Don't Miss!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
వెంటిలేటర్ మీద ఆరియానా గ్లోరీ: ఆక్సీజన్ లెవెల్స్ పడిపోవడంతో.. అసలు ఆమెకు ఏమైందంటే!
ఆరియానా గ్లోరీ.. చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న పేరిది. అంతలా ఈ బ్యూటీ కొన్నేళ్లుగా హల్‌చల్ చేస్తోంది. యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఈమె.. ఆ తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలతో ఫేమస్ అయిపోయింది. అలాగే, బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా సంచలనంగా మారింది. దీని తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆరియానా గ్లోరీ ఆక్సీజన్ మాస్కుతో కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమెను ఏమైంది? వివరాల్లోకి వెళితే...

ఆ ఒక్క ఇంటర్వ్యూతో పాపులారిటీ
కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఆ తర్వాత యూట్యూబ్ యాంకర్‌గా మారింది ఆరియానా గ్లోరీ. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేసింది. ఈ క్రమంలోనే ఓ సారి రాంగోపాల్ వర్మతో చిట్ చాట్ చేసింది. ఇది ఎంతో బోల్డుగా సాగింది. దీంతో వర్మ ఎంతో ఇంప్రెస్ అయి ఆమె గురించి ట్వీట్లు కూడా పెట్టడంతో ఆరియానా పేరు సంచలనం అయిపోయింది.

బిగ్ బాస్‌లో ఎంట్రీ.. అదుర్స్ అనేలా
ఆ ఇంటర్వ్యూ తర్వాత ఆరియానా గ్లోరీ పేరు రెండు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోయింది. ఈ కారణంగానే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్‌ను పట్టేసింది. ఆరంభంలోనే సీక్రెట్ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుంది. నిజాయితీగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుని ఫినాలేలోకి సైతం అడుగు పెట్టి సత్తాను నిరూపించుకుందామె.

షోలో ఇలా... తర్వాత ఫుల్ బిజీగా
బిగ్ బాస్ షోలో అసాధారణమైన ఆటతీరుతో ఆరియానా గ్లోరీ ఏకంగా నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే, క్రేజ్‌ను కూడా భారీ స్థాయిలో సొంతం చేసుకుంది. వీటితో పాటు సినిమా ఆఫర్లను కూడా దక్కించుకుంటోంది. ఇప్పటికే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. మరికొన్నింటిని ఓకే చేసింది. అలాగే పలు షోలు కూడా చేస్తుంది. స్పెషల్ ఈవెంట్లలోనూ భాగమైంది.

బోల్డు అనే పదానికి నిర్వచనం చెప్పి
ఇటీవల రాంగోపాల్ వర్మతో ఆరియానా గ్లోరీ చేసిన ఇంటర్వ్యూ విడుదలైంది. ఇందులో ఎక్కువగా సెక్స్ గురించిన సంభాషణలే జరిగాయి. ఇద్దరూ పోటాపోటీగా పచ్చిగా మాట్లాడుతూ దీన్ని రక్తి కట్టించారు. బోల్డు అన్న పదానికి సరైన అర్థం చెప్పారు. దీంతో ఈ వీడియోకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ ఇంటర్వ్యూకు ఊహించని విధంగా మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

వెంటిలేటర్ మీద ఆరియానా గ్లోరీ
సోషల్ మీడియాలో ఆరియానా గ్లోరీ ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇందులో తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను షేర్ చేస్తోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ఏకంగా ఆరియానా గ్లోరీ ఆక్సీజన్ మాస్కుతో కనిపించింది.
Recommended Video


అసలు ఆరియానాకు ఏం జరిగింది?
ఆరియానా గ్లోరీ ప్రస్తుతం మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా చేస్తోన్న ఓ సినిమాలో కీలకమైన పాత్రను చేస్తోంది. ఇందులో భాగంగానే ఆమె ఆక్సీజన్ మాస్కుతో వెంటిలేటర్ మీద ఉన్నట్లు నటిస్తోంది. ఆ షూటింగ్ స్పాట్‌లో తీసిన వీడియోనే ఆరియానా షేర్ చేసింది. ఇందులో ఆమె ఆక్సీజన్ మాస్క్ వేసుకుని కనిపించడంతో ఇది ఊహించని విధంగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.