»   » ఉదయభాను ఓవర్ స్పీడు...బ్రేకేసిన బాలకృష్ణ,చిరంజీవి

ఉదయభాను ఓవర్ స్పీడు...బ్రేకేసిన బాలకృష్ణ,చిరంజీవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా పంక్షన్ లలో ఉదయభాను యాంకరింగ్ ఎంత ముచ్చటగా ఉంటుందో తెలియని వారు ఉండరు. అయితే ఆమె పంక్షన్ మధ్య వేసే సెటైర్లు, మధ్యలో మాటలు ఒక్కోసారి విసుగు తెప్పిస్తూంటాయని అంటూంటారు. అలాంటి సంఘటనే నిన్న జరిగిన టి సుబ్బరామిరెడ్డి అవార్డుల పంక్షన్ లో చోటు చేసుకుంది. ఆమె ఓవర్ స్పీడుకు బాలకృష్ణ, చిరంజీవి బ్రేక్ లు వేయాల్సి వచ్చింది. టి.సుబ్బరామిరెడ్డి అందిస్తున్న జాతీయ సినీ పురస్కారాల వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వివరాల్లోకి వెళితే..

టీఎస్ ఆర్ అవార్డుల పంక్షన్ లో యాంకరింగ్ చేస్తున్న ఉదయభాను...మొదట బాలకృష్ణ ఉత్తమనటుడు అవార్డు అందుకున్నప్పుడు మాట్లాడుతుంటే అడ్డుపడింది. ఆయన మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట కలపటానికి ప్రయత్నించింది. మొదట పట్టించుకోను బాలయ్య... తర్వాత ఉదయభాను ఉత్సాహం తగ్గకపోయేసరికి ఆపు నేను చెప్తా అని ఉదయభాను వంక సీరియస్ గా చూసారు. తర్వాత ఆయన తేరుకుని నవ్వేసి తేలికపరిచారు.

Balakrisha and Chiranjeevi Stop Uday Bhanu speed

మరి కాస్సేపటికి చిరంజీవి విషయంలో ఉదయభాను మళ్లి అలాగే స్పందించటం మొదలెట్టింది. ఆయన మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి 150 సినిమా ఎప్పుడు అంటూ ఒకటి రెండు సార్లు అడిగింది. దాంతో చిరంజీవి కాస్త ఆగు అన్నట్లు సైగ చేసారు. దాంతో ఉదయభాను ఆగింది. అలా బ్రేక్ లు పడ్డాయి.

చిరంజీవి మాట్లాడుతూ... ''పురస్కారాలు కళాకారులకు వూపిరిలా, ఉత్సాహంలా పనిచేస్తాయి. మరిన్ని అద్భుతాలు సృష్టించడానికి కావాల్సినంత ప్రోత్సాహాన్నిస్తాయి. మన చిత్రాలు ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని పొందుతున్నాయి. వాటి వెనక పురస్కారాల ప్రేరణ ఎంతో ఉంటుంది''అన్నారు మెగా స్టార్, ఎంపీ చిరంజీవి.

అలాగే చిరంజీవి మాట్లాడుతూ ''మా బాలయ్య బాబుకి అవార్డు వచ్చినందుకు అభినందిస్తున్నా. ఏ ఒక్కరినో సంతోషపెట్టడానికి పురస్కారాలు ఇవ్వరు. ప్రతిభను, కళల్ని ప్రోత్సహించే లక్ష్యంతోనే పురస్కారాలు అందజేస్తుంటారు.'బాహుబలి' లాంటి అత్యద్భుతమైన చిత్రాలు మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వస్తుండటం ఆనందంగా ఉంది. '300', 'ట్రాయ్‌'లాంటి సినిమాలకి దీటుగా 'బాహుబలి'ని తీసి తెలుగువారందరికీ గర్వకారణంలా నిలిచాడు రాజమౌళి'' అని ప్రశంసించారు.

'లెజెండ్‌'కిగానూ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకొన్న బాలకృష్ణ మాట్లాడుతూ ''కొత్తదనంతో కూడిన సినిమాలు చేయడానికి స్ఫూర్తి మా నాన్నగారు. ఆయనిచ్చిన ధైర్యంతోనే'ఆదిత్య 369', 'భైరవద్వీపం' లాంటి సినిమాలు చేశాను''అన్నారు.

English summary
Udahy Bahu over action cut by Chiranjeevi and Balakrishna at TSR AWARD Function.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu