Just In
- 25 min ago
మరో బిగ్ బడ్జెట్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ
- 27 min ago
‘ఆచార్య’ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్: స్పెషల్ డేను లాక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
- 42 min ago
దీప్తి సునయన అలాంటిది కాదు.. నోయల్ సెన్సేషనల్ కామెంట్స్
- 53 min ago
పవన్ కల్యాణ్ పేరిట సరికొత్త రికార్డు: ఏకంగా 90 గంటల నుంచి హవాను చూపిస్తూ సత్తా!
Don't Miss!
- Automobiles
ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో చేరిన 4 కొత్త కార్లు.. ఒక్కక్కటి 2 కోట్లకు పైమాటే
- News
చంద్రబాబు పిల్లర్లు కదులుతున్నాయ్ ; దేవినేని ఉమ ఒక లోఫర్ : ధ్వజమెత్తిన వల్లభనేని వంశీ
- Lifestyle
ఈ హార్మోన్ల సమస్య ఉన్న మహిళలు బరువు తగ్గడం చాలా కష్టం...!
- Finance
Budget 2021: 10 ఏళ్లలో బడ్జెట్‌కు ముందు సూచీలు ఇలా, ఇన్వెస్టర్లకు హెచ్చరిక!
- Sports
చరిత్ర సృష్టించిన భారత్.. బ్రిస్బేన్ టెస్టులో ఘన విజయం!! టెస్ట్ సిరీస్ టీమిండియాదే!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బయటపడ్డ అసలు విషయం.. మెహబూబ్ హింట్‌తో సోహెల్‌కు 25 లక్షలు.. వీడియో వైరల్
బిగ్ బాస్ షో తెలుగు సీజన్‌లో ఇప్పటి వరకు జరగనిది ఇప్పుడు జరిగింది. టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్లు ఎవ్వరూ కూడా డబ్బులు తీసుకుని బయటకు రాలేదు. కానీ మొదటి సారి నాల్గో సీజన్‌లో ఆ ఘట్టం జరిగింది. సోహెల్ 25 లక్షల బేరానికి సెటిల్‌మెంట్ చేసుకున్నాడు. ఇదే క్రమంలో సోహెల్ నిర్ణయంపై అనేక రకాలు వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు మాత్రం సోహెల్ చేసింది సరైన పనే అని అంటే.. ఓట్లు వేసిన వారి నమ్మకాన్ని కోల్పోయాడని కొందరు అంటున్నారు.

అఖిల్ కోసమా?
సోహెల్ 25 లక్షలకు బేరం కుదుర్చుకోవడంలో త్యాగం కూడా దాగి ఉందనే టాక్ బయటకు వచ్చింది. టాప్ 2లో ఉండాలన్నది అఖిల్ కల. మొదటి రోజు స్టేజ్ మీద కూడా అదే మాట చెప్పాడు. అలా అఖిల్ కల నెరవేర్చేందుకు సోహెల్ త్యాగం చేసినట్టు కనిపిస్తోంది.

రెండు రకాల లాభం..
అలా సోహెల్ రన్నర్ అనే ట్యాగ్‌ను వదులుకోవడం వల్ల స్నేహం కోసం త్యాగం చేశాడంటూ సోహెల్‌కు పేరు వస్తుంది.. దాంతో పాటు 25 లక్షల డబ్బు కూడా వస్తుంది. మొత్తానికి అలా రెండు రకాలుగా సోహెల్ లాభపడ్డట్టే. అయితే ఇలా డేరింగ్ స్టెప్ వేయడం వెనుక అసలు కథ ఉన్నట్టు కనిపిస్తోంది.

నిజం బయటపడింది..
టాప్ 5 కంటెస్టెంట్లను కలిసేందుకు రీ యూనియన్ అనే ప్రోగ్రాంను పెట్టుకున్నాడు. అదే బిగ్ బాస్ కొంపముంచినట్టుంది. రీయూనియన్‌లో భాగంగా ఇంటి లోపలికి వచ్చిన మెహబూబ్ సోహెల్‌కు అసలు విషయం లీక్ చేశాడు. అద్దాలపై వేళ్లతో సైగలు చేస్తూ గుట్టువిప్పాడు.

డబ్బులు తీసుకో..
సోహెల్‌కు మాత్రమే అర్థమయ్యేలా చేతులతో సైగలు చేశాడు. డబ్బులు తీసుకో అని చెప్పేలా సైగలున్నాయి. అదే సమయంలో సోహెల్ ఎన్నో స్థానంలో ఉన్నాడో కూడా హింట్ ఇచ్చాడు. ఇవన్నీ బేరీజు వేసుకునే సోహెల్ మంచి నిర్ణయం తీసుకున్నాడంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు.
|
మొత్తానికి అలా..
మెహబూబ్ అలా సిగ్నల్స్ ఇవ్వడంతో సోహెల్ నిర్ణయం తీసుకున్నాడంటూ.. వస్తోన్న రూమర్లపై సోహెల్ బయటకు వచ్చాక స్పందిస్తాడో లేదో చూడాలి. మొత్తానికి సోహెల్‌కు మాత్రం మంచే జరిగిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.