Ariyana Glory: నా జీవితంతో చేసిన పెద్ద తప్పు అదే.. ఆ ఒక్కరోజు వాడ్ని కలవకపోతే.. లైఫ్ మరోలా..

Ariyana Glory: తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని బిగ్ బాస్ బ్యూటీ, హాట్ యాంకరమ్మ అరియానా గ్లోరీ. ఈ అమ్మడు ఏం చేసిన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంది. తరుచు తన అదిరిపోయే గ్లామర్ షోలతో, అద్భుతమైన అందాల ప్రదర్శనతో ఎప్పుడూ చర్చల్లో ఉంటుంది. ఈ క్యూట్ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో ఓ తప్పు చేశాననీ, ఆ ఒక్కరోజు వాడ్ని కలువకపోతే.. నా జీవితం మరోలా ఉండేదంటూ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఈ అమ్మడు చేసిన తప్పేంటీ? అసలేం జరిగింది?

రాంగోపాల్ వర్మకు ఇంటర్వ్యూ ఇచ్చి ఒకేసారి హాట్ అండ్ బోల్డ్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అరియానా, ఆ క్రేజ్‌తోనే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా ఎంపికైంది. షోలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం, ముక్కుసూటిగా వ్యవహరించడం, బోల్డ్ నెస్ వల్ల తొలుత ట్రోల్స్ గురి అయినా తరువాత ఎనాలేని అభిమానాన్ని సంపాదించింది. అలాగే..బిగ్ బాస్ షో తరువాత కూడా అరియానా పలు షోలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.

Ariyana Glory Gets Emotional About Past Mistakes and RGV Interview

గతంలో అరియానా యాంకర్ గా 'దావత్'అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో అరియానా కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను ప్రమోట్ చేస్తూనే.. అందులోని హీరో, హీరోయిన్స్ , డైరెక్టర్స్ ను ఇంటర్వ్యూ చేసేది. అలాగే టైర్ 2 హీరో హీరోయిన్స్ ను తన షో కు పిలిచి.. తన ఘాటైన ప్రశ్నలతో తిక్కమగపేడుతుంది. ఈ దవాత్ షోలో ఆరియానా డ్రెస్సింగ్ గాని, డబుల్ మినింగ్ మాటలు గాని షోకు హైలెట్ గా నిలుస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, తన పర్సనల్ & ప్రొఫెషనల్ అప్‌డేట్స్ తో పాటు గ్లామరస్ ఫొటోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తోంది.ఈ నాజూకు సుందరి కుర్రకారిని ఫిదా చేస్తూ, సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ ను బాగా పెంచుకుంది.

హాట్ అండ్ బోల్డ్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అరియానా గ్లోరీ ఇటీవల జబర్దస్త్ యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న 'కిసిక్ టాక్స్'షోలో పాల్గొంది. ఈ సందర్భంలో వర్ష ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది. అరియానా కూడా తన జీవితంలో కొన్ని సీక్రెట్స్ ను బహిర్గతం చేస్తూ కాస్త ఎమోషనల్ అయ్యింది. జీవితంలో ఏదైనా చేయరాని తప్పు చేసావా? అని వర్ష ప్రశ్నించగా, అరియానా మాట్లాడుతూ.. 'నా జీవితంలో కొన్ని తప్పులు చేశాను. ఒకరోజు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌ను కలిశాను. ఆ ఒక్క రోజు వాడిని కలవకపోతే నా లైఫ్ మరోలా ఉండేదని చాలాసార్లు ఫీల్ అవుతాను. మరొకటి, ఒక ఇంటర్వ్యూ (ఆర్జీవీ) నా జీవితాన్నే మార్చేసింది. ఆ ఇంటర్వ్యూ ఫస్ట్ పార్ట్ చేసిన తర్వాత సైలెంట్ గా ఉంటే సరిపోయేది. కానీ, కాస్త ఇచ్చింగ్ ఎక్కువై సెకండ్ పార్ట్ కూడా చేశాను. ఇవే నా జీవితంలో పెద్ద తప్పులు" అని చెప్పుకొచ్చింది.

దీనిపై వర్ష "ఏ ఇంటర్వ్యూ?" అని ప్రశ్నించగా, అరియానా "నేను చేసింది ఒకే ఒక ఇంటర్వ్యూ. వాస్తవానికి ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఏం జరుగుతుందో.. నేను ఆలోచించలేదు. దాని పరిణామాలు నాకు వచ్చినా పర్వాలేదు, నేను భరించడానికి సిద్ధమే. కానీ నా పేరెంట్స్ మాత్రం కాస్త ఇబ్బంది పడ్డారు. 'మీ అమ్మాయి ఇలా చేసింది, ఇంత చదువుకుంది' అంటూ మా తల్లిదండ్రులను కొంతమంది వ్యంగ్యంగా అడగడం వారిని బాధపెట్టింది. ఆ ఇంటర్వ్యూ ఫ్యామిలీలో కాస్త డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది" అని తెలిపింది.

అలాగే ఆ ఇంటర్వ్యూ కాస్త ఫన్నీగా చేస్తే బాగుండేదని, ఆ పరిణామాలు బయటపడడానికి తనకు కొంత టైమ్ పట్టిందని చెప్పింది. "కొన్ని సార్లు నాకు నేనే 'ఎందుకోసమేనా ఇండస్ట్రీకి వచ్చా?' అని ఫీల్ అయ్యా" అంటూ అరియానా ఎమోషనల్ అయింది. దీంతో వర్ష "ఆ డైరెక్టర్ టచ్ లో ఉన్నావా?" అని అడగగా, అరియానా "అతని నెంబర్ ను నేను డిలీట్ చేశాను" అని స్పష్టంగా తెలిపింది. "నా జీవితంలో పెద్ద తప్పు చేశాను, ఆ అనుభవం నాకు చాలా నేర్పింది" అంటూ ఈ హాట్ బ్యూటీ కిసిక్ టాక్స్ లో చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Read more about: ariana glory bigg boss telugu rgv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X