Just In
- 7 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 8 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 9 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 10 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బడా డైరెక్టర్ సినిమాలో ఆరియానా.. బికినీ ట్రీట్ కూడా: సీక్రెట్ బయట పెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్
యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టి.. ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ అలియాస్ అర్చన. ఒకే ఒక్క ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ అమ్మడు.. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అదరగొట్టేసింది. షో వల్ల మరింత క్రేజ్‌ను అందుకున్న ఈ అమ్మడు.. సినిమా ఆఫర్లను కూడా అందుకుంటోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనకు ఓ బడా డైరెక్టర్ సినిమాలో వచ్చిన ఆఫర్ గురించి, బికీనీ ట్రీట్ గురించి సీక్రెట్ బయట పెట్టింది ఆరియానా. ఆ వివరాలు మీకోసం!

అంచనాలు లేకుండానే.. గొడవకు దిగి
అసలేమాత్రం అంచనాలు లేకుండా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి అడుగు పెట్టింది ఆరియానా గ్లోరీ. మొదట సయ్యద్ సోహెల్ రియాన్‌తో కలిసి సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లిన ఆమె.. కంటెస్టెంట్లను ఓ ఆట ఆడుకుంది. ఆ తర్వాత లోపలికి వచ్చి గడగడలాడించింది. దీంతో ఆమె అప్పుడే ప్రేక్షకుల దృష్టిలో పడింది. అయినప్పటికీ ఈమె ఎన్నో రోజులు హౌస్‌లో ఉండదని అంతా అనుకున్నారు.

ఫైటర్‌గా పేరు.. ఫినాలేలో అడుగెట్టింది
తనను తాను బోల్డ్ బ్యూటీగా పరిచయం చేసుకుంటూ బిగ్ బాస్ షోలోకి ప్రవేశించిన ఆరియానా.. అందుకు తగ్గట్లుగానే వ్యవహరిస్తూ హాట్ టాపిక్ అయింది. హౌస్‌లో నిజాయితీగా ఉంటూ.. ముక్కుసూటిగా మాట్లాడుతూ తరచూ అందరితో గొడవలకు దిగుతుండేది. అదే సమయంలో అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంది. టాస్కుల కోసం ఎంతకైనా తెగిస్తూ సత్తా చాటి ఫినాలేకు చేరింది.

అతడితో ట్రాకుతో మరింత హాట్ టాపిక్
బిగ్ బాస్ హౌస్‌లో ఆరియానా గ్లోరీ చాలా తక్కువ మందితో మాత్రమే సన్నిహితంగా ఉండేది. అందులో జబర్ధస్త్ కమెడియన్ ముక్కు అవినాష్‌తో మరింత చనువుగా వ్యవహరించేది. ఈ కారణంగానే వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే హౌస్‌లో వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉండేవారు. కానీ, బయట మాత్రం ఫ్రెండ్ అని అంటున్నారు.

అలా మొదలు పెట్టింది.. ఆఫర్లే ఆఫర్లు
ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ నాలుగో సీజన్ ఫినాలేలోకి అడుగు పెట్టింది ఆరియానా. కానీ, నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది. ఇక, షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మడు ఫుల్ బిజీ అయిపోయింది. వరుస ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా చాట్లతో తీరిక లేకుండా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆఫర్లు కూడా అందుకుంటోంది. ఇక, ఇటీవలే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది.

బడా డైరెక్టర్ సినిమాలో ఆరియానా గ్లోరీ
బిగ్ బాస్ షో వల్ల ఎంతగానో ఫేమస్ అయిన ఆరియానాకు సినిమా ఆఫర్లు వస్తున్నాయని, అందులోనూ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అవకాశం కూడా ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై స్పందిస్తూ.. ‘షో తర్వాత సార్‌కు కాల్ చేశా. హైదరాబాద్ వచ్చాక కలుద్దాం అన్నారు. అంతేకానీ, సినిమా ఆఫర్ ఏమీ మాట్లాడలేదు' అంటూ ఆమె క్లారిటీ ఇచ్చేసింది.

బికినీ ట్రీట్ సీక్రెట్ లీక్ చేసిన బోల్డ్ పాప
ఓ సినిమాలో బికినీ ట్రీట్ కూడా ఇవ్వబోతుందన్న వార్తలపై ఆరియానా ఫైర్ అయింది. ‘అసలు సినిమా ఛాన్స్ రాలేదంటే.. బికినీ అంటారేంటి. ఆరోజు సార్ (వర్మ) అన్నది కూడా వేరు. ఈ క్షణం నిన్ను బికినీలో చూడాలని ఉంది అని ఆయన అంటే.. రియల్ లైఫ్ గురించి అన్నట్లుగా దాన్ని వేరేలా వైరల్ చేశారు. ముందు అర్థం చేసుకోండి' అంటూ సీక్రెట్ రివీల్ చేసిందీ బోల్డ్ బ్యూటీ.