»   » కోరిక తీర్చమని బలవంతం.. తాకరాని చోట తాకాడు.. నిర్మాతపై నటి కేసు

కోరిక తీర్చమని బలవంతం.. తాకరాని చోట తాకాడు.. నిర్మాతపై నటి కేసు

Written By:
Subscribe to Filmibeat Telugu

తన కోరిక తీర్చమని బలవంతం చేశాడని, లేకపోతే సీరియల్ నుంచి తప్పిస్తానని బాబీజీ ఘర్ పర్ హై నిర్మాత బెదిరించారని టీవీ నటి శిల్పా షిండే ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఈ మేరకు నిర్మాత సంజయ్ కోహ్లీపై ముంబైలోని వాలీవ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

షూటింగ్‌ స్పాట్‌లోనే..

షూటింగ్‌ స్పాట్‌లోనే..

ముంబై, ఆహ్మదాబాద్ హైవే సమీపంలోని వాసాయి వద్ద షూటింగ్ జరుగుతున్న సమయంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె కోరారు.

నటి ఆరోపణలు నిజమే..

నటి ఆరోపణలు నిజమే..

లైంగిక వేధించాడంటూ నిర్మాత సంజయ్ కోహ్లీపై శిల్పా షిండే ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమే. తన కోరిక తీర్చమని డిమాండ్ చేశాడని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు అని వాలివ్ పోలీసులు మీడియాకు వివరించారు. ఆమె వాగ్మూలాన్ని రికార్డు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.

శిల్పా నుంచి స్టేట్‌మెంట్..

శిల్పా నుంచి స్టేట్‌మెంట్..

శిల్పా షిండే నుంచి ఫిర్యాదు తీసుకొన్నాం. ఆమె నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశాం. తాకరాని చోట నిర్మాత తనను పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె వెల్లడించింది అని పోలీసులు పేర్కొన్నారు.

కోహ్లీని త్వరలో విచారిస్తాం

కోహ్లీని త్వరలో విచారిస్తాం

ఆరోపణల ఆధారంగా నిర్మాత సంజయ్ కోహ్లీని త్వరలోనే విచారిస్తాం అని ఏసీపీ యోగేష్ కుమార్ తెలిపారు. సంజయ్ కోహ్లీపై లైంగిక వేధింపుల కేసును నమోదు చేశాం అని ఆయన మీడియాకు తెలిపారు.

English summary
The actress Shilpa Shinde accuses Sanjay Kohli, producer of serial Bhabhiji Ghar Par Hai, for allegedly demanding sexual favours if she wanted to stay in the show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu