»   » బాబు గోగినేని పిచ్చిపట్టినట్టు.. గీతాపై అరుపులు.. కౌశల్‌, ఆమెను బయటకు పంపిస్తా!

బాబు గోగినేని పిచ్చిపట్టినట్టు.. గీతాపై అరుపులు.. కౌశల్‌, ఆమెను బయటకు పంపిస్తా!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Bigg Boss Season 2 Telugu : Episode 47 Highlights | Captaincy Task

  బిగ్‌బాస్‌లో 46వ రోజు ఉద్రేకపూరిత వాతావరణం నెలకొంది. కెప్టెన్ టాస్క్ ఇంటి సభ్యుల్లో ఆవేశం నింపింది. గీతా మాధురీ మరోసారి కెప్టెన్‌గా ఎంపిక కావడంపై బాబు గోగినేని రగిలిపోయాడు. తన నోటి దురుసును మరోసారి బయటపెట్టుకొన్నాడు. దాంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జోరుగా నడిచింది. గీతామాధురికి మద్దతుగా మధ్యలో వచ్చిన కౌశల్‌పై తనీష్, సామ్రాట్ అడ్డుకొన్నారు. ఇలా ఘటనలతో గురువారం ఎపిసోడ్ గరం గరంగా నడిచింది.

  బిగ్‌బాస్ ఆంక్షల తిరస్కరణ

  బిగ్‌బాస్ ఆంక్షల తిరస్కరణ

  బిగ్‌బాస్‌ కార్యక్రమం కొంత సందడిగానే మొదలైంది. నిన్నటి కొనసాగింపుగా బిగ్‌బాస్ విధించిన మూడు ఆంక్షలను ముగ్గురు సభ్యులు దీప్తి సునైన, నందిని, గణేష్ తిరస్కరించారు. కెప్టెన్ పదవికి పోటీ పడకుండా ఉండటం, సీజన్ మొత్తానికి సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం, వచ్చే వారం కూడా సెల్ఫ్ నామినేషన్ చేసుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే.

  పూజాకు పాన్ షాప్ టాస్క్

  పూజాకు పాన్ షాప్ టాస్క్

  కొత్తగా ఇంటిలోకి చేరిన పూజా రాంచంద్రన్‌కు కిళ్లీ దుకాణం టాస్క్ ఇచ్చారు. ఇంటిలోని పురుషులు పూజాను మచ్చిక చేసుకోవాలి. ఆడవాళ్లు ఆకట్టుకోవాలని టాస్క్‌లో రూల్ విధించారు. అమిత్, సామ్రాట్, గీతా మాధురి, కౌశల్, గణేష్ తదితరులు విచిత్ర వేషాధారణలతో కనిపించారు. రకరకాల ప్రయత్నాలు చేసి పూజను ఆకట్టుకునేందుకు తమ టాలెంట్‌ను ప్రదర్శించారు.

  కెప్టెన్ పదవికి ఆ నలుగురు

  కెప్టెన్ పదవికి ఆ నలుగురు

  పాన్ షాపు టాస్క్ ముగిసిన తర్వాత ఇంటి సభ్యులందరినీ హాలులో బిగ్‌బాస్ సమావేశపరిచారు. పాన్ షాప్ టాస్క్‌లో ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన వారి నలుగురు సెలబ్రిటీల పేరు చెప్పమనగా సామ్రాట్, అమిత్, గీతా, దీప్తి నల్లమోతు పేర్లను పూజ చెప్పారు. దాంతో వారిని కెప్టెన్ టాస్క్‌కు అభ్యర్థులుగా నిర్ణయించారు.

  విగ్రహంలా నిలబడిన నలుగురు

  విగ్రహంలా నిలబడిన నలుగురు

  కెప్టెన్ టాస్క్ కోసం ఓ గద్దెపై నిలబడి విగ్రహంలా కనిపించాలన్నారు. గద్దె నుంచి కాలు కింద పెడితే వారు అనర్హులవుతారని బిగ్‌బాస్ రూల్ చెప్పాడు. దాంతో రకరకాల రంగులు శరీరానికి పూసుకొని టాస్క్‌లో భాగమయ్యారు. టాస్క్‌లో కౌశల్ అభ్యర్థులందరినీ ఏదో రకంగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు.

  దీప్తిని నెట్టిన బాబు గోగినేని

  దీప్తిని నెట్టిన బాబు గోగినేని

  దీప్తి నల్లమోతును బాబు గోగినేని ఉద్దేశపూర్వకంగా నెట్టివేయడంతో టాస్క్ నుంచి బయటకు వచ్చింది. అలాగే సామ్రాట్, అమిత్‌ను కౌశల్ నెట్టివేయడంతో వారిద్దరూ కూడా పోటీకి అనర్హులయ్యారు. దాంతో గీతా కెప్టెన్‌గా గీతా మాధురి ఎంపికైంది.

  నానికి ఫిర్యాదు చేసుకో

  నానికి ఫిర్యాదు చేసుకో

  కెప్టెన్‌గా నీ ఇంటెన్షన్ బయటపెట్టి ఇంటి రెండు వర్గాలు విడగొడుతున్నావని బాబు గోగినేని రెచ్చిపోయాడు. దానికి గీతా గట్టిగానే సమాధానం ఇచ్చింది. నా మాటలు, నేను నచ్చకపోతే బిగ్‌బాస్, నాని, ఇంక ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి. కెప్టెన్‌గా నా నిర్ణయం నాదే. నా గేమ్ నేను ఆడుతున్నాను. నాకు మద్దతుగా నిలిచిన కౌశల్‌పై ఎవరూ మాట్లాడకూడదు అని కౌశల్, సామ్రాట్‌కు ఝలక్ ఇచ్చింది. దాంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది.

  గొడవ కొనసాగింపు

  గొడవ కొనసాగింపు

  గురువారం ఎపిసోడ్ ముగిసినప్పటికి ఇంట్లో గీతా, బాబు గొడవ ప్రభావం కూడా కనిపించింది. గీతా కన్నీరు పెట్టుకోవడం కనిపించింది. ఏడుస్తున్న గీతాను దీప్తి ఊరడించడం జరిగింది. కౌశల్, గీతా మాధురిని ఇంటి నుంచి బయటకు పంపించడమే ఇక నా పని అని చివర్లో బాబు గోగినేని రెచ్చిపోయాడు. ఇలాంటి సీన్లకు పూర్తిగా శుక్రవారం ఎపిసోడ్‌లో వివరణ వచ్చే అవకాశం ఉంది.

  English summary
  Bigg Boss 2 Telugu 46 day highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. 45th day phone calls attended by celebraties. Babu Gogineni plans get out of Kaushal from house.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more