For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అషు రెడ్డి ప్లాన్ ఫెయిల్.. లైవ్ లో కొట్టేసిన తల్లి.. అసలు ఏమైదంటే?

  |

  ఈ మధ్య సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి ఫేమస్ గా మారింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉండే ఈ భామ తన తల్లికి షాక్ ఇవ్వాలని చూడగా ఆమె ఏకంగా లైవ్ లోనే బ్యాగ్ తో కొట్టేసింది. ఆ వివరాల్లోకి వెళితే

  హాట్ ఫొటోలతో కాక రేపుతున్న నాగ్ హీరోయిన్.. అందాల ఆరబోతలో తగ్గేదేలే!

   అమెరికన్

  అమెరికన్

  అషూ రెడ్డి టెక్సాస్‌లోని డల్లాస్‌లో సెటిల్ అయిన దంపతులకు జన్మించింది. దీంతో ఆమె అమెరికన్ నేషనాలిటీ కలిగి ఉంది. అలా యునైటెడ్ స్టేట్స్ లోని టెక్సాస్ లో ఒక ప్రైవేట్ పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తరువాత, ఆమె డల్లాస్ నగరంలోని విశ్వవిద్యాలయంలో చేరి, అక్కడ గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తి చేసింది.

  సినిమాల మీద ఆసక్తి

  సినిమాల మీద ఆసక్తి


  చిన్నప్పటి నుండి, ఆమె నటన మరియు సినిమాలు అంటే విపరీతమైన ఆసక్తి కలిగి ఉండేది. అందుకే ఆమె సినిమా రంగం మీద వైపు మొగ్గు చూపింది. అలా ఆమె సినిమాల్లో రాణించాలి అనే ఉద్దేశంతో ఇండియా చేరింది. అయితే ఆమె బాగా ఫేమస్ అయింది మాత్రం జూనియర్ సమంత అనే. డబ్స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో తెగ సందడి చేసిన ఈ భామ ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీ అయిపోయింది.

  జూనియర్ సమంత క్రేజ్ తో

  జూనియర్ సమంత క్రేజ్ తో

  జూనియర్ సమంత అనే క్రేజ్ తో నితిన్ హీరోగా నటించిన చల్ మోహన్ రంగ అనే సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో కనిపించి మెప్పించింది. ఆ పాత్ర ఈమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాక పోయినా తరువాత ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరయింది. అలా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఈ భామ కంటెస్టెంట్ గా కూడా రచ్చ చేసింది. అలా బిగ్ బాస్ తో మరింత క్రేజ్ తెచ్చుకుంది.

  బుల్లితెర మీద బిజీ

  బుల్లితెర మీద బిజీ

  మరీ ముఖ్యంగా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత సదరు సీజన్ కి విన్నర్గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ తో తనకు ఏదో ఉన్నట్లుగా ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో చేసే పోస్టులు సంచలనంగా మారాయి. ప్రస్తుతం బుల్లితెర లో కొన్ని ప్రోగ్రామ్స్ లో ఈ భామ పాల్గొంటోంది. మరీ ముఖ్యంగా స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ అనే ఒక ప్రోగ్రాంలో ఈమె ఎక్స్ ప్రెస్ హరి తో కలిసి స్కిట్స్ చేస్తోంది. అంతే కాకా హ్యాపీ డేస్ అనే ఒక షోను కూడా హోస్ట్ చేస్తోంది.

  Ananya Nagallla Is The New Super Star Says Play Back Director | Filmibeat Telugu
  లైవ్ లోనే

  లైవ్ లోనే

  అయితే తాజాగా ఈ భామ తన తల్లికి షాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తే ఏకంగా తల్లి ఆమెను కొట్టింది, అది కూడా లైవ్ వీడియోలోనే కొట్టడం ఆసక్తికరంగా మారింది. విషయం ఏమిటంటే అషు రెడ్డి తన తల్లికి ఒక హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి లక్షన్నర రూపాయలు పెట్టి హ్యాండ్ బ్యాగ్ కొన్నాను అని చెబుతుంది, అది నిజమేనా అని ఆమె తల్లి రెట్టించి అడుగుతుంది. నిజమే అని చెప్పడంతో ఆ బ్యాగ్ తోనే అషుని కొడుతుంది..అన్ని బ్యాగులు ఉంటే మళ్లీ లక్షన్నర పోసి ఈ బ్యాగ్ కొనడమేమిటని ఆమె ప్రశ్నించారు. సరదాగానే ఉన్నా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  English summary
  Happy Days host Ashu Reddy of Bigg Boss Telugu season 3 fame took her fans on Instagram with a hilarious video. she stated "My mom's reaction after I told her I bought this bag for 2 lakhs 😂 I can't stop laughing oh my god!!! By the way, this bag is a gift ❤️ #sorrymom #ashureddy #mymomshockedme," reads her post.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X