దాని తర్వాత డబ్బులు అడిగితే పరమ దుర్మార్గులు, నన్ను టెన్షన్ పెట్టేశారని ముద్రవేశారు. నేను బతికింది టెలివిజన్ వల్ల కాదు.. బయట ఆడియన్స్‌కి నేనంటే చాలా ప్రేమ. నేను సంపాదించినదంతా బయటి ఈవెంట్స్ వల్లే.. ఇల్లు కట్టుకున్నా, నా కుటుంబం బతుకున్నది దాని వల్లే' అని ఉదయభాను పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X